our
-
మన సంప్రదాయం – మన పండుగలపై ర్యాలీ
నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లి మండలం కేంద్రంలోని కాకతీయ ఇంగ్లిష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో మన సంప్రదాయం – మన పండుగల ప్రాముఖ్యత తెలుపుతూ గురువారం ర్యాలీ నిర్వహించారు. హిందూవులకు బోనాలు, బతుకమ్మ పండుగలు, ముస్లింలకు పీర్లు, క్రైస్తవులకు సిల్వలను విద్యార్థులచే తయారు చేసి స్థానిక రహదారులపై ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, వైస్ ఎంపీపీ పుల్లంల పద్మ ముత్తయ్య, సర్పంచ్ పుల్లంల అచ్చాలు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రహీంఖాన్, మాజీ ఎంపీపీ బాజ యాదయ్య, సట్టు సట్టయ్య, ప్రజ్ఞాపురం సైదులు, పాఠశాల ప్రిన్సిపాల్ నడింపల్లి వెంకటేశ్వర్లు, రాపర్తి మధు, జినుకల కార్తీక్ పాల్గొన్నారు. -
సాగును లాభసాటి చేద్దాం
సాగును లాభసాటి చేద్దాం prafit agriculture our target సాగును, లాభసాటి, చేద్దాం prafit, agriculture, our, target పాలీహౌస్ ప్రారంభోత్సవంలో మంత్రులు పోచారం, తుమ్మల, ఈటల సత్తుపల్లి: రైతుల బతుకులు మారాలంటే వ్యవసాయ సాగును లాభసాటిగా చేద్దామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సత్తుపల్లిలో రూ.1.20 కోట్లతో నిర్మించిన పాలీహౌస్ను మంగళవారం స్పీకర్ మధుసూదనచారి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఆర్అండ్బీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలీహౌస్‌లలో మంచి వ్యవసాయ ఉత్పత్తులు పండించి రైతులు లాభాలు ఆర్జించాలని ఆకాంక్షించారు. కేంద్రప్రభుత్వం గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 20 ఎకరాలకు మాత్రమే పాలీహౌస్‌ల నిర్మాణాలకు 20శాతం సబ్సిడీతో ప్రోత్సాహం అందిస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ 70శాతం సబ్సిyీ తో గతేడాది వెయ్యి ఎకరాలు, ఈ ఏడాది మరో వెయ్యి ఎకరాలు పాలీహౌస్ నిర్మాణాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారన్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ..బంగారు తెలంగాణ కావాలంటే పల్లెలు బాగుపడాలని.. వ్యవసాయం పండుగలా చేసుకోవాలన్నారు. వ్యవసాయం అంటే..దండగ కాదు పండగలా చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ..రైతులు పెట్టుబడి ఖర్చు తగ్తించుకోవాలని, కొత్తరకం వ్యవసాయ పద్ధతులు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, జెడ్పీ చైర్ పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్, నగరపంచాయతీ చైర్పర్సన్ దొడ్డాకుల స్వాతి, ఎంపీపీ జ్యేష్ట అప్పారావు, జెడ్పీటీసీ హసావత్ లక్ష్మీ ఆర్డీఓ వినయ్‌కుమార్ పాల్గొన్నారు. -
సాగును లాభసాటి చేద్దాం
పాలీహౌస్ ప్రారంభోత్సవంలో మంత్రులు పోచారం, తుమ్మల, ఈటల సత్తుపల్లి: రైతుల బతుకులు మారాలంటే వ్యవసాయ సాగును లాభసాటిగా చేద్దామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సత్తుపల్లిలో రూ.1.20 కోట్లతో నిర్మించిన పాలీహౌస్ను మంగళవారం స్పీకర్ మధుసూదనచారి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఆర్అండ్బీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలీహౌస్‌లలో మంచి వ్యవసాయ ఉత్పత్తులు పండించి రైతులు లాభాలు ఆర్జించాలని ఆకాంక్షించారు. కేంద్రప్రభుత్వం గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 20 ఎకరాలకు మాత్రమే పాలీహౌస్‌ల నిర్మాణాలకు 20శాతం సబ్సిడీతో ప్రోత్సాహం అందిస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ 70శాతం సబ్సిyీ తో గతేడాది వెయ్యి ఎకరాలు, ఈ ఏడాది మరో వెయ్యి ఎకరాలు పాలీహౌస్ నిర్మాణాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారన్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ..బంగారు తెలంగాణ కావాలంటే పల్లెలు బాగుపడాలని.. వ్యవసాయం పండుగలా చేసుకోవాలన్నారు. వ్యవసాయం అంటే..దండగ కాదు పండగలా చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ..రైతులు పెట్టుబడి ఖర్చు తగ్తించుకోవాలని, కొత్తరకం వ్యవసాయ పద్ధతులు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, జెడ్పీ చైర్ పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్, నగరపంచాయతీ చైర్పర్సన్ దొడ్డాకుల స్వాతి, ఎంపీపీ జ్యేష్ట అప్పారావు, జెడ్పీటీసీ హసావత్ లక్ష్మీ ఆర్డీఓ వినయ్‌కుమార్ పాల్గొన్నారు. -
ఓపెన్ సెసేమ్...ఇదిగో ‘అలీబాబా’ విజయరహస్యం!
చైనాకు చెందిన ‘అలీబాబా’ కంపెనీ తన వెబ్ పోర్టల్స్ ద్వారా సేల్స్ సర్వీస్‌లు అందిస్తూ ‘ఇ-కామర్స్’ దిగ్గజంగా ఎదిగింది. మొన్నటికి మొన్న ‘సింగిల్స్ డే’ వ్యాపార ఉత్సవంలో సరికొత్త రికార్డ్ సృష్టించి మరోసారి వార్తల్లోకి వచ్చింది. ‘అరేబియన్ నైట్స్’ కథల్లో నిధి ఉన్న గుహద్వారం తెరవడానికి అలీబాబాకు ‘ఓపెన్ సెసేమ్’ మంత్రం ఉపయోగపడింది. ‘నిధి, మంత్రం... రెండూ నీలోనే ఉన్నాయి. సత్తా, సామర్థ్యం నీలో ఉన్న నిధులు. అయితే కష్టించడం, కొత్తగా ఆలోచించడం అనేవి గుహ ద్వారాలు తెరిచే మంత్రాలు’ అంటాడు ‘అలీబాబా’ అనే ఇ-కామర్స్ దిగ్గజం జాక్ మా. చైనాలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన జాక్ మా ఇప్పుడు చైనాలోనే అత్యంత సంపన్నుడు. ఈ అలీబాబాకు మంత్రం కంటే మనోధైర్యమే ఉపయోగపడింది. ఒక్కసారి ఆయన జీవితంలోకి వెళ్లొద్దాం.... ఇంగ్లిష్ అనేది ప్రపంచ భాష. ఇంగ్లిష్ వస్తే ప్రపంచంతో సంభాషించే అవకాశం వచ్చినట్లే. అందుకే ఇంగ్లిష్ అంటే జాక్ మాకు ఇష్టం. కానీ, చైనాలో ఇంగ్లిష్ అనేది అరుదుగా మాత్రమే వినబడేది. పాఠశాలలో నేర్చుకున్న ఇంగ్లిష్ వల్ల కూడా అంతంత మాత్రమే ఉపయోగం ఉండేది. దీంతో ఇంగ్లిష్ నేర్చుకోవడానికి హైస్కూలు రోజుల్లోనే రంగంలోకి దిగాడు జాక్. ఎండైనా, వానైనా, చలైనా లెక్క చేయకుండా బైక్ మీద విదేశీ పర్యాటకులను వెతుక్కుంటూ వెళ్లేవాడు. వారితో తనకొచ్చిన ఇంగ్లిష్ మాట్లాడేవాడు. వారు మాట్లాడుతున్నది జాగ్రత్తగా వినేవాడు. అలా ఎనిమిదేళ్ళలో జాక్ మాకు ఇంగ్లిష్ మీద మాంచి పట్టు వచ్చింది. ఆస్ట్రేలియా వెళ్లొచ్చిన తరువాత... విదేశీ పర్యాటకులతో మాట్లాడడం అనే సరదాలో భాగంగా చైనాకు వచ్చిన ఒక ఆస్ట్రేలియన్ కుటుంబంతో జాక్‌కు పరిచయం ఏర్పడింది. అది స్నేహంగా మారింది. పరస్పరం ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుకొనేవారు. వారి ఆహ్వానం మేరకు ఒకసారి వేసవి సెలవుల్లో ఆస్ట్రేలియా వెళ్లి నెలరోజులు గడిపాడు జాక్. ‘‘ప్రతి విషయం గురించి కొత్తగా ఆలోచించడం ఎలాగో అప్పటి నుంచే అలవడింది’’ అంటాడు జాక్. ఒక్క ఉద్యోగమూ రాలేదు! ఉద్యోగప్రయత్నాల్లో ఉన్నప్పుడు... అదృష్టమో, దురదృష్టమో గానీ జాక్‌కు ఒక్క ఉద్యోగమూ రాలేదు. చివరి ప్రయత్నంలో మాత్రం ‘కెంటకీ ఫ్రైడ్ చికెన్’ (కె.ఎఫ్.సి)లో జనరల్ మేనేజర్‌కు సెక్రటరీగా ఉద్యోగం వచ్చింది. ఒక వ్యాపార సదస్సులో పాల్గొనడానికి సీటెల్ (అమెరికా)కు వెళ్లిన జాక్ తొలిసారిగా మిత్రుడి ద్వారా ఇంటర్నెట్ గురించి తెలుసుకున్నాడు. నిజానికి పర్సనల్ కంప్యూటర్, ఇ-మెయిల్స్ గురించి జాక్‌కు అప్పటి వరకు బొత్తిగా తెలియదు. ఎప్పుడూ కీబోర్డ్‌ను టచ్ చేసింది కూడా లేదు. అలా మొదలైంది! ఇ-కామర్స్ అనే మాట వినబడుతున్నప్పటికీ అప్పటికి అది ఇంకా చైనాలో వ్యాప్తిలోకి రాలేదు. ఆ సమయంలో జాక్‌కు తనకంటూ ఒక ఇ-కామర్స్ కంపెనీ ఉండాలనే ఆలోచన వచ్చింది. 1999లో జాక్ తన ఇంటికి 18 మందిని పిలిచి ‘ఇ-కామర్స్’ గురించి తన ఆలోచనను వాళ్లతో పంచుకున్నాడు. రెండు గంటల సమావేశం తరువాత ఆ 18 మంది తమ వాటాగా తలా కొంత డబ్బును టేబుల్ మీద పెట్టారు. కంపెనీ పేరు ప్రపంచ వ్యాప్తంగా సుపరిచితమైనది కావాలనుకున్నాడు. అలా అలీబాబా కథ తెర మీదికి వచ్చింది. ‘ఓపెన్ సెసేమ్’ అంటూ నిధులున్న గుహ ముందు అలీబాబా ఇచ్చే ఆదేశం గురించి తెలియంది ఎవరికి! అందుకే ‘అలీబాబా’ అనేది గ్లోబల్ నేమ్‌గా అనిపించి ఆ పేరే తన కంపెనికీ పెట్టాడు జాక్ మా. ఏమీ లేక పోయినా... ‘గ్లోబల్ విజన్’ ఉండగానే సరిపోదు. దానికి ‘స్థానికత’ కూడా తోడవ్వాలి అని నమ్మాడు జాక్. పెద్దగా డబ్బు లేకపోయినా, సాంకేతిక జ్ఞానం అంతంతమాత్రంగానే ఉన్నా, ప్రతి పైసాను జాగ్రత్తగా ఖర్చు పెట్టడం, స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడం లాంటి జాగ్రత్తలు పాటించాడు. మిగిలిన చైనా కంపెనీలలాగా అమెరికా మోడల్‌ను కాపీ కొట్టకుండా తనదైన విధానానికి రూపకల్పన చేసుకున్నాడు. అలాగే, నాణ్యత మీద ప్రత్యేక దృష్టి పెట్టాడు. అంతే! ‘అలీబాబా’ ఇ-కామర్స్ కంపెనీ అనుకున్న దానికంటే ఎక్కువ విజయమే సాధించింది. భవిష్యత్తులో... పది లక్షల ఉద్యోగాలను సృష్టించడం, చైనా ఆర్థిక-సామాజిక పరిస్థితులను మార్చడం, చైనాను ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నెట్ మార్కెట్‌గా తీర్చిదిద్దడం... ఇవన్నీ తన ఆశయాలని చెబుతున్నాడు జాక్ మా. సాధారణ కుటుంబం నుంచి వచ్చి, అసాధారణ విజయం సాధించిన జాక్ మా తన సరికొత్త ఆశయాన్ని నెరవేర్చుకుంటాడు అనడంలో అణుమాత్రమైనా సందేహం లేదు! సామాజిక స్పృహ ఏడేళ్ళ క్రితం... సూప్ కోసం షార్క్‌లను చంపడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ‘‘నాతో పాటు నా కుటుంబసభ్యులు ‘షార్క్ సూప్‌ను జీవితంలో ముట్టం’’ అని నిర్ణయం తీసుకున్నాడు జాక్. అంతేకాదు... అలీబాబా గ్రూప్ తన ఇ-కామర్స్ వేదిక నుంచి ‘షార్క్ ఫిన్ సూప్’ ఉత్పత్తుల అమ్మకాన్ని నిషేధించింది. అలాగే, పర్యావరణానికి సంబంధించిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడానికి కూడా తగిన ప్రణాళికలు వేసుకుంటున్నాడు జాక్. ‘అలీబాబా’ వార్షిక ఆదాయం లో కొంత మొత్తాన్ని... పర్యావరణ పరిరక్షణ సంబంధ కార్యక్రమాలకు కేటాయిస్తున్నాడు. నేనూ... నా తత్త్వం! జాక్ మా కరడుగట్టిన వ్యాపారి కాదు. వ్యాపారం చేయడం, అందులో విజయం సాధించడం అనేవి జీవితంలో ఒక భాగం మాత్రమే అనుకుంటాడు. ఒక రచయితలా, తాత్వికుడిలా జీవితానికి సంబంధించి భిన్నంగా ఆలోచిస్తుంటాడు. ఆయన ఆలోచనలలో కొన్ని... విజయ సాధనకు కష్టపడడం ఎంత ముఖ్యమో, ఓర్పు అంత కంటే ముఖ్యం. రాత్రికి రాత్రే విజయాలు రావు. అందుకే అంటాను... ఓపిక అత్యవసరం అని! నన్ను నేను సాధారణ మనిషి అని చెప్పుకోవడానికి ఇష్టపడతాను. నాకు తెలిసిన సాంకేతిక జ్ఞానం చాలా తక్కువ. తెలిసినదాన్ని నా దృష్టితో కాకుండా సామాన్యులైన వినియోగదారుల దృష్టి నుంచే చూడడానికి ఇష్టపడతాను. నీ పోటీదారు నుంచి నేర్చుకో! కానీ మక్కికి మక్కీ కాపీ కొట్టకు. అలా చేస్తే నీకు నువ్వు హాని చేసుకున్నట్లే! నిజంగా చెప్పాలంటే నేను ఎంతమాత్రం సంతోషంగా లేను. ‘చైనాలో అత్యంత సంపన్నుడు’ అనే గుర్తింపు నన్ను విపరీతమైన ఒత్తిడికి గురి చేస్తోంది. అయినప్పటికీ నన్ను నేను సంతోషంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే నేను సంతోషంగా లేకుంటే నా సహచర సిబ్బంది సంతోషంగా ఉండరు. వారు లేకపోతే వినియోగదారులు ఉండరు. వ్యాపార విజయాలు మాత్రమే నాలో సంతోషాన్ని నింపవు. ఈ జీవితంలో మనం సంతోషంగా ఉండడానికి చాలా అంశాలు ఉన్నాయి.