మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసులో హీరో నాగార్జున వాంగ్మూలం
సిటీ కోర్టులు: రాజకీయ లబ్ధి కోసమే మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై తప్పుడు వ్యాఖ్యలు చేశారని సినీ నటుడు నాగార్జున నాంపల్లి కోర్టులో పేర్కొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలన్నీ అవాస్తవాలేనని.. వాటిలో ఎలాంటి నిజం లేదన్నారు. మంత్రిపై వేసిన క్రమినల్ పరువునష్టం కేసు విచారణలో భాగంగా మంగళవారం నాగార్జున తన సతీమణి అమల, కుమారుడు నాగచైతన్యతో కలిసి నాంపల్లిలోని స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజి్రస్టేట్ ఎక్సైజ్ కోర్టుకు హాజరయ్యారు. జడ్జి ఎస్.శ్రీదేవి ఎదుట ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చారు.
నాలుగు దశాబ్దాలుగా గౌరవప్రదంగా జీవిస్తున్నా
అక్కినేని వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాల గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగిసున్నానని నాగార్జున కోర్టుకు తెలిపారు. నటుడిగా, నిర్మాతగా, టీవీ వ్యాఖ్యాతగా, స్టూడియో యజమానిగా తాను, తన కుటుంబం ప్రజల ఆద రాభిమానాలు పొందుతున్నామన్నారు. తన కుమారుడు నాగచైతన్య సైతం సినీ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రేక్షకుల ప్రశంసలు పొందుతున్నాడ న్నారు. కానీ తన కుమారుడి వైవాహిక జీవితాన్ని ఉద్దేశించి కొండా సురేఖ మాట్లాడిన మాటలు ప్రజలను తప్పుదోవ పట్టించాయని పేర్కొన్నారు.
ఇందుకు సంబంధించిన వీడియోలు, పేపర్ క్లిప్పింగ్‌ల వల్ల తమ కుటుంబం పరువు పోయిందని.. తాము ఎంతో కలత చెందామని చెప్పారు. అందుకే మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకుని తమ కుటుంబ పరువు కాపాడాలని కోరారు. నాగార్జునతోపాటు ఆయన తరఫు సాక్షిగా సుప్రియ వాంగ్మూలాన్ని కూడా కోర్టు నమోదు చేసింది. అనంతరం నాగార్జున తరుఫు న్యాయవాది అశోక్‌రెడ్డి కొండా సురేఖ మాట్లాడిన వీడియోతో కూడిన పెన్‌డ్రైవ్, పేపర్ క్లిప్పింగ్‌లను మెమోతోపాటు కోర్టుకు సమరి్పంచారు. సాక్షుల స్టేట్‌మెంట్ సమయంలో కొండా çసురేఖ తరుఫు న్యాయవాది, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ తిరుపతి వర్మ, సురేఖ కూడా హాజరయ్యారు. ఈ మేరకు విచారణ చేపట్టిన కోర్టు విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment