
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న గద్దర్ తదితరులు
గన్‌ఫౌండ్రీ: బహుజనులకు రాజ్యాధికారం తీసుకురావడమే లక్ష్యంగా తర్వలో ఓట్ల రాజకీయాల వైపు పయనిస్తున్నట్లు ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. సోమవారం బషీర్‌బాగ్‌లోని పీజీ న్యాయ కళాశాలలో సూడ్టెంట్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ రచించిన తెలంగాణలో బహుజనుల రాజ్యం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ... బహుజన మేధావులు అందరూ ఐక్యం కావాలని సూచించారు.
దేశంలో అసలైన బహుజనులు అంటే మహిళలే అని, వారికి ముందుగా బహుజన సిద్ధాంతాలను తెలియజేయాలన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ... బహుజనులలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. బహుజనుల అభివృద్ధికి వైఎస్‌ఆర్‌సీపీ కృషి చేస్తుందన్నారు. న్యాయ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ... భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం కానీ బహుజన తెలంగాణ రాలేదన్నారు. అనంతరం ఇటీవల మరణించిన పౌరహక్కుల నేత బొజ్జా తారకంకు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జి. సత్యనారాయణ, ప్రొఫెసర్ అన్సారీ, ప్రొఫెసర్ చంద్రన్‌లతో పాటు కళాశాల బోధన సిబ్బంది, స్టూడెంట్స్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.