సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భోపాల్ ఎంపీ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. సకాలంలో పోలింగ్ కేంద్రానికి చేరుకోలేకపోవడం వల్ల ఓటు వేయలేకపోయినట్లు ఆయన వివరణ ఇచ్చుకున్నారు. మధ్యప్రదేశ్‌లని రాజ్‌ఘర్ ఓటర్ల జాబితాలో దిగ్విజయ్ సింగ్ పేరు ఉంది. అది ఆయన స్వస్థలం. భోపాల్ నుంచి సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజ్‌ఘర్‌కు డిగ్గీ రాజా చేరుకోలేకపోయారు. సాయంత్రం వరకూ దిగ్విజయ్ సింగ్ పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తూ భోపాల్‌లోనే ఉండిపోయారని, సాయంత్రం రాజ్‌ఘర్‌కు బయలుదేరినప్పటికీ.. సకాలంలో పోలింగ్ కేంద్రానికి చేరుకోలేకపోయారని పార్టీ నాయకులు చెబుతున్నారు.
చదవండి : ముగిసిన ఆరో విడత పోలింగ్
కాకాఓటు వేయలేకపోవడం పట్ల దిగ్విజయ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు వేయలేకపోయినందుకు క్షమించాలని ఆయన కోరారు. వచ్చే ఎన్నికల నాటికి తన ఓటును రాజ్‌ఘర్ నుంచి భోపాల్‌కు మార్చుకుంటానని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంతి తన ఓటు హక్కును తాను వినియోగించుకోకపోవడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. ప్రత్యర్థి పార్టీ నాయకులు దిగ్విజయ్‌పై విమర్శల దాడికి దిగారు. ఇలాంటి వారిని పెట్టుకుని రాహుల్ గాంధీ ఏం సాధిస్తారంటూ ఎద్దేవా చేస్తున్నారు.
ఆరో విడత సార్వత్రిక ఎన్నికలు ఆదివారం ముగిశాయి. ఏడు రాష్ట్రాల్లోని 59 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో 63.48 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. పోలింగ్‌లో పశ్చిమబెంగాల్ (80.35 %)మరోసారి అగ్రస్థానంలో నిలవగా, హరియాణా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, బిహార్, యూపీలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment