మూడు యూట్యూబ్ ఛానళ్లపై స్టార్ హీరోయిన్ సమంత వేసిన పరువునష్టం దావా కేసు విచారణ కూకట్‌పల్లి కోర్టులో జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా తన పరువుకు నష్టం కలిగేవిధంగా వ్యక్తిగత విషయాలపై సదరు యూట్యూబ్ ఛానళ్లు అభ్యంతరకర వార్తలు రాశాయని గత బుధవారం సమంత పటిషన్ దాఖలు చేశారు. దీతో తన క్లయింట్ పరువుకు నష్టం కలిగించేలా, వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కొన్ని యూట్యూబ్ ఛానళ్లు వ్యవహరించాయని సమంత తరపు న్యాయవాది బాలాజీ కోర్టులో వాదనలు వినిపించారు. భావప్రకటనా స్వేచ్ఛకు కూడా కొన్ని పరిమితుటుంటాయని, సమంతకు తన భర్త నాగచైతన్యతో విడాకులు మంజూరు కాకముందే సదరు యూట్యూబ్ ఛానళ్లు ఆమె వ్యక్తిగత, వృత్తిపర జీవితానికి ఇబ్బంది కలిగించాయని, తక్షణమే ఈ కేసును విచారించాలని కోరారు.
చదవండి: కోర్టును ఆశ్రయించిన సమంత
దీంతో ఏకీభవించిన న్యాయస్థానం కేసును విచారణకు స్వీకరించి సోమవారం(అక్టోబర్ 25’వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు సమంత పిటిషన్‌ను పూర్తిగా విచారించిన కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. సమంత తరపు న్యాయవాది వాదనలను పూర్తిగా విన్న న్యాయమూర్తి, తీర్పును రేపు వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. కాగా సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం కలిగించేలా దుష్ప్రచారం చేశారంటూ సమంత కూకట్‌పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత జీవితంపై లేనిపోని అబద్ధాలు చెబతూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ సమంత పిటిషన్‌లో పేర్కొంది.
చదవండి: యూట్యూబ్ ఛానళ్లకు మంచు విష్ణు హెచ్చరిక, అలా చేస్తే చర్యలు..
Comments
Please login to add a commentAdd a comment