భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దిగ్విజయ్ సింగ్ భారతీయ జనతా పార్టీ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.25కోట్ల నుంచి రూ.45కోట్ల లంచం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, నరోత్తమ్ మిశ్రా వ్యూహాలు పన్నుతున్నారని చెప్పారు. ప్రతిపక్షంలో ఉండడం ఇష్టం లేక బహిరంగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని దిగ్విజయ్ పేర్కొన్నారు. చదవండి: పొత్తులపై క్లారిటీ.. నితీష్‌ను టార్గెట్ చేసిన ప్రశాంత్
అయితే ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే ఇప్పటికిప్పుడు రూ.5కోట్లు.. బలనిరూపణ సమయంలో మిగిలిన డబ్బును అందించనున్నట్లు బీజేపీ సంప్రదింపులు జరిపిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని దిగ్విజయ్ తెలిపారు. అయితే మధ్యప్రదేశ్‌ని కర్ణాటకలా మార్చాలని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కాగా.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 230 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 109, కాంగ్రెస్ 114 స్థానాలను గెలుచుకోగా.. కాంగ్రెస్ పార్టీ నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బీఎస్పీ, ఒక ఎస్పీ ఎమ్మెల్యే సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. చదవండి: ఢిల్లీ అల్లర్లపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment