హైదరాబాద్: ఐఎఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ పై అవమానపరుస్తూ కథనాన్ని రాసిన అవుట్ లుక్ జర్నలిస్టు మాధవి టాటాను సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు. ఆమె మంగళవారం పోలీసులు ఎదుట హాజరయ్యారు. 41 ఏ కింద కేసు నమోదు చేసిన పోలీసులు ...విచారణ హాజరు కావాలని నోటీసులు జారీ చేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ వివాదాస్పద కథనం మహిళా జర్నలిస్టు మాధవి టాటా పేరుతో ప్రచురితమైంది.
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌ను అవమానించే విధంగా ఔట్‌లుక్ ఆంగ్ల పత్రిక ఒక కథనంతో పాటు కార్టూన్ వేయడంపై ఆమె భర్త అకున్ సబర్వాల్ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు 509 ఐసీసీ, ఐటీ యాక్ట్ 67 సెక్షన్‌తో పాటు 3 ఆర్/డబ్ల్యూ సెక్షన్ల కింద ఔట్‌లుక్ యాజమాన్యంతో పాటు, ఉద్యోగులపై కేసు నమోదు చేశారు.
తెలంగాణా ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న స్మితా సబర్వాల్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇంగ్లీష్ మ్యాగ్జైన్ ఔట్లుక్ ఒక వివాదాస్పద కథనాన్ని ప్రచురించింది. ముఖ్యంగా గాసిప్ కాలంలో పత్రిక ప్రచురించిన అసభ్యకర కార్టూన్ పై విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే.