సాక్షి,హైదరాబాద్:సీఎం రేవంత్‌రెడ్డిపై పరువునష్టం కేసు విచారణ వాయిదా పడింది. బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు వేసిన పరువు నష్టం కేసు విచారణను నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు అక్టోబర్16కు వాయిదా వేసింది.పార్లమెంటు ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేశారని ఆరోపిస్తూ బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం కేసు వేశారు.
బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తేస్తుందని రేవంత్ ప్రచారం చేశారని పిటిషన్‌లో తెలిపారు. ఈ కేసులో సెప్టెంబర్ 25వ తేదీన విచారణకు హాజరు కావాలని రేవంత్‌రెడ్డికి కోర్టు ఇప్పటికే సమన్లు జారీ చేసింది.అధికారిక కార్యక్రమాల్లో సీఎం తీరిక లేకుండా ఉన్నారని రేవంత్‌రెడ్డి న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో పర్సనల్ బాండ్, రూ.15వేల పూచీకత్తు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
ఇదీ చదవండి: మరో 35 వేల పోస్టులకు నోటిఫికేషన్: సీఎం రేవంత్
Comments
Please login to add a commentAdd a comment