న్యూఢిల్లీ: సాంకేతికత ఆధారిత ఆర్థిక సేవల ద్వారా 50 కోట్ల మంది భారతీయులను ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నట్టు పేటీఎం గ్రూప్ సీఎఫ్‌వో, ప్రెసిడెంట్ మధుర్ డియోరా తెలిపారు. ‘పాయింట్ ఆఫ్ సేల్స్ (పీవోఎస్) కోసం ఇటీవల పలు బ్యాంకులతో భాగస్వామ్యం ప్రకటించాం. హెచ్‌డీఎఫ్‌సీతోపాటు ఇతర బ్యాంకులతో చేతులు కలిపాం. ఇది పెద్ద ఫార్మాట్ రిటైలర్ మార్కెట్లో విస్తరణకు దోహదం చేస్తోంది. పోటీ సంస్థల కస్టమర్లూ మా ప్లాట్‌ఫాంకు మళ్లుతున్నారు. చెల్లింపు ఉత్పత్తులతో మధ్యస్థాయి మార్కెట్, స్టార్టప్ రంగాన్ని ఆక ర్శించడంలో అవకాశాలను చూస్తున్నాం. డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలు నిక్షిప్తం చేయాల్సిన అవసరం లేకుండా పేటీఎం టోకెన్ గేట్‌వే కోసం మింత్రా, ఓయో, డామినోస్ తదితర సంస్థలు పేటీఎంతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment