రాబడి.. వెనుకబడి..!
• ఇంటి పన్నుల లక్ష్యం రూ.14కోట్లు
• ఇప్పటి వరకు వసూలైంది రూ.1.88కోట్లు
• టార్గెట్ చేరేదెప్పుడో..?
• వసూళ్లలో ముందున్న మధిర
ఖమ్మం జెడ్పీసెంటర్ : పన్నుల వసూళ్లకు ప్రభుత్వ యంత్రాంగం టార్గెట్ విధించింది. అనుకున్న మేరకు పన్నులన్నీ సకాలంలో వసూలైతే స్థానిక వనరులతోనే పలు అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణరుుంచింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నుల లక్ష్యంపై నీలినీడలు కమ్ముకున్నారుు. 2016-17 సంవత్సరానికి జిల్లాలోని 20 మండలాల్లో రూ.14కోట్లు లక్ష్యంగా నిర్ణరుుంచారు. ఇందులో అక్టోబర్ నుంచి ఇప్పటివరకు రూ.1.88కోట్ల(13 శాతం) పన్నులు వసూలు చేశారు. ఇంకా రూ.12కోట్ల వసూళ్ల లక్ష్యంగా అధికార యంత్రాంగం టార్గెట్ నిర్ణరుుంచింది. ఈ ఏడాది మధిర మండలం పన్నుల రూపేణ రూ.45,53,801 వసూలు చేసి(41.22 శాతం) ముందంజలో ఉంది.
లక్ష్యం చేరని 2015-16
నూరు శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ అతికష్టం మీద 54.54 శాతం అంటే.. రూ.5.78కోట్లు వసూలు చేసి పంచాయతీ సిబ్బంది చేతులు దులుపుకున్నారు. జిల్లా పంచాయతీ అధికారి గతంలో మండల పరిషత్‌లలో సమావేశాలు నిర్వహించటంతోపాటు తన కార్యాలయంలో పలుమార్లు సమావేశాలు నిర్వహించి.. డిసెంబర్ నాటికే లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించినప్పటికీ ఆయన మాటలు పట్టించుకున్న వారు లేరనే విమర్శలున్నారుు.
వేధిస్తున్న కార్యదర్శుల కొరత
జిల్లాలోని 20 మండలాల్లో ఉన్న 427 గ్రామ పంచాయతీలకు 285 క్లస్టర్లు ఉన్నారుు. వీటిలో 81 మంది గ్రామ కార్యదర్శులే ఉన్నారు. కొందరు గ్రామ కార్యదర్శులు సుమారు 4 గ్రామాల్లో పాలనపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. వీటికి తోడు ఎంపీడీఓ కార్యాలయాల్లో సమావేశాలు, ఎమ్మెల్యే, మంత్రుల సభలు, సమావేశాలు, శంకుస్థాపనలకు సగం సమయం సరిపోతుందని కార్యదర్శులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉదాహరణకు.. ఖమ్మంకు కూటవేటు దూరంలో ఉన్న రఘునాథపాలెం మండలంలో 17 పంచాయతీలుండగా.. ఇద్దరు కార్యదర్శులు మాత్రమే పని చేస్తున్నారు. వారిలో ఒకరు మహిళా కార్యదర్శి కావటం గమనార్హం.
పన్నులు వసూలు అరుుతేనే అభివృద్ధి
గ్రామాలు అభివృద్ధి చెందాలంటే సొంత వనరులు ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల అభివృద్ధి కోసం గ్రామజ్యోతి పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా గ్రామంలో ఏ అభివృద్ధి జరగాలన్నా.. స్థానికంగా ఉన్న వనరులపై ఆధారపడాల్సి ఉంది. గ్రామాల్లో ఇంటి, నీటి పన్నులు కీలకంగా ఉండనుండగా.. ఇంటి పన్నులు చెల్లించేందుకు గ్రామస్థారుులో ఆసక్తి చూపించే వారు కరువయ్యారు. దీనికోసం ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ప్రజాప్రతినిధులు, కార్యదర్శులు కూడా స్థానిక పరిస్థితులనుబట్టి ఆసక్తి చూపించటం లేదు. పలు గ్రామాల్లో ఇంటి పన్నులు 30 శాతం కూడా వసూళ్లు కావటం లేదు. ఇదే అదనుగా భావించిన పాలకులు, కార్యదర్శులు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలపై ఆసక్తి కనబరచడం లేదు.
నిధులు మింగుతున్న ప్రజాప్రతినిధులు
కార్యదర్శుల కొరతతో పంచాయతీ కార్యదర్శులు అన్ని గ్రామాల్లో రోజువారీగా వెళ్లే అవకాశం ఉండటం లేదు. దీంతో ఇదే అదనుగా భావించిన కొందరు ప్రజాప్రతినిధులు అక్రమాలకు తెరలేపారు. అవకాశాన్నిబట్టి అందిన కాడికి దోచుకోవడంతో పదుల సంఖ్యలో సర్పంచ్‌లకు చెక్‌పవర్ రద్దు, షోకాజ్ నోటీసులు జారీ అరుున సంఘటనలున్నారుు. మరికొందరు సర్పంచ్‌లపై జిల్లాస్థారుులో విచారణ కూడా జరుగుతోంది.