
సాక్షి, హైదరాబాద్: కొండా సురేఖపై పరువు నష్టం కేసులో నేడు నాంపల్లి కోర్టుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వెళ్లనున్నారు. కొండా సురేఖపై పరువు నష్టం కేసులో కేటీఆర్ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. ఇప్పటికే 23 రకాల ఆధారాలను కేటీఆర్ తరుపు న్యాయవాది కోర్టుకు అందజేశారు.
బీఎన్‌ఎస్ యాక్ట్ సెక్షన్ 356 కింద చర్యలు తీసుకోవాలంటూ కేటీఆర్ పిటిషన్‌లో కోరారు. కేటీఆర్‌తో పాటు నలుగురు సాక్షులు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమా, దాసోజు శ్రావణ్ స్టేట్‌మెంట్లను న్యాయస్థానం రికార్డు చేయనుంది. హీరో నాగార్జున పిటిషన్‌పై మంత్రి కొండా సురేఖకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
కొండా సురేఖ తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ కేటీఆర్ ఈ నెల 3న నాంపల్లి క్రిమినల్ కోర్టులో పరువునష్టం కేసు వేశారు. ఈ పిటిషన్‌ను ఈ నెల 14న విచారించిన కోర్టు విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది. కేటీఆర్ సహా సాక్షుల వాంగ్మూలాలను నేడు (శుక్రవారం) నమోదు చేస్తామని కోర్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment