'కల్కి' హిట్ కావడం ఏమో గానీ బాలీవుడ్ మాఫియాకు ఏడుపు ఒక్కటే తక్కువైంది. తెలుగు సినిమాల వల్ల ఎప్పటికప్పుడు వరస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఎందుకంటే 'బాహుబలి'తో టాలీవుడ్ గ్రాఫ్ పెరగడం ఏమో గానీ బాలీవుడ్ పతనం మాత్రం అప్పటినుంచే మొదలైంది. ప్రభాస్ సినిమా హిట్ అయితే చాలు నార్త్ బ్యాచ్ అంతా దెప్పిపొడవడానికి రెడీగా ఉంటుంది. ఇప్పుడు కూడా అలానే 'కల్కి' వసూళ్ల గురించి నోటికొచ్చింది మాట్లాడి చిక్కులో పడ్డారు!
(ఇదీ చదవండి: 'కల్కి' ఖాతాలో నెవ్వర్ బిఫోర్ రికార్డ్.. బలైపోయిన షారూఖ్)
'బాహుబలి' సినిమాల తర్వాత టాలీవుడ్ రేంజ్ పెరిగిపోయింది. అప్పటివరకు ఇండియన్ మూవీ అంటే బాలీవుడ్ మాత్రమే అనుకునేవాళ్లు. కానీ ప్రభాస్ వల్ల తెలుగు సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా చాలామందికి తెలిసింది. ఇది బాలీవుడ్ హీరోలకు, అక్కడి క్రిటిక్స్‌కి మాత్రం పంటికింద రాయిలా మారింది. అవకాశం దొరికినప్పుడల్లా ప్రభాస్‌ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా 'కల్కి'కి రూ.1000 కోట్లు వస్తే.. అవి ఫేక్ వసూళ్లని చెప్పి ట్వీట్స్ చేశారు.
దీంతో 'కల్కి' నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సీరియస్ అయింది. సుమిత్ కడేల్, రోహిత్ జైశ్వాల్ అనే ఇద్దరు బాలీవుడ్ క్రిటిక్స్‌పై పరువు నష్టం దావా వేసింది. కలెక్షన్స్ ఫేక్ అని చేసిన ట్వీట్స్ అసలు ఎవరు చెబితే వేశారు? ఫేక్ అని ఫ్రూప్ ఏంటి? అనేది బయటపెట్టాలని.. లేదంటే రూ.25 కోట్లు ఇవ్వాలని 'కల్కి' టీమ్ వీళ్లకు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. అసలే సినిమా హిట్ అయిందనే షాక్‌లో ఉన్న బాలీవుడ్ మాఫియాకు.. ఇప్పుడు దావా అంటే దెబ్బ మీద దెబ్బే! మరీ క్రిటిక్సే ఈ ట్వీట్స్ వేశారా? లేదంటే వీళ్ల వెనక ఎవరైనా హిందీ హీరోలు ఉన్నారా అనేది అనుమానం!
(ఇదీ చదవండి: 'డార్లింగ్' సినిమా రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment