సాగును లాభసాటి చేద్దాం | prafit agriculture our target | Sakshi
Sakshi News home page

సాగును లాభసాటి చేద్దాం

Published Tue, Aug 16 2016 10:53 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

పాలిలీహౌస్‌ను పరిశీలిస్తున్న స్పీకర్‌ మధుసూదనచారి, మంత్రులు పోచారం, ఈటల, తుమ్మల, ఎంపీ పొంగులేటి - Sakshi

పాలిలీహౌస్‌ను పరిశీలిస్తున్న స్పీకర్‌ మధుసూదనచారి, మంత్రులు పోచారం, ఈటల, తుమ్మల, ఎంపీ పొంగులేటి

సాగును లాభసాటి చేద్దాం
prafit agriculture our target
 
సాగును, లాభసాటి, చేద్దాం
prafit, agriculture, our, target
  • పాలీహౌస్‌ ప్రారంభోత్సవంలో మంత్రులు పోచారం, తుమ్మల, ఈటల
 
సత్తుపల్లి: రైతుల బతుకులు మారాలంటే వ్యవసాయ సాగును లాభసాటిగా చేద్దామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సత్తుపల్లిలో రూ.1.20 కోట్లతో నిర్మించిన పాలీహౌస్‌ను మంగళవారం స్పీకర్‌ మధుసూదనచారి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఆర్‌అండ్‌బీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలీహౌస్‌లలో మంచి వ్యవసాయ ఉత్పత్తులు పండించి రైతులు లాభాలు ఆర్జించాలని ఆకాంక్షించారు. కేంద్రప్రభుత్వం గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 20 ఎకరాలకు మాత్రమే పాలీహౌస్‌ల నిర్మాణాలకు 20శాతం సబ్సిడీతో ప్రోత్సాహం అందిస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ 70శాతం సబ్సిyీ తో గతేడాది వెయ్యి ఎకరాలు, ఈ ఏడాది మరో వెయ్యి ఎకరాలు పాలీహౌస్‌ నిర్మాణాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారన్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ..బంగారు తెలంగాణ కావాలంటే పల్లెలు బాగుపడాలని.. వ్యవసాయం పండుగలా చేసుకోవాలన్నారు. వ్యవసాయం అంటే..దండగ కాదు పండగలా చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ..రైతులు పెట్టుబడి ఖర్చు తగ్తించుకోవాలని, కొత్తరకం వ్యవసాయ పద్ధతులు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎస్సీ కార్పోరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి, జెడ్పీ చైర్‌ పర్సన్‌ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్‌ మువ్వా విజయబాబు, జిల్లా విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు డాక్టర్‌ మట్టా దయానంద్‌ విజయ్‌కుమార్, నగరపంచాయతీ చైర్‌పర్సన్‌ దొడ్డాకుల స్వాతి, ఎంపీపీ జ్యేష్ట అప్పారావు, జెడ్పీటీసీ హసావత్‌ లక్ష్మీ ఆర్డీఓ వినయ్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement