
మాట్లాడుతున్న కలెక్టర్ లోకేష్‌కుమార్
- జిల్లా కలెక్టర్ లోకేశ్‌కుమార్
ఖమ్మం జెడ్పీ సెంటర్: హరితహారం పథకంలో భాగంగా జిల్లాలో 3.61 కోట్ల మొక్కలు నాటి 103.25 లక్ష్యం సాధించామని కలెక్టర్ లోకేష్‌కుమార్ తెలిపారు. నిర్దేశిత లక్ష్యకంటే ఎక్కువగా మొక్కలు నాటామన్నారు. హరతహారం నిర్దేశిత లక్ష్యాలు, సాధించిన ప్రగతి, నాటిన మొక్కల సంరక్షణ, 2017 సంవత్సరం ప్రణాళిక తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో చేపట్టిన హరితహారం గురించి కలెక్టర్ వివరించారు. జిల్లాకు నిర్దేశించిన 3.50 కోట్ల లక్ష్యానికి గాను 3.61 కోట్ల మొక్కలు నాటామన్నారు. 2017 సంవత్సరానికి 3.60 కోట్లతో నర్సరీ ప్లానింగ్ చేసినట్లు వివరించారు. ఇప్పటికే నాటిన మొక్కల సంరక్షణకు 635 ప్రాంతాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేశామన్నారు. 650 ప్రాంతాల్లో నీటి వసతి కల్పించామని కలెక్టర్ వివరించారు. మొక్కల సంరక్షణ, నీటి సౌకర్యం కోసం గ్రామస్థాయి సూక్ష్మ ప్రణాళిక ప్రకారం బాధ్యులను నియమించామని తెలిపారు. 671 గ్రామ పంచాయతీల్లో 29,717 మొక్కలను సూక్ష్మ ప్రణాళిక కింద నాటుతామన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ సాయిక్రిష్ణ, జిల్లా పరిషత్ సీఈఓ మారుపాక నగేష్, డ్వామా పీడీ జగత్‌కుమార్‌రెడ్డి, అటవీ సంరక్షణాధికారి నర్సయ్య, సామాజిక వన విభాగం అటవీ సంరక్షణాధికారి సతీష్, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.