సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్.. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి జోతిరాధిత్య సింధియా. దిగ్విజయ్ ఎన్ని మాటలు అన్నా.. సింధియా కుటుంబ స్థాయిని నిలబెట్టే విధంగా వ్యవహరిస్తానని ఆయన చెప్పారు. డిగ్గీ స్థాయికి దిగి తాను అలాంటి మాటలు అనలేనని సింధియా తేల్చి చెప్పారు.
(చదవండి: మీరే నన్ను చంపేశారు.. నేనే బతికే ఉన్నానయ్య)
ఇంతకీ దిగ్విజయ్ ఏం అన్నారంటే..
రఘోఘర్ లో శనివారం రాత్రి జరిగిన పబ్లిక్ మీటింగ్‌లో జోతిరాధిత్య సింధియా ఓ ద్రోహి అంటూ దిగ్విజయ్ వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా దోహులే అన్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత చెప్పుకొచ్చారు.
దిగ్విజయ్ వివాదాస్పద వ్యాఖ్యలపై మరుసటి రోజు సింధియా స్పందిచారు. 'అలా మాట్లాటడం ఆయనకు అలవాటే. ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఆయన స్థాయికి దిగజారి నేను మాట్లాడలేను' అని సింధియా పేర్కొన్నారు. కాగా, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి.. బీజేపీ సర్కారు ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు సింధియా. అప్పటి నుంచి కాంగ్రెస్ నాయకులు వీలు చిక్కినప్పుడల్లా ఆయనపై విరుచుకుపడుతున్నారు.
(చదవండి: బీజేపీపై సంచలన ఆరోపణలు: కేబినెట్ బెర్త్, డబ్బు ఇస్తామన్నారు!)
Comments
Please login to add a commentAdd a comment