బీసీల బలోపేతానికి ప్రభుత్వం కృషి
Published Thu, Oct 27 2016 11:25 PM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM
కాకినాడ సిటీ :
వెనుకబడిన తరగతుల వారిని ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఏపీ నాయీ బ్రాహ్మణ సహకార సంఘాల సమాఖ్య, బీసీ కార్పొరేష¯ŒS స్థానిక అంబేడ్కర్ భవ¯ŒSలో గురువారం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బీసీలు సమాజంలో పైస్థాయికి ఎదగడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టిందన్నారు. మరో అతిథి, పౌరసరఫరాల శాఖామంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఏపీ నాయీబ్రాహ్మణ సహకార సంఘ సమాఖ్య చైర్మ¯ŒS గంటుపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ 11 నుంచి 15 మంది బీసీలు సంఘంగా ఏర్పడి బీసీ వెల్ఫేర్ డీడీ వద్ద అన్ని వివరాలు సమర్పిస్తే 15 రోజుల్లో రిజిస్ట్రేష¯ŒS పూర్తి చేస్తారన్నారు. చేతివృత్తులు, కుల వృత్తులపై ఆధారపడే వారికి ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు, జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్–2 రాధాకృష్ణమూర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మ¯ŒS నల్లమిల్లి వీర్?రడ్డి, బీసీ కార్పొరేష¯ŒS డైరెక్టర్ చంద్రమౌళి, ఈడీ ఎం.జ్యోతి, బీసీ వెల్ఫేర్ డీడీ చిన్నబాబు, నాయీ బ్రాహ్మణ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement