
Samantha Defamation Petition : మూడు యూట్యూబ్ ఛానల్స్‌పై నటి సమంత వేసిన పరువు నష్టం దావా కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. మరోసారి వాదనలు విన్న తర్వాత తీర్పు ప్రకటిస్తామని కూకట్‌పల్లి కోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
కాగా సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం కలిగించేలా దుష్ప్రచారం చేశారంటూ సమంత కూకట్‌పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత జీవితంపై లేనిపోని అబద్ధాలు చెబతూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ సమంత పిటిషన్‌లో పేర్కొంది.
చదవండి: 'పరువునష్టం దావా వేసే బదులు ఆ పని చేయొచ్చు కదా'..
బెస్ట్‌ఫ్రెండ్‌తో కలిసి తీర్థయాత్రలకు వెళ్లిన సమంత