
భోపాల్: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ-గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్ పార్టీ శూన్యమని నొక్కి చెప్పారు. మరోవైపు.. వివిధ రాష్ట్రాల్లో పార్టీలో తలెత్తిన సంక్షోభంపై మాట్లాడారు. ‘చాలా సార్లు పార్టీలో చీలికలు వచ్చాయి. కానీ 99 శాతం కాంగ్రెస్ నేతలు దేశానికి స్వంతంత్రానికి ముందు, తర్వాత సేవ చేసిన కుటుంబానికి మద్దుతుగానే నిలిచారు. నెహ్రూ-గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్‌కు గుర్తింపే లేదు.’ అని పేర్కొన్నారు.
రాజస్థాన్ సంక్షోభం దురదృష్టకరం..
అశోక్ గెహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయటంతో రాజస్థాన్‌లో సంక్షోభం తలెత్తిన పరిస్థితులు దురదృష్టకరమన్నారు దిగ్విజయ్ సింగ్. పార్టీ అధ్యక్ష పదవికి గెహ్లోట్ పోటీ చేస్తే.. ఆయన నిర్ణయాన‍్ని అధిష్టానం గౌరవించేదన్నారు. ‘ఇప్పటికీ, అశోక్ గెహ్లోత్ అధికారిక అభ్యర్థిగా భావిస్తున్నాం. ఆయన పోటీలో ఉంటే దానిని స్వాగతిస్తాం. ఆయన ఎల్లప్పుడూ కాంగ్రెస్‌కు విధేయుడిగానే ఉన్నారు. కానీ, రాజస్థాన్‌లో తలెత్తిన దురదృష్టకర పరిస్థితులతో ఆయన తప్పుకోవాల్సి వచ్చింది.’ అని తెలిపారు దిగ్విజయ్ సింగ్.
ఇదీ చదవండి: దిగ్విజయ్‌తో థరూర్ భేటీ.. అధ్యక్ష ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment