లక్నో : 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై నమోదైన పరువు నష్టం దావా కేసు విచారణ ఏప్రిల్ 22కి వాయిదా పడింది. ప్రత్యక కోర్టు న్యాయమూర్తి సెలువులో ఉన్న కారణంగా కేసు వాయిదా పడినట్లు తెలుస్తోంది.
రాహుల్ గాంధీ.. హోమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం సుల్తాన్ పూర్ జిల్లాకు చెందిన బీజేపీ నేత విజయ్ మిశ్రా సుల్తాన్ పూర్ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. మిశ్రా తరపు న్యాయవాది సంతోష్ పాండే మాట్లాడుతూ.. పరువు నష్టం దావా కేసులో రాహుల్ గాంధీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ కోర్టుకు దరఖాస్తు చేశామన్నారు. కానీ న్యాయమూర్తి సెలవులో ఉన్నందున విచారణ జరగలేదని, ఏప్రిల్ 22కి వాయిదా వేసినట్లు తెలిపారు.
2018 మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బెంగళూరులో నిర్వహించిన జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ.. అమిత్ షాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నిజాయితీ, స్వచ్ఛమైన రాజకీయాలను విశ్వసిస్తుందని చెబుతున్నప్పటికీ, హత్య కేసులో నిందితుడుగా ఉన్న వ్యక్తి పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారని అన్నారు. అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఆగస్టు 4, 2018న రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. అప్పటి నుంచి కేసు విచారణ కొనసాగుతుంది
కాగా, ఈ కేసులో గతేడాది డిసెంబర్‌లో రాహుల్ గాంధీపై కోర్టు వారెంట్ జారీ చేసింది. తదనంతరం, రాహుల్ గాంధీ ఫిబ్రవరి 20న అమేథీలో భారత్ జోడో న్యాయ్ యాత్రను నిలిపివేసి, కోర్టు నుంచి బెయిల్ పొందారు.
Comments
Please login to add a commentAdd a comment