
కూకట్‌పల్లి (హైదరాబాద్): వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించారంటూ యూట్యూబ్ చానళ్లు నిర్వహిస్తోన్న సుమన్ టీవీ, తెలుగుపాపులర్ టీవీ, డాక్టర్ సీఎల్ వెంకట్‌రావులపై సినీనటి సమంత గురువారం కూకట్‌పల్లి కోర్టులో ఇన్‌జంక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. సమంత తరఫు న్యాయవాది బాలాజీ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
తాము విడిపోతున్నామంటూ సమంత, నాగచైతన్య దంపతులు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా వెల్లడించిన అనంతరం సుమన్ టీవీ, తెలుగుపాపులర్ టీవీ, డాక్టర్ సీఎల్ వెంకట్‌రావులు సమంత పరువుకు నష్టం కలిగించేలా వీడియోలు అప్‌లోడ్ చేయడంతో పాటు వ్యాఖ్యలు కూడా చేశారని తెలిపారు.
వెంటనే వీటిని తొలగించాలని, సమంత పరువుకు నష్టం కలిగించేలా వ్యవహరించిన వీరు క్షమాపణ చెప్పాలని కోరుతూ కోర్టులో పర్మినెంట్ ఇన్‌జంక్షన్ పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. వాదనల అనంతరం న్యాయమూర్తి తీర్పును రిజర్వులో పెట్టినట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment