saffron clothes
-
యూపీ సీఎం కాషాయ దుస్తులపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
ముంబై: కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి హుస్సేన్ దల్వాయి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగి కాషాయ దుస్తులు ధరించడం మానేయాలని ఆయన వ్యాఖ్యానించారు. ఆదిత్యనాథ్ తన రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించాలంటే ఆధునిక దుస్తులను ధరించడం అలవర్చుకోవాలని అన్నారు. ఈమేరకు యూపీ సీఎంపై కాంగ్రెస్ నేత తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే నెలలో(ఫిబ్రవరి) లక్నోలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుంది. ఈ క్రమంలో దేశ, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రెండు రోజుల నిమిత్తం దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దల్వాయి మాట్లాడుతూ.. మహారాష్ట్ర నుంచి యోగి పరిశ్రమలను తీసుకెళ్లకుండా తన సొంత రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను ఏర్పాటు దిశగా కృషి చేస్తే బాగుంటుందని మండిపడ్డారు. ఇక్కడి నుంచి తీసుకెళ్లకండి! ‘పరిశ్రమలకు మహారాష్ట్ర మంచి సదుపాయలను కల్పించింది. కాబట్టి ఇక్కడి నుంచి పరిశ్రమలను తీసుకోకుండా రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలి. వాటి అభివృకి అవసరమైన అనుకూల వాతావరణాన్ని కల్పించండి. పరిశ్రమ అనేది ఆధునికతకు ప్రతీక ..యూపీ సీఎం కొంత ఆధునికతను పెంపొందించుకోవాలి. ప్రతి రోజు మతం గురించి మాట్లాడకండి. కాషాయ బట్టలు ధరించడం మానేయండి. కొంచెం మాడ్రన్గా ఉండటానికి ప్రయత్నించండి. ఆధునిక ఆలోచనలను అలవర్చుకోవాలి’ అంటూ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా ఉత్తర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కు విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించడానికి.. రాష్ట్రంలోని వివిధ రంగాలలలో ఉన్న అవకాశాలను వారికి అందించేందుకు స్వయంగా సీఎం రంగంలోకి దిగారు. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, బ్యాంకర్లతో పాటు ప్రముఖ సినీ ప్రముఖులతో గురువారం సమావేశమవ్వనున్నారు. అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబై నుంచి దేశీయ రోడ్షోలను ప్రారంభించనున్నారు. చదవండి: ఎమ్మెల్యే ధనంజయ్ ముండేకు కారు ప్రమాదం -
కాషాయం మాటున అత్యాచారాలు
భోపాల్: కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాషాయ వస్త్రాలు తొడుక్కున్న వారు అత్యాచారాలు చేస్తున్నారని, అవి దేవాలయాల్లో కూడా చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఈ చర్యలతో సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తున్నారని మంగళవారం వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి కుటుంబం నుంచి వేరయ్యాక సాధువుగా మారతారని, ఆధ్యాత్మికతను సంతరించుకుంటారని అన్నారు. అయితే ఇప్పుడు కాషాయ వస్త్రం ధరించిన వాళ్లు నకిలీ ద్రవాలను అమ్ముతున్నారన్నారు. ఈ కాషాయ వస్త్రాల మాటునే దేవాలయాల్లో కూడా అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. ఇలాంటి చర్యలు క్షమార్హం కానివని, దేవుడు కూడా వారిని క్షమించడని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లో స్వామి చిన్మయానంద్ మీద ఓలా విద్యార్థిని అత్యాచార ఆరోపణలు చేయగా, ఈ ఘటనను ఉద్దేశించే దిగ్విజయ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై వివాదం రేగడంతో సాయంత్రం ఒక ట్వీట్ చేశారు. ‘హిందూ సాధువులు మన ఆధ్యాత్మిక విశ్వాసానికి గుర్తు. అందుకే వారి నుంచి మంచితనాన్ని ఆశిస్తాం. సనాతన ధర్మాన్ని కాపాడడం మన విధి’ అని ట్వీట్లో పేర్కొన్నారు. -
అంత వైరాగ్యం లేదు..
ఇప్పుడే తనకు అంత వైరాగ్యం లేదని మనీషా కొయిరాలా చెబుతోంది. ఇటీవల సాధువులు నిర్వహించిన ఒక కార్యక్రమంలో మనీషా కాషాయ వస్త్రాలతో కనిపించడంతో, సాధ్విగా మారే ఆలోచనలో ఉన్నారా అని ప్రశ్నిస్తే, ఆమె మీడియా ప్రతినిధులకు సుదీర్ఘ వివరణ ఇచ్చింది. ఇదివరకు కూడా పలు సందర్భాల్లో తాను కాషాయ వస్త్రాలు ధరించానని చెప్పింది. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడమంటే కేవలం కాషాయ వస్త్రాలు ధరించడంతోనే సరిపోదని, అందుకు చాలా మనోబలం ఉండాలని వ్యాఖ్యానించింది.