
భోపాల్: కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాషాయ వస్త్రాలు తొడుక్కున్న వారు అత్యాచారాలు చేస్తున్నారని, అవి దేవాలయాల్లో కూడా చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఈ చర్యలతో సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తున్నారని మంగళవారం వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి కుటుంబం నుంచి వేరయ్యాక సాధువుగా మారతారని, ఆధ్యాత్మికతను సంతరించుకుంటారని అన్నారు. అయితే ఇప్పుడు కాషాయ వస్త్రం ధరించిన వాళ్లు నకిలీ ద్రవాలను అమ్ముతున్నారన్నారు. ఈ కాషాయ వస్త్రాల మాటునే దేవాలయాల్లో కూడా అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. ఇలాంటి చర్యలు క్షమార్హం కానివని, దేవుడు కూడా వారిని క్షమించడని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో స్వామి చిన్మయానంద్ మీద ఓలా విద్యార్థిని అత్యాచార ఆరోపణలు చేయగా, ఈ ఘటనను ఉద్దేశించే దిగ్విజయ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై వివాదం రేగడంతో సాయంత్రం ఒక ట్వీట్ చేశారు. ‘హిందూ సాధువులు మన ఆధ్యాత్మిక విశ్వాసానికి గుర్తు. అందుకే వారి నుంచి మంచితనాన్ని ఆశిస్తాం. సనాతన ధర్మాన్ని కాపాడడం మన విధి’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment