Bangladesh: హిందూ టీచర్ల బలవంతపు రాజీనామాలు | Hindu Teachers Targeted In Bangladesh, 49 Teachers Mobbed And Forced To Resign, See Details Inside | Sakshi
Sakshi News home page

Bangladesh: హిందూ టీచర్ల బలవంతపు రాజీనామాలు

Published Sun, Sep 1 2024 1:27 PM | Last Updated on Sun, Sep 1 2024 5:05 PM

Hindu Teachers Targeted in Bangladesh

ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయినప్పటి నుండి, హిందూ ఉపాధ్యాయులు తమ ప్రభుత్వ  ఉద్యోగాలకు రాజీనామా చేయవలసి వస్తోంది. నిరసనకారులు పాఠశాలలు, కళాశాలలకు వచ్చి పలు నినాదాలు చేస్తూ హిందూ ఉపాధ్యాయులు రాజీనామా చేయాలని కోరుతూ వారిపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపధ్యంలో 50 మంది హిందూ ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలను వదిలిపెట్టారు.

బంగ్లాదేశ్ వార్తాపత్రిక ప్రోథోమ్ అలో తెలిపిన వివరాల ప్రకారం ఆగష్టు 29న కొందరు విద్యార్థులు బరిషల్‌లోని బకర్‌గంజ్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ శుక్లా రాణి హల్డర్ కార్యాలయాన్ని ముట్టడించి, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆమె కొద్దిసేపు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆమె ఖాళీ కాగితంపై నేను రాజీనామా చేస్తున్నాను అని అని రాసి, వారికి ఇచ్చారు.

ఆగస్ట్ 18న అజింపూర్ ప్రభుత్వ బాలికల పాఠశాల, కళాశాలకు చెందిన 50 మంది బాలికలు ప్రిన్సిపాల్ గీతాంజలి బారువా, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ గౌతమ్ చంద్ర పాల్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ షహనాజా అక్తర్‌లను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  డైలీ స్టార్ వార్తాపత్రికతో బారువా మాట్లాడుతూ 'ఆగస్టు 18కి ముందు వారు ఎప్పుడూ నా రాజీనామాను అడగలేదు. ఆ రోజు ఉదయం వారు నా కార్యాలయంలోకి చొరబడి నన్ను అవమానించారు’ అని ఆమె తెలిపారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోలలో ఉపాధ్యాయులను విద్యార్థులు చుట్టుముట్టడం, రాజీనామా లేఖలపై బలవంతంగా సంతకం చేయించడం కనిపిస్తుంది.

కబీ నజ్రుల్ యూనివర్శిటీలోని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ స్టడీస్ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ షంజయ్ కుమార్ ముఖర్జీ మీడియాతో మాట్లాడుతూ తాను డిపార్ట్‌మెంట్ హెడ్ పదవికి బలవంతంగా రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ సమయంలో బంగ్లాదేశ్‌కు చెందిన రచయిత్రి తస్లీమా నస్రీన్ మైనారిటీ హిందువులకు మద్దతుగా మాట్లాడారు. బంగ్లాదేశ్‌లోని ఉపాధ్యాయులను బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తాత్కాలిక అధ్యక్షుడు యూనస్  ఈ అంశంపై స్పందించడం లేదన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement