సాక్షి,చైన్నె: యూట్యూబర్ ఎస్ శంకర్‌పై విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ కన్నెర్ర చేశారు. ఆయనపై ఏకంగా నాలుగు పరువు నష్టం దావాలను సోమవారం సైదాపేట కోర్టులో దాఖలు చేశారు. శంకర్ తనకు వ్యతిరేకంగా పదే పదే వీడియోలను విడుదల చేస్తూ వస్తున్నారని ఆ పిటిషన్లలో మంత్రి వివరించారు. మహారాష్ట్ర తరహాలో తమిళనాడులో ప్రభుత్వాన్ని కూల్చేందుకు తానేదో కుట్ర చేస్తున్నట్లుగా శంకర్ ఆధార రహిత ఆరోపణలు చేస్తున్నట్లు పేర్కొన్నా రు.
అలాగే, తాను టాస్మాక్‌బార్‌లను నిర్వహిస్తున్నట్లు ఆరోపించారని తెలిపారు. ఆధార రహిత ఆరోపణలు చేయడమే కాకుండా డీఎంకే అధిష్టానం తనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తప్పుడు సమాచారం ప్రజలకు అందజేస్తూ వస్తున్నాడని వివరించారు. తన పేరుకు, పరు వుకు కలంకం తెచ్చే విధంగా వ్యవహరిస్తున్న శంకర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ మేరకు కోర్టును కోరారు.
Comments
Please login to add a commentAdd a comment