
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో భోపాల్ నుంచి సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌పై సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌ను బరిలో దింపాలని బీజేపీ యోచిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని సాగర్, విదిశ, గుణ లోక్‌సభ నియోజకవర్గాలకు ఇప్పటికే అభ్యర్ధులను ఖరారు చేసిన కాషాయ పార్టీ భోపాల్‌లో డిగ్గీరాజాకు దీటైన అభ్యర్ధిని పోటీలో నిలపాలని భావిస్తోంది.
కాగా,పార్టీ ఆదేశిస్తే తాను భోపాల్‌లో దిగ్విజయ్ సింగ్‌పై పోటీ చేసేందుకు సిద్ధమని సాధ్వి ప్రగ్యా స్పష్టం చేశారు. తాను జాతీయవాదినని, దిగ్విజయ్ సింగ్ మాత్రం తరచూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారని డిగ్గీరాజాను దుయ్యబట్టారు. తనకు దిగ్విజయ్ సింగ్ ఎంతమాత్రం పోటీ కాదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment