మోదీపై డిగ్గీరాజా అనుచిత పోస్ట్
సోషల్ మీడియాలో దిగ్విజయ్ సింగ్ మరోసారి మంట పెట్టారు. ఏకంగా ప్రధాని మోదీపై అసభ్య...
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్‌లో మరోసారి మంటపెట్టారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ఓ అనుచిత ఫోటో(మెమె)ను శుక్రవారం దిగ్విజయ్ పోస్ట్ చేశారు.
మోదీ, ఆయన అనుచరులను మరీ ముఖ్యంగా ఆయన భక్తులుగా అభివర్ణించుకునే వారిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో ఓ రెండు వ్యాఖ్యలు అందులో ఉన్నాయి. ఇది తన పోస్ట్ కాదంటూనే ఆయన చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది.
రాజ్యసభ ఎంపీ అయిన దిగ్విజయ్ సింగ్ గతంలో తెలంగాణ ప్రభుత్వంపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే.