![Arguments Concluded in Kukatpally Court Over Samantha Petition - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/21/saaa_0.gif.webp?itok=2k3fNSzO)
Samantha Defamation Petition: సోషల్‌మీడియాలో తన పరువుకు నష్టం కలిగించేలా దుష్ప్రచారం చేశారంటూ సమంత వేసిన పిటిషన్‌పై కూకట్‌పల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. పరువు నష్టం దావా వేసే బదులు..వారి నుంచి క్షమాపణ అడగొచ్చు కదా అని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. 'సెలబ్రిటీల వ్యక్తిగత వివరాలు పబ్లిక్ డొమైన్‌లో పెట్టేది వారే.. పరువుకు నష్టం కలిగింది అనేది వారే' కదా అని కోర్టు పేర్కొంది. తీర్పును రేపటికి వాయిదా వేసింది. చదవండి : బెస్ట్‌ఫ్రెండ్‌తో కలిసి తీర్థయాత్రలకు వెళ్లిన సమంత
అయితే విడాకులు తీసుకోకుండానే సమంత జీవితం గురించి అభ్యంతరకర వీడియోలు, కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆమె తరపు న్యాయవాది బాలాజీ వాదనలు వినిపించారు. సమంత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆమెను టార్గెట్ చేసి వార్తలు రాశారని ఈ సందర్భంగా ఆయన కోర్టుకు వివరించారు. సమంత డబ్బు కోసం కేసులు వేయలేదని, రాజ్యాంగం తన హక్కులను కాలరాస్తున్నారని, వ్యక్తిగత జీవితంపై లేనిపోని అబద్ధాలు చెబతూ దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.చదవండి సరిగ్గా తింటున్నావా? ఆర్యన్‌ను ప్రశ్నించిన షారుక్
యూట్యూబ్‌లో ఉన్న వీడియోలను డిలీట్ చేయడమే కాకుండా, అన్‌కండిషనల్‌గా క్షమాపణ చెప్పాల్సిందిగా ఆమె తరపు లాయర్ తెలిపారు. భవిష్యత్తులో కూడా ఆమెపై కానీ ఆమె కుటుంబం పై కానీ ఎటువంటి దుష్ప్రచారం చేయకుండా ఆర్డర్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసినట్లు ఆయన కోర్టుకు వివరించారు.
చదవండి : షారుక్ కుమార్తె సుహానా ఖాన్‌కు డ్రగ్ డీలర్లతో లింకులు?
ఘనంగా వైవా హర్ష వివాహం..ఫోటోలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment