
Samantha Defamation Case Judgment: కూకట్‌పల్లి కోర్టులో సమంతకు భారీ ఊరట లభించింది. సమంత వ్యక్తిగత వివరాలను ప్రసారం చేయడానికి వీళ్లేదని, యూట్యూబ్ ఛానెల్స్ వెంటనే అలాంటి కంటెంట్‌ని తొలగించాలని ఆదేశించింది. ఆమె వ్యక్తిగత విషయాలపై సోషల్ మీడియాలో పెట్టిన కామెంట్స్‌ని కూడా తొలగించాలని హితవు పలికింది. సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం కలిగించేలా దుష్ప్రచారం చేశారంటూ సమంత దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం కూకట్‌పల్లి కోర్టు విచారించింది. సమంత ప్రతిష్టకు నష్టం కలిగించేలా వ్యవహరించిన రెండు యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులు, డాక్టర్ సీఎల్ వెంకట్ రావు ప్రసారాలు చేసిన యూట్యూబ్ లింకులను వెంటనే తొలగించాలని కూకట్ పల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కాగా సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం కలిగించేలా దుష్ప్రచారం చేశారంటూ సమంత కూకట్‌పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత జీవితంపై లేనిపోని అబద్ధాలు చెబతూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ సమంత పిటిషన్‌లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment