
ఔట్‌లుక్‌పై సీసీఎస్‌లో కేసు నమోదు
హైదరాబాద్: ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌ను అవమానించేవిధంగా ‘ఔట్‌లుక్’ మ్యాగజైన్ ఒక కథనంతో పాటు కార్టూన్‌ను వేశారని ఆమె భర్త అకున్ సబర్వాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద శనివారం ‘ఔట్‌లుక్’ పై కేసు నమోదు చేశారు.
509 ఐసీసీ, ఐటీ యాక్ట్ 67 సెక్షన్‌తో పాటు 3 ఆర్/డబ్ల్యూ సెక్షన్ల కింద ఔట్‌లుక్ యాజమాన్యంతో పాటు ఉద్యోగులపై కేసు నమోదు చేశామని సీసీఎస్ ఏసీపీ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు.