
29న టీపీసీసీ సమన్వయ కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాహుల్‌గాంధీ సందేశ్ యాత్ర నిర్వహణ, రిజ ర్వుడు నియోజకవర్గా ల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించడానికి ఈ నెల 29న టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం సూర్యాపేటలో జరుగనుంది. రాష్ట్రపార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్‌సింగ్‌తో పాటు టీపీసీసీ ముఖ్యులంతా ఈ భేటీలో పాల్గొననున్నారు. అలాగే పార్టీ అంతర్గత అంశాలు, బాబు జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకల నిర్వహణపై కూడా చర్చించనున్నారు.
ఢిల్లీకి టీపీసీసీ నేతలు..
రాష్ట్రపతి అభ్యర్థిగా మీరాకుమార్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి టీపీసీసీ నేతలంతా మంగళవారం ఢిల్లీకి బయలుదేరనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేత కె.జానారెడ్డి, షబ్బీర్ అలీతో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలంతా ఢిల్లీకి వెళ్తున్నారు. అలాగే ఈ నెల 28న మియాపూర్ భూ కుంభకోణంపై ఫిర్యాదు చేయడానికి అఖిలపక్షనేతలను కూడా ఇప్పటికే ఉత్తమ్ ఆహ్వానించారు. అఖిలపక్షాలతో కలసి కేంద్ర హోంమంత్రికి ఈ భూముల కుంభకోణంపై ఫిర్యాదు చేయనున్నారు.