
సాక్షి,హైదరాబాద్:మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువునష్టం పిటిషన్‌పై మంగళవారం(అక్టోబర్8) నాంపల్లికోర్టులో విచారణ జరగనుంది. నాగార్జున వాంగ్మూలాన్ని నమోదు చేయాలని కోర్టు ఆదేశించడంతో ఆయన కోర్టుకు హాజరుకానున్నారు.నాగార్జున వేసిన పిటిషన్‌పై సోమవారం నాంపల్లి ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది.
తమ కుటుంబ గౌరవం, ప్రతిష్ఠ దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయంటూ పిటిషన్‌లో నాగార్జున పేర్కొన్నారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది అశోక్‌రెడ్డి వాదనలు వినిపించారు.
కాగా, ఇటీవల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విమర్శించడంలో భాగంగా నాగార్జున కుటుంబంపై కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో నాగార్జున కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కొండాసురేఖపై సోషల్‌మీడియాలో విమర్శలు గుప్పించారు.

ఇదీ చదవండి: సమంతకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు
Comments
Please login to add a commentAdd a comment