‘సూక్ష్మ’ లక్ష్యం 15వేల హెక్టార్లు
Published Wed, Jan 18 2017 11:59 PM | Last Updated on Tue, Sep 5 2017 1:32 AM
– ఏపీఏంఐపీ రాష్ట్ర ప్రత్యేక అధికారి సూర్యప్రకాశ్
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో 15వేల హెక్టార్లకు సూక్ష్మ సేద్యం అందించాలనే లక్ష్యంగా నిర్ణయించామని ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి సూర్యప్రకాశ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని డ్వామా సమావేశ మందిరంలో డ్రిప్ కంపెనీల ప్రతినిధులు, ఎంఐఏఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...జిల్లాలో ఇప్పటి వరకు 8300 హెక్టార్లకు సూక్ష్మ సేద్యాన్ని అందించామని.. ఫిబ్రవరి నెల చివరిలోగా వంద శాతం లక్ష్యాలు సాధించాలన్నారు. సూక్ష్మ సేద్యం కల్పనలో దేశంలోనే ఆంధ్రపదేశ్ రెండో స్థానంలో ఉందని తెలిపారు. ఉల్లికి మినీ స్ప్రింక్లర్లు, మిరపకు డ్రిప్ ద్వారా నీటిని వినియోగించే అవకాశం కల్పించినట్లు తెలిపారు. సమావేశంలో ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, ఏపీడీ మురళీమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement