home tax
-
ఈ నెలాఖరులోపు చెల్లిస్తే..!
సాక్షి, అమరావతి : ఇంటి పన్నుపై నిన్న మొన్నటి వరకు వడ్డీ వసూలు చేసిన మున్సిపాలిటీలు ఇప్పుడు ఆఫర్లు ప్రకటించాయి. ఈ నెలాఖరులోపు పన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ ఇస్తామని ప్రచారం చేస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఉద్యోగులను పన్ను చెల్లింపుదారుల ఇళ్లకు పంపుతున్నాయి. ఆదివారమైనా కార్యాలయాల్లో సిబ్బంది అందుబాటులో ఉంటారని చెబుతున్నాయి. రెండు నెలలుగా మున్సిపల్ సిబ్బంది సార్వత్రిక ఎన్నికల విధుల్లో ఉండిపోవడంతో పన్నుల వసూళ్లు నిలిచిపోయాయి. దీంతో నిర్దేశించిన లక్ష్యంలో 40 శాతం కూడా వసూలు కాలేదు. రెండు నెలలుగా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదు. పారిశుధ్య పరిస్థితులను చక్కదిద్దేందుకు అవసరమైన మెటీరియల్ కొనుగోలు చేయలేని దుస్థితి. మరో రెండు నెలల వరకు జీతాలు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో వారంతా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఎన్నికల ఫలితాలు, ఆ తరువాత కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటివరకు ఆపద్ధర్మ ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యే అవకాశాలు లేవు. దీంతో మున్సిపల్ అధికారులు పన్నులపై రాయితీ ప్రకటించారు. రోజువారీ ఖర్చులకూ డబ్బుల్లేవ్ చిన్న, మధ్యతరగతి మున్సిపాలిటీల్లో రోజువారీ ఖర్చులకు సైతం నిధులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పన్ను రాయితీని ప్రకటించి యుద్ధప్రాతిపదికన వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో 110 మున్సిపాల్టీలు, 16 నగర పాలక సంస్థలు కలిపి 2019 మార్చి 31తో అంతమయ్యే ఆర్థిక సంవత్సరానికి రూ.219.34 కోట్ల పన్నును వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించాయి. గత ఏడాది ఏప్రిల్‌లోనే పన్ను చెల్లింపుదారులకు నోటీసులు జారీ చేశాయి. ఆలస్యంగా చెల్లించే వారినుంచి నెలవారీ వడ్డీ వసూలు చేస్తామని ప్రకటించి.. డిసెంబరు వరకు వసూలు చేశాయి. జనవరి నుంచి మున్సిపల్ సిబ్బంది ఓటర్ల జాబితాలు, పోలింగ్ నిర్వహణకు సంబంధించిన పనుల్లో నిమగ్నం కావడంతో పన్ను వసూళ్లు మందగించాయి. మార్చి 31 నాటికి రూ.219.34 కోట్ల పన్ను వసూలు చేయాల్సి ఉంటే.. రూ. 21.03 కోట్లను వసూలు చేశాయి. రూ.36.45 కోట్ల కుళాయి పన్ను వసూలు చేయాల్సి ఉండగా.. రూ.3.78 కోట్లు మాత్రమే వచ్చాయి. దాదాపు రూ.197 కోట్ల ఇంటి పన్నును వసూలు చేయాల్సి ఉంది. ఈ మొత్తాలకు తోడు ఐదారు సంవత్సరాల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు దాదాపు రూ.1,200 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఇవన్నీ కలిపితే.. పన్నుల బకాయిలు రూ.1,400 కోట్ల వరకు చేరింది. ఈ నెల 11న పోలింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో ఆ మర్నాడు నుంచే మున్సిపల్ సిబ్బందిని పన్నుల వసూలుకు నియమించి, స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. -
ఆస్తి పన్ను వడ్డింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల ప్రజలపై ఆస్తి పన్ను మోత మోగనుంది. ఈ మున్సిపాలిటీల్లో 5 శాతం ఆస్తి పన్ను పెంపు తక్షణమే (13 నుంచి) అమల్లోకి వచ్చింది. రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ అధ్యక్షతన ప్రాపర్టీ ట్యాక్స్ బోర్డు ఈ నెల 13న సమావేశమై పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా ఏర్పడిన 61 మున్సిపాలిటీల్లో పంచాయతీరాజ్ చట్టం నిబంధనల ప్రకారం 5 శాతం ఆస్తి పన్ను పెంచి వసూలు చేయాలని ఆదేశించింది. ఈ మున్సిపాలిటీల నుంచి రూ.81.49 కోట్ల ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉండగా, రూ.22.39 శాతం మాత్రమే వసూలు చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. తక్షణమే బకాయిల వసూళ్లను వేగవంతం చేయాలని ఆయా మున్సిపాలిటీల కమిషనర్లను ఆదేశించింది. ఖాళీ స్థలాలపై పన్నులు... రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్లాట్లు, ఖాళీ స్థలాలన్నింటిపై పన్ను విధించేందుకు పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. ఖాళీ స్థలాల వివరాలను అందించాలని రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి లేఖ రాసింది. రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి వచ్చే సమాచారం మేరకు ఖాళీ స్థలాలపై వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్ విధించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రాపర్టీ ట్యాక్స్ బోర్డు ఆదేశించింది. పన్ను విధించి వసూలు చేసేందుకు వీలుగా ఖాళీ స్థలాలను జియో ట్యాగింగ్ చేయాలని కోరింది. రూ.55.46 కోట్ల వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్ డిమాండ్ మరింత పెంచాలని సూచించింది. అదే విధంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 68 మున్సిపాలిటీల్లో ఖాళీ స్థలాలను గుర్తించి పన్నులు విధించాలని కోరింది. ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన రూ.143 కోట్ల ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేసేందుకు గట్టిగా ప్రయత్నించాలని బోర్డు ఆదేశించింది. ఆయా ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు ప్రతి 15 రోజులకోసారి డిమాండ్ నోటీసులు పంపించాలని కోరింది. కమిషనర్లకు నోటీసులు... అదనపు నిర్మాణాలు జరిపిన కట్టడాలను గుర్తించి ఆస్తి పన్నులు పెంచి వసూలు చేసేందుకు అమలు చేస్తున్న భువన్ కార్యక్రమం అమలులో జాప్యంపై బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటివరకు 2,82,209 కట్టడాలపై మాత్రమే పన్ను పెంచారని, 28 మున్సిపాలిటీలు మాత్రమే 100 శాతం పెంపును అమలు చేశాయని బోర్డు పేర్కొంది. ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు విఫలమైన 36 మున్సిపాలిటీల కమిషనర్లకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. -
పురపాలికల దూకుడు..!
ఆర్థిక సంవత్సరం చివర్లో పుంజుకున్న ఆస్తి పన్ను వసూళ్లు - గ్రేటర్లో రూ.1,246 కోట్లు, ఇతర పురపాలికల్లో రూ.271 కోట్ల రాబడి - నాలుగు పురపాలికల్లో 100 శాతం వసూళ్లు - నల్లా చార్జీలు, మడిగెల అద్దె, ట్రేడ్ లైసెన్స్ చార్జీల వసూళ్లలో డీలా సాక్షి, హైదరాబాద్: ఆస్తి పన్ను వసూళ్లలో రాష్ట్రంలోని పురపాలికలు దూకుడు ప్రదర్శించాయి. ఆర్థిక సంవత్సరం చివర్లో రాబడిని అమాంతం పెంచుకున్నాయి. మార్చి 31తో ముగిసిన 2016–17 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీ రూ.1,246 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేసి రికార్డు సృష్టించగా.. రాష్ట్రంలోని 73 ఇతర పురపాలికలు సైతం 81.23 శాతం పురోగతితో రూ.271.43 కోట్ల వసూళ్లు సాధించాయి. మార్చి 10 నాటికి ఈ 73 పురపాలికల్లో 53 శాతం ఆస్తి పన్నులు మాత్రమే వసూలు కాగా, చివరి 20 రోజుల్లో మరో 28 శాతం వసూళ్లను రాబట్టుకోవడం విశేషం. ఈ 73 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో మొత్తం రూ.334.14 కోట్ల ఆస్తి పన్నులకుగానూ రూ.271.43 కోట్లు వసూలయ్యాయి. పురపాలక మంత్రి కె.తారకరామారావు ఆదేశాల మేరకు ఆర్థిక సంవత్సరం చివర్లో పన్నుల వసూళ్ల కోసం పురపాలక శాఖ చేపట్టిన స్పెషల్ డ్రైవ్స్ ఫలించడంతో ఒక్కసారిగా గల్లా పెట్టెలు నిండాయి. మెట్పల్లి, బోడుప్పల్, పీర్జాదిగూడ, ఎన్ఏసీ శంషాబాద్ మున్సిపాలిటీల్లో 100 శాతం ఆస్తి పన్ను వసూలైంది. పెద్దపల్లి నగర పంచాయతీ 99.80 శాతం, ఆర్మూర్ 99.14 శాతం, నారాయణపేట్ 98.64 శాతం, షాద్‌నగర్ 98.47 శాతం, కొత్తగూడెం 97.60 శాతం, భువనగిరి 97.17 శాతం వసూళ్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అత్యల్ప వసూళ్లు జరిగిన 10 పురపాలికలను పరిశీలిస్తే.. 37.65 శాతంతో భూపాలపల్లి, 56.96 శాతంతో పాల్వంచ అట్టడుగు స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానంలో 57.47 శాతంతో వనపర్తి, 59.43 శాతంతో నల్లగొండ, 60.28 శాతంతో ఇబ్రహీంపట్నం, 64.88 శాతంతో కాగజ్‌నగర్, 66.71 శాతంతో అందోల్–జోగిపేట, 68.50 శాతంతో హుస్నాబాద్, 69.27 శాతంతో కరీంనగర్, 69.34 శాతంతో మంచిర్యాల నిలిచాయి. ఇతర పన్నులు, చార్జీల వసూళ్లు అంతంతే.. ఆస్తి పన్ను వసూళ్లలో దూకుడు ప్రదర్శించిన పురపాలికలు నల్లా చార్జీలు, డీఅండ్‌వో ట్రేడ్ లైసెన్స్, మడిగెల అద్దెలు, ప్రకటన పన్నుల వసూళ్లకు వచ్చేసరికి డీలా పడ్డా యి. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని 73 పురపాలికల పరిధిలో రూ.138.69 కోట్ల నల్లా చార్జీలకుగానూ రూ. 55.67 కోట్లు(40.14%) మాత్రమే వసూలయ్యాయి. అలాగే రూ.12.62 కోట్ల డీఅండ్‌వో ట్రేడ్ లైసెన్స్ చార్జీలకుగానూ రూ.6.88 కోట్లు(54.54%) రాబట్టుకోగలిగా యి. రూ.24.17 కోట్ల మడిగెల అద్దెలకుగానూ రూ. 12.44 (51.49%) వసూలు చేయగలిగాయి. రూ.4.33 కోట్ల ప్రకటనల పన్నులకుగానూ రూ.3.39 కోట్లు(78.45%) వసూలు చేశాయి. -
రాబడి.. వెనుకబడి..!
• ఇంటి పన్నుల లక్ష్యం రూ.14కోట్లు • ఇప్పటి వరకు వసూలైంది రూ.1.88కోట్లు • టార్గెట్ చేరేదెప్పుడో..? • వసూళ్లలో ముందున్న మధిర ఖమ్మం జెడ్పీసెంటర్ : పన్నుల వసూళ్లకు ప్రభుత్వ యంత్రాంగం టార్గెట్ విధించింది. అనుకున్న మేరకు పన్నులన్నీ సకాలంలో వసూలైతే స్థానిక వనరులతోనే పలు అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణరుుంచింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నుల లక్ష్యంపై నీలినీడలు కమ్ముకున్నారుు. 2016-17 సంవత్సరానికి జిల్లాలోని 20 మండలాల్లో రూ.14కోట్లు లక్ష్యంగా నిర్ణరుుంచారు. ఇందులో అక్టోబర్ నుంచి ఇప్పటివరకు రూ.1.88కోట్ల(13 శాతం) పన్నులు వసూలు చేశారు. ఇంకా రూ.12కోట్ల వసూళ్ల లక్ష్యంగా అధికార యంత్రాంగం టార్గెట్ నిర్ణరుుంచింది. ఈ ఏడాది మధిర మండలం పన్నుల రూపేణ రూ.45,53,801 వసూలు చేసి(41.22 శాతం) ముందంజలో ఉంది. లక్ష్యం చేరని 2015-16 నూరు శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ అతికష్టం మీద 54.54 శాతం అంటే.. రూ.5.78కోట్లు వసూలు చేసి పంచాయతీ సిబ్బంది చేతులు దులుపుకున్నారు. జిల్లా పంచాయతీ అధికారి గతంలో మండల పరిషత్‌లలో సమావేశాలు నిర్వహించటంతోపాటు తన కార్యాలయంలో పలుమార్లు సమావేశాలు నిర్వహించి.. డిసెంబర్ నాటికే లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించినప్పటికీ ఆయన మాటలు పట్టించుకున్న వారు లేరనే విమర్శలున్నారుు. వేధిస్తున్న కార్యదర్శుల కొరత జిల్లాలోని 20 మండలాల్లో ఉన్న 427 గ్రామ పంచాయతీలకు 285 క్లస్టర్లు ఉన్నారుు. వీటిలో 81 మంది గ్రామ కార్యదర్శులే ఉన్నారు. కొందరు గ్రామ కార్యదర్శులు సుమారు 4 గ్రామాల్లో పాలనపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. వీటికి తోడు ఎంపీడీఓ కార్యాలయాల్లో సమావేశాలు, ఎమ్మెల్యే, మంత్రుల సభలు, సమావేశాలు, శంకుస్థాపనలకు సగం సమయం సరిపోతుందని కార్యదర్శులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉదాహరణకు.. ఖమ్మంకు కూటవేటు దూరంలో ఉన్న రఘునాథపాలెం మండలంలో 17 పంచాయతీలుండగా.. ఇద్దరు కార్యదర్శులు మాత్రమే పని చేస్తున్నారు. వారిలో ఒకరు మహిళా కార్యదర్శి కావటం గమనార్హం. పన్నులు వసూలు అరుుతేనే అభివృద్ధి గ్రామాలు అభివృద్ధి చెందాలంటే సొంత వనరులు ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల అభివృద్ధి కోసం గ్రామజ్యోతి పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా గ్రామంలో ఏ అభివృద్ధి జరగాలన్నా.. స్థానికంగా ఉన్న వనరులపై ఆధారపడాల్సి ఉంది. గ్రామాల్లో ఇంటి, నీటి పన్నులు కీలకంగా ఉండనుండగా.. ఇంటి పన్నులు చెల్లించేందుకు గ్రామస్థారుులో ఆసక్తి చూపించే వారు కరువయ్యారు. దీనికోసం ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ప్రజాప్రతినిధులు, కార్యదర్శులు కూడా స్థానిక పరిస్థితులనుబట్టి ఆసక్తి చూపించటం లేదు. పలు గ్రామాల్లో ఇంటి పన్నులు 30 శాతం కూడా వసూళ్లు కావటం లేదు. ఇదే అదనుగా భావించిన పాలకులు, కార్యదర్శులు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలపై ఆసక్తి కనబరచడం లేదు. నిధులు మింగుతున్న ప్రజాప్రతినిధులు కార్యదర్శుల కొరతతో పంచాయతీ కార్యదర్శులు అన్ని గ్రామాల్లో రోజువారీగా వెళ్లే అవకాశం ఉండటం లేదు. దీంతో ఇదే అదనుగా భావించిన కొందరు ప్రజాప్రతినిధులు అక్రమాలకు తెరలేపారు. అవకాశాన్నిబట్టి అందిన కాడికి దోచుకోవడంతో పదుల సంఖ్యలో సర్పంచ్‌లకు చెక్‌పవర్ రద్దు, షోకాజ్ నోటీసులు జారీ అరుున సంఘటనలున్నారుు. మరికొందరు సర్పంచ్‌లపై జిల్లాస్థారుులో విచారణ కూడా జరుగుతోంది.