‘డ్రగ్స్‌ కేసులో టీఆర్‌ఎస్‌ వారసుడి ఫ్రెండ్స్‌’ | Influential friends of TRS heir apparent involved in drug scam, says digvijaya singh | Sakshi
Sakshi News home page

‘డ్రగ్స్‌ కేసులో టీఆర్‌ఎస్‌ వారసుడి ఫ్రెండ్స్‌’

Published Thu, Jul 20 2017 10:12 AM | Last Updated on Fri, May 25 2018 2:37 PM

‘డ్రగ్స్‌ కేసులో టీఆర్‌ఎస్‌ వారసుడి ఫ్రెండ్స్‌’ - Sakshi

‘డ్రగ్స్‌ కేసులో టీఆర్‌ఎస్‌ వారసుడి ఫ్రెండ్స్‌’

హైదరాబాద్‌: డ్రగ్స్‌ వ్యవహారంపై కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ సంచలన ఆరోపణలు చేశారు. టీఆర్‌ఎస్‌ వారసుడి స్నేహితులకు ఈ వ్యవహరంతో సంబంధ ఉందని ఆయన పేర్కొన్నారు. ‘తెలంగాణలో పెద్ద డ్రగ్స్‌ స్కామ్‌ జరిగింది. ఇందులో టీఆర్‌ఎస్‌ వారసుడి మిత్రులు ఉన్నట్టుగా కనబడుతోంది. వీరిని విచారిస్తారో, కాపాడతారో చూడాలి’ అంటూ దిగ్విజయ్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ ముఠా పట్టుబడడంతో సినీ ప్రముఖులను ప్రత్యేక పోలీసు బృందం(సిట్‌) విచారిస్తున్న నేపథ్యంలో దిగ్విజయ్‌ తీవ్ర ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

కాగా, దిగ్విజయ్‌ సింగ్‌ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో స్పందించారు. ‘మీరు పూర్తిగా విచక్షణ కోల్పోయారు. గౌరవంగా రిటైర్‌ కావాల్సిన సమయం ఆసన్నమైంది. మీ వయసుకు తగ్గట్టుగా నడుచుకోండి. తెలంగాణ స్పెల్లింగ్ కరెక్ట్‌గా రాయడం నేర్చుకున్నందుకు సంతోషమ’ని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. దిగ్విజయ్‌ సింగ్‌ గతంలో ట్విటర్‌లో తెలంగాణ స్పెల్లింగ్‌ను తప్పుగా రాసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement