bc development
-
బీసీలకు 11 ఎమ్మెల్సీ స్థానాలివ్వడం రికార్డే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 18 ఎమ్మెల్సీ స్థానాల్లో 11 స్థానాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలకు కేటాయించటం దేశ చరిత్రలో ఓ రికార్డు అని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య చెప్పారు. ఆయన బుధవారం తాడేపల్లిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ... బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉన్న నేతగా సీఎం వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. శాసన మండలి స్థానాల్లో మూడు లేదా నాలుగు స్ధానాలు బీసీలకు ఇస్తారని భావించానని, కానీ జగన్ ఏకంగా 11 స్ధానాలివ్వడంతో ఆశ్చర్యపోయనని చెప్పారు. గత ప్రభుత్వం అతి తక్కువ స్థానాలు బీసీలకు ఇచ్చి, వారిది బీసీల ప్రభుత్వమని, బీసీలను ఉద్దరిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకునేవారన్నారు. ఇప్పడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్లమెంట్ సభ్యుల నుంచి మంత్రులు, ఎంపీటీసీల వరకు బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యం దేశంలో మరే రాష్ట్రంలో కనిపించదని తెలిపారు. అందుకే బీసీలంతా వైఎస్ జగన్ సుధీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగేలా చూసుకోవాలని పిలుపునిచ్చారు. ‘2014 –19 మధ్య టీడీపీ శాసన మండలికి 48 మందిని పంపితే.. అందులో ఓసీలు 30 మంది ఉండగా, బీసీలు 12 మంది మాత్రమే. ఓసీలకు ఏకంగా 62.5 శాతం పదవులివ్వగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చిన పదవులు కేవలం 37.5 శాతమే. టీడీపీ వంచనకు ఇదే నిదర్శనం. దీనికి భిన్నంగా సీఎం వైఎస్ జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 68.18 శాతం పదవులివ్వడం ఈ వర్గాల సాధికారత పట్ల ఆయన చిత్తశుద్ధిని నిరూపిస్తోంది. చంద్రబాబు, సీఎం జగన్ మధ్య ఆ తేడాను అందరూ గుర్తించాలి. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడానికి ముందే బీసీ అధ్యయన కమిటీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల కోసం కమిటీలు వేశారు. వాటి సిఫార్సులకు అనుగుణంగా బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదని, బ్యాక్‌బోన్ క్లాస్‌గా సీఎం జగన్ గుర్తించారు. కాబట్టే ఆ వర్గాలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. పదవులన్నిటిలోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యమిచ్చారు. కులాలను చీల్చే విధంగా కాకుండా స్ఫూర్తిదాయక విధానాలతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సాధికారత కల్పిస్తున్నారు. సీఎం జగన్ సాధికారతకు సిసలైన నిర్వచనం ఇచ్చారు’ అని కృష్ణయ్య చెప్పారు. -
ఏపీలో బీసీలు.. బ్యాక్ బోన్ క్లాస్
సాక్షి, అమరావతి: బీసీల అభివృద్ధి కోసం రాష్ట్రంలో 139 బీసీ కులాలకుగాను 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం దేశచరిత్రలో నిలిచిపోయే నిర్ణయమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీసీలు బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్ అని నిరూపణ అయిందన్నారు. ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు బీసీలకు వంద సీట్లు ఇస్తానని చెప్పిన చంద్రబాబు పట్టించుకోలేదని చెప్పారు. సీఎం జగన్ నాయకత్వంలో గర్వంగా జీవిస్తున్న బీసీలంతా ఆయన వెంటే ఉండాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. -
ఏపీ: బీసీలకు సాధికారత
సాక్షి, అమరావతి: ‘బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని టీడీపీ కుట్రపూరితంగా అడ్డుకుంటే వెనుకంజ వేస్తామా! సాంకేతిక కారణాలతో బీసీలకు తగినంత రిజర్వేషన్లు ఇవ్వడం కుదరకపోతే మిన్నకుండిపోతామా?.. కానే కాదు.. వైఎస్సార్సీపీ తరఫున బీసీలకు 34 శాతం సీట్లు కేటాయిస్తాం. బీసీలకు నిజమైన రాజకీయ అధికారాన్ని అందిస్తాం..’ అని సీఎం వైఎస్ జగన్ ప్రకటించడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. దేశంలో తొలి నాయకుడు.. బీసీల సాధికారత, సామాజిక న్యాయం దిశగా సత్వరం స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను దేశవ్యాప్తంగా విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. 59.85 శాతం రిజర్వేషన్ల జీవోను టీడీపీ న్యాయ వివాదాలతో అడ్డుకున్నా సీఎం జగన్ వెనుకంజ వేయకుండా, బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా పార్టీ పరంగా వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం సీట్లు ఇస్తామని వెంటనే నిర్ణయం తీసుకున్నారని బీసీ సంఘాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాయి. దేశంలో ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకున్న తొలి నాయకుడు సీఎం జగన్ అని పేర్కొంటున్నాయి. దేశంలోని అన్ని పార్టీలూ ఇదే విధానాన్ని అనుసరిస్తే సామాజిక న్యాయం సాకారమవుతుందని సూచిస్తున్నాయి. బీసీలను వంచిస్తూ కపట నాటకాలాడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మరోసారి కోలుకోలేని గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నాయి. ముఖ్యమంత్రి తీసుకున్న సాహసోపేత నిర్ణయం క్షేత్రస్థాయి నుంచి రాజకీయ, సామాజిక ముఖచిత్రాన్ని సమూలంగా మారుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సుదీర్ఘ కాలం నుంచి దామాషా ప్రకారం రాజకీయ అధికారాన్ని కోరుతున్న బీసీ వర్గాలు ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. బీసీల పక్షపాతి వైఎస్ జగన్ బీసీలను ఓటుబ్యాంకుగా వాడుకున్న నేతలనే ఇన్నాళ్లూ చూశాం. బీసీల అభ్యున్నతిపై చిత్తశుద్ధితో వ్యవహరించిన నేతను ఒక్క సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిలో మాత్రమే చూశామని బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బీసీల సంక్షేమం, రాజ్యాధికారం దిశగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ వర్గాలకు 34 శాతం సీట్లు రిజర్వు చేసేందుకు వీలుగా మొత్తం రిజర్వేషన్లను 59.85 శాతంగా నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లోనే జీవో 176 జారీ చేయడం తెలిసిందే. దీంతో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న తమ నిరీక్షణ ఫలించిందని బీసీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. అయితే ఆ జీవోను వ్యతిరేకిస్తూ టీడీపీ నేత కోర్టును ఆశ్రయించడం, 59.85 శాతం రిజర్వేషన్లను న్యాయస్థానం కొట్టివేయడంతో బీసీ వర్గాలు తీవ్ర నిస్పృహకు గురయ్యాయి. సత్వరమే స్పందించారు.. న్యాయస్థానం ఉత్తర్వుల కారణంగా బీసీలకు చట్టప్రకారం 24 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పించాల్సిన పరిస్థితి అనివార్యమైంది. ఇలాంటి స్థితిలో మరో నేత ఎవరైనా అధికారంలో ఉంటే సాంకేతిక, న్యాయపరమైన అంశాలను సాకుగా చూపించి బీసీలకు రిజర్వేషన్లను తగ్గించేవారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బీసీల అభ్యున్నతిపై తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. న్యాయపరమైన అంశాల కారణంగా బీసీలకు చట్టప్రకారం 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేకపోతున్నందున పార్టీ పరంగా బీసీలకు 34 శాతం సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. పార్టీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. అద్భుత నిర్ణయం రిజర్వేషన్లపై కోర్టు కేసులతో కాలయాపన చేయాలన్న టీడీపీ ఎత్తుగడలకు లొంగకుండా ముఖ్యమంత్రి జగన్ పార్టీ పరంగా బీసీలకు 34 శాతం సీట్లు ప్రకటించడం అద్భుత నిర్ణయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రశంసించారు. బీసీ రిజర్వేషన్లపై వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పక్ష నేత వి.విజయసాయిరెడ్డి ద్వారా గతంలోనే రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టడం బీసీలపట్ల సీఎం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. చంద్రబాబు టీడీపీ నేత బిర్రు ప్రతాపరెడ్డితో కోర్టులో కేసు వేయించి ఆ జీవోను అడ్డుకున్నారని విమర్శించారు. మళ్లీ బీసీలను మోసగించేందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి డ్రామాకు తెర తీశారని దుయ్యబట్టారు. అయితే ముఖ్యమంత్రి జగన్ ఏమాత్రం కాలయాపన చేయకుండా పార్టీపరంగా 34 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించడం ద్వారా బీసీలకు తగిన న్యాయం చేశారని చెప్పారు. చిత్తశుద్ధితో అధిగమించిన సీఎం రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ప్రవచించిన స్ఫూర్తిని సీఎం వైఎస్ జగన్ ఆచరణలో చూపించారని విశ్లేషకులు కొనియాడుతున్నారు. సాంకేతిక కారణాలను సాకుగా చూపిస్తూ బీసీలకు తగినన్ని సీట్లు కేటాయించడం లేదని, చిత్తశుద్ధితో దీన్ని అధిగమించవచ్చని సీఎం వైఎస్ జగన్ నిరూపించారని ప్రశంసిస్తున్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేసేవరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న విధాన నిర్ణయాన్ని దేశంలోని ఇతర నేతలు కూడా అనుసరించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బీసీల పట్ల చిత్తశుద్ధికి నిదర్శనం – ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ‘పార్టీ పరంగా బీసీలకు 34 శాతం సీట్లు కేటాయించాలన్న నిర్ణయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తశుద్ధికి నిదర్శనం. ఎన్నికల కోసం రాజకీయ డ్రామాలాడటం వైఎస్సార్సీపీ విధానం కాదు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని వైఎస్సార్సీపీ ఇప్పటికే రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో బీసీలకు అత్యధికంగా సీట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. బీసీల తరపున ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. ఇదే రీతిలో పార్లమెంట్లో రాజ్యాంగ సవరణకు కూడా కృషి చేయాలని కోరుతున్నా’ తొలి సీఎం జగన్.. – జస్టిస్ ఈశ్వరయ్య, అఖిల భారత బీసీ సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు ‘సామాజిక న్యాయ సాధనలో ముఖ్యమంత్రి జగన్ చుక్కానిలా నిలిచారు. దామాషా ప్రకారం బీసీలకు సీట్లు కేటాయించాలని నిర్ణయించిన మొదటి ముఖ్యమంత్రి ఆయనే. దేశంలో మరే సీఎంగానీ, పార్టీ అధ్యక్షుడుగానీ ఇంతటి సాహసోపేత నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యమంత్రి జగన్‌ను చొరవను అభినందిస్తున్నాం’ దేశానికి ఆదర్శం.. – హనుమంతు లజపతిరాయ్, మాజీ వీసీ, అంబ్కేడర్ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం ‘పార్టీపరంగా బీసీలకు 34 శాతం సీట్లు కేటాయించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం దేశానికి ఆదర్శప్రాయం. దేశంలోని ఇతర ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీలు దీన్ని అనుసరిస్తే సామాజిక న్యాయం సాధ్యపడుతుంది’ బీసీ గర్జన హామీ చిత్తశుద్ధితో అమలు.. జనాభా ప్రాతిపదికన బీసీలకు అన్ని పదవుల్లోనూ పెద్దపీట వేస్తామని ఎన్నికల ముందు ఏలూరులో నిర్వహించిన ‘బీసీ గర్జన’లో ఆనాడు ప్రతిపక్ష నేత హోదాలో సీఎం జగన్ హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఇతర పార్టీల కంటే అత్యధికంగా బీసీలకు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కేటాయించారు. ఎన్నికల ముందు దక్కిన ఒకే ఒక్క ఎమ్మెల్సీ పదవిని బీసీ వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తికి ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రివర్గంలో బీసీలకు అగ్రస్థానం కట్టబెట్టారు. బీసీ వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, బీసీ ‘ఈ’ కేటగిరీకి చెందిన మైనార్టీ నేత అంజాద్ బాషను ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు. కీలకమైన రెవెన్యూ, పురపాలక, జలవనరులు, రోడ్లు–భవనాలు, మార్కెటింగ్, కార్మిక, మైనార్టీ, బీసీ సంక్షేమ శాఖలను వెనుకబడిన వర్గాలకు కేటాయించారు. స్పీకర్ పదవికి బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం ఎన్నికయ్యేలా కృషి చేశారు. తాజాగా క్షేత్రస్థాయి నుంచి రాజ్యాధికారాన్ని అందించేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరపున బీసీలకు 34 శాతం సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. రుణపడి ఉంటాం.. ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంతో బీసీ కులాలకు ఎంతో మేలు జరుగుతుంది. టీడీపీ హామీ ఇచ్చి మోసం చేస్తే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాట నిలబెట్టుకుని అండగా నిలుస్తోంది. బీసీలంతా ముఖ్యమంత్రికి రుణపడి ఉంటారు. – గదుల వెంకట్రావు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు, విజయనగరం బీసీలకు సముచిత స్థానం బీసీలకు రాజ్యాధికారం దిశగా సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. మంత్రివర్గ కూర్పు, బడ్జెట్, సీట్ల కేటాయింపులో బీసీలకు సముచిత స్థానం కల్పించి గత 30 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా అమలు చేస్తున్నారు. అద్భుతమైన ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు – మహంతి శ్రీరవి, తూర్పుకాపు అభినందనీయం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అదనంగా 10 శాతం సీట్లు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ఎమ్మెల్యేలకు టికెట్ల కేటాయింపు, మంత్రివర్గంలో చోటుతోపాటు నామినేటెడ్ పదవులు, కాంట్రాక్ట్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత సీఎంకే దక్కుతుంది. – శంకరయ్య, సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు న్యాయం జరుగుతుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం. పార్టీ తరపున 10 శాతం అదనంగా సీట్లు కేటాయించడం అభినందనీయం. రాజ్యాంగబద్ధంగా అదనపు రిజర్వేషన్లు పొందలేని బీసీలకు దీనివల్ల న్యాయం జరుగుతుంది. – అనుమోలు చుక్కయ్య, బీసీ సంఘం కృష్ణా జిల్లా మాజీ అధ్యక్షుడు బీసీ వ్యతిరేక శక్తులకు చెంపపెట్టు.. బీసీ వ్యతిరేక శక్తులకు చెంపపెట్టులా బలహీన వర్గాలకు అదనంగా 10 శాతం సీట్లు వైఎస్సార్సీపీ తరపున ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించడం అభినందనీయం. బీసీలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేసేందుకు దోహదపడుతుంది. – కోలా అశోక్, కృష్ణబలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాట నిలబెట్టుకున్నారు బీసీలకు ఇచ్చిన మాటను జగనన్న నిలబెట్టుకున్నారు. బీసీలను ఎదగనివ్వకుండా కుయుక్తులు పన్నుతున్న టీడీపీకి తగిన బుద్ధి చెప్పారు. కోర్టు తీర్పుతో రిజర్వేషన్లు తగ్గినప్పటికీ వైఎస్సార్సీపీ పరంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు పది శాతం అదనంగా టికెట్లు ఇవ్వాలని నిర్ణయించడం గొప్ప విషయం. – ప్రకాష్, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు ఏపీ రజక సంఘాల ఐక్యవేదిక చరిత్రాత్మక నిర్ణయం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున బీసీలకు అదనంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం. బీసీలు సీఎంకు రుణపడి ఉంటారు. గత ప్రభుత్వాలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయి. బీసీలకు ఎలాంటి అవకాశాలు కల్పించలేదు. – లక్ష్మీనారాయణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, అనంతపురం మహిళలకు అవకాశం బీసీలకు సీట్లు పెరగడం వల్ల ఇన్నాళ్లూ ఇంటికే పరిమితమైన గృహిణులు కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నికై విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయి. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామం. – మానేపల్లి వీరేష్, స్వర్ణకారుడు, అమలాపురం బాబుది కాటు తంత్రం .. జగన్‌ది సామాజిక మంత్రం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు పన్నిన కుట్రలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమర్థంగా తిప్పికొట్టారని బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బలహీన వర్గాలకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తామంటే చంద్రబాబుకు ఎందుకంత కడుపుమంటని ప్రశ్నిస్తున్నాయి. గత ఎన్నికల్లో గుణపాఠం నేర్పినా బుద్ధి మారని టీడీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో చావుదెబ్బ తప్పదని స్పష్టం చేస్తున్నాయి. -
'విశాఖ వద్దంటే.. బీసీల అభ్యున్నతిని అడ్డుకున్నట్టే'
సాక్షి, విశాఖపట్నం: వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిలో భాగంగానే విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని ప్రతిపాదన వచ్చిందని, చంద్రబాబు నాయుడు వద్దంటే బీసీల అభ్యున్నతికి అడ్డుకున్నట్లేనని ఆలిండియా బీసీ ప్రజా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గూడూరు వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం ఒక సమావేశంలో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మూడు ప్రాంతాల అభివృద్ధికి తీసుకొన్న నిర్ణయాన్ని బీసీ సంఘాలు స్వాగతిస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్ల బీసీలకు కలిగిన నష్టాన్ని సీఎం జగన్ పూడ్చుతున్నారని తెలిపారు. 85 శాతం మంది బీసీలు ఉన్న ఉత్తరాంధ్రలో రాజధాని నిర్మాణం.. బీసీల అభ్యున్నతికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో బీసీలకు ఏడాదికి రూ. 10 వేల కోట్లు ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు.. ఐదేళ్ల పాలనలో రూ. పది వేల కోట్లను వెచ్చించలేదంటూ ఆరోపించారు. బీసీల ఓట్లతో అధికారం చెలాయించిన పార్టీలు పట్టించుకోకపోగా.. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టి ఒక చారిత్రక ప్రయత్నం చేశారని ప్రశంసించారు. కార్యక్రమంలో ఆలిండియా బీసీ ప్రజా వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పిల్లి నూకరాజు తదితరులు పాల్గొన్నారు. -
నిధుల కేటాయింపుల్లో వెనుకబాటు..
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో బీసీసంక్షేమానికి ప్రాధా న్యం తగ్గింది. 2019–20 వార్షిక సంవత్సరా నికి వెనుకబడిన తరగతుల సంక్షేమానికి రూ.4,528.01 కోట్లు మాత్రమే కేటాయించింది. గత కేటాయింపు లతో పోలిస్తే ఈసారి బడ్జెట్లో బీసీ సంక్షేమానికి రూ.1,391.82 కోట్లు తగ్గింది. జనాభాలో సగం ఉన్న బీసీలకు ప్రత్యేక అభివృద్ధి నిధి కేటాయించా లని గత కొంతకాలంగా డిమాండ్ వస్తుండగా 2017 డిసెంబర్ నెలలో బీసీల సంక్షేమంపై సీఎం కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 2018– 19 వార్షిక బడ్జెట్లో బీసీ ప్రత్యేక అభివృద్ధి నిధిని అమల్లోకి తీసుకొస్తారని అంతా భావించినా బడ్జెట్ కేటాయింపుల్లో రూ. 850కోట్లు అదనంగా కేటాయించి కొంత ప్రాధాన్యమిచ్చారు. ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో అదే తరహా ప్రాధాన్యం దక్కు తుందని భావించినా తాజా బడ్జెట్ గణాంకాలను చూస్తే పెద్ద మొత్తానికి కోత పెట్టడం గమనార్హం. అత్యంత వెనుకబడిన కులాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. 2017–18 వార్షిక సంవత్సరంలో ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించింది. అదేతరహాలో 2018–19లో రూ.వెయ్యి కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది బడ్జెట్లో కూడా రూ. 1,000 కోట్లు కేటాయించింది. తొలి ఏడాది నిధులు కేటాయించినా ఎంబీసీలపై స్పష్టత రాకపోవడంతో ఆ నిధులను ఖర్చు చేయ లేదు. ప్రస్తుత వార్షిక సంవత్సరంలో ఎంబీసీలపై ప్రభుత్వం స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు విడుదల చేసినా.. ఎంబీసీ కార్పొరేషన్ మాత్రం రూ.50కోట్లు ఖర్చు చేసి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. కానీ రాయితీ రుణాలు, స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుపై పెద్దగా స్పందన లేదు. తాజా బడ్జెట్లో రూ. 1,000 కోట్లు కేటాయించగా ఈ సారైనా పూర్తిస్థాయిలో ఖర్చు చేస్తారో లేదో చూడాలి. అయితే బీసీ కార్పొరేషన్, 12 బీసీ ఫెడరేషన్లకు బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేదు. 2019–20 వార్షిక సంవత్సరంలో రాష్ట్రంలో 119 బీసీ గురుకులాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో బీసీలకు 23 గురుకులాలే ఉండగా.. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని 2017–18 వార్షిక సంవత్సరంలో 119 గురుకులాలను ఏర్పాటు చేసింది. తాజాగా మరో 119 గురుకులాలకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఈ ఏడాది జూన్‌లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. సంక్షేమానికి తగ్గిన కేటాయింపులు గతేడాది కంటే రూ.170.58 కోట్లు తక్కువ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో మహిళాభివృద్ధి, శిశు, వికలాంగ సంక్షేమానికి ప్రాధాన్యత దక్కలేదు. 2019–20 వార్షిక సంవత్సరానికి ఈ శాఖకు రూ.1,628.24 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే తాజా కేటాయింపుల్లో రూ.170.58 కోట్లు తగ్గింది. 2018–19 వార్షిక సంవత్సరంలో ఈ శాఖకు రూ.1,798.82 కోట్లు, 2017–18లో రూ.1,731.50 కోట్లు చొప్పున ప్రభుత్వం కేటాయిం చింది. కొత్త పథకాలేవీ ప్రవేశపెట్టనప్పటికీ గతేడాది నుంచి అమల్లోకి వచ్చి న స్త్రీ శక్తి కేంద్రాలు, సఖి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకోలేదు. పశుసంవర్ధక, మత్స్యశాఖకు 1,204 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పశుసంవర్ధక, మత్స్యశాఖకు రూ.1,204.97 కోట్లు కేటాయించింది. ఇందులో పశుసంవర్థక శాఖకు రూ.650 కోట్ల నిధులు ఉన్నాయి. పశువులకు సంబంధించిన మందుల కొనుగోలు, గడ్డి విత్తనాల పంపిణీ, ఇతర పథకాల అమలు, సిబ్బంది వేతనాలకు కలిపి రూ.200 కోట్లు ప్రతిపాదించింది. విజయ డెయిరీకి పాలు పోస్తున్న పాడి రైతులకు లీటరు పాలపై రూ.4 ప్రోత్సాహకం చెల్లిస్తున్నారు. మరో 4 ప్రైవేట్ డెయిరీలకు పాలు, 2.13 లక్షల మంది రైతులకు ప్రోత్సాహకం ఇస్తున్నారు. మత్స్యశాఖకు రూ.320 కోట్లు ప్రతిపాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చేప పిల్లల పంపిణీ, రొయ్యల పెంపకానికి నిధులు ప్రతిపాదించారు. -
‘కాంగ్రెస్‌తోనే ప్రజలకు న్యాయం’
సాక్షి, మహబూబ్ నగర్ : కాంగ్రెస్ పార్టీవల్లే దళిత, బహుజన, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని టీపీసీసీ వర్కంగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క అన్నారు. మహబూబ్ నగర్లో శనివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీసీలు ఆర్ధిక, సామాజిక, విద్య, ఉద్యోగాల వంటి అన్ని రంగాల్లో ముందున్నారని కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని దశాబ్దాల వెనక్కు నెట్టిందని మండిపడ్డారు. అధికారంలో ఉన్నా లేకున్నా.. కాంగ్రెస్ ప్రజల అభివృద్ధికి పాటుపడుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో బీసీ విద్యార్ధుల్ని ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించామని, దాంతో వారు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో ఐఐటీ, ట్రిపుల్ ఐటీ వంటి విద్యాసంస్థలను తీసుకువస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు గొర్రెలు.. బర్రెలు అంటూ తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపించారు. బీసీలు సమష్టిగా ముందుకు వెళితేనే ఆర్థిక, రాజకీయ, సామాజికంగా ఎదుగుతామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు వి. హనుమంతరావు, బీసీ నేత చిత్తరంజన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీల బలోపేతానికి ప్రభుత్వం కృషి
కాకినాడ సిటీ : వెనుకబడిన తరగతుల వారిని ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఏపీ నాయీ బ్రాహ్మణ సహకార సంఘాల సమాఖ్య, బీసీ కార్పొరేష¯ŒS స్థానిక అంబేడ్కర్ భవ¯ŒSలో గురువారం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బీసీలు సమాజంలో పైస్థాయికి ఎదగడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టిందన్నారు. మరో అతిథి, పౌరసరఫరాల శాఖామంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఏపీ నాయీబ్రాహ్మణ సహకార సంఘ సమాఖ్య చైర్మ¯ŒS గంటుపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ 11 నుంచి 15 మంది బీసీలు సంఘంగా ఏర్పడి బీసీ వెల్ఫేర్ డీడీ వద్ద అన్ని వివరాలు సమర్పిస్తే 15 రోజుల్లో రిజిస్ట్రేష¯ŒS పూర్తి చేస్తారన్నారు. చేతివృత్తులు, కుల వృత్తులపై ఆధారపడే వారికి ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు, జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్–2 రాధాకృష్ణమూర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మ¯ŒS నల్లమిల్లి వీర్?రడ్డి, బీసీ కార్పొరేష¯ŒS డైరెక్టర్ చంద్రమౌళి, ఈడీ ఎం.జ్యోతి, బీసీ వెల్ఫేర్ డీడీ చిన్నబాబు, నాయీ బ్రాహ్మణ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
బీసీల సంక్షేమమే ధ్యేయం
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : వెనుకబడిన తరగతుల సంక్షమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ, ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాజమహేంద్రవరంలోని ఆనం కళా కేంద్రంలో చంద్రన్న బీసీ స్వయం ఉపాధి ఉత్సవాలను శుక్రవారం ఆయన ప్రారంభించి, 4013 మందికి రూ.102 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో 897 హాస్టళ్లలో లక్ష మంది, 32 రెసిడెన్షియల్ పాఠశాలల్లో 16 వేల మంది, 370 బీసీ కళాశాల వసతి గృహాల్లో 36 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. అన్ని బీసీ వసతి గృహాలను రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ ఏడాది 1000 మందిని విద్యోన్నతి పథకం ద్వారా విదేశాల్లో చదివించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అవసరమైతే బ్యాంకుల ద్వారా ఒక్కోక్కరికీ రూ. 10 లక్షలు రుణం ఇప్పిస్తామన్నారు. గతంలో మత్స్యకారులకు పడవలు పంపిణీ చేశామని, ఈసారి పడవలతో పాటు వలలు కూడా అందించేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 150 ఎకరాలు సేకరించి బీసీ యువ పారిశ్రామిక వేత్తలకు అందజేస్తామన్నారు. బీసీల్లోని అన్ని కులాల కోసం 11 ఫెడరేషన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లు, డైరెక్టర్లను నియమిస్తామన్నారు. రూ. 5 కోట్లతో బీసీ భవన్ నిర్మాణం అన్ని జిల్లాల్లోని ముఖ్య కేంద్రాల్లో రూ.5 కోట్లతో బీసీ భవన్ నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. జెడ్పీచైర్మన్ నామన రాంబాబు మాట్లాడుతూ బీసీలందరూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. కలెక్టర్ అరుణ్‌కుమార్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ హర్షవర్ధన్, జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ జ్యోతి, డీడీ ఎం.చినబాబు పాల్గొన్నారు. సభ మొత్తం విద్యార్థులే..! ఆనం కళా కేంద్రంలో జరిగిన బీసీ రుణాల పంపిణీ కార్యక్రమంలో ఎటు చూసినా 18 ఏళ్లలోపు విద్యార్థులే కనిపించారు. లబ్ధిదారులు, నాయకులు కలిపి సుమారు 150 మంది ఉన్నారు. సభను విజయవంతం చేసేందుకు నగరంలోని రామకృష్ణ మఠం, దానవాయిపేట, గణేష్‌చౌక్, సీతంపేట, టీటీడీ కల్యాణ మండపం సమీపం, టూ టౌన్ ఎదురుగా ఉన్న బీసీ హాస్టల్ విద్యార్థులు సుమారు 1100 మందిని ఆటోల్లో ఆనం కళాకేంద్రానికి తరలించారు. -
బీసీలు గర్వంగా బతకాలి!
-
ఐకమత్యంతోనే బీసీల అభివృద్ధి
జక్రాన్‌పల్లి, న్యూస్‌లైన్: ఐకమత్యంతోనే బీసీల అభివృద్ధి సాధ్యమని, భావి తరాల భవిష్యత్తు కోసం సంఘటితం కావాలని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రీయ కళ్యాణ మండపంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన బీసీల సమర భేరికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చట్ట సభల్లో బీసీల వాణి వినిపించే వారు లేకే ఈ దుస్థితి నెలకొందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకే ఓట్లు వేసి గెలిపించాలని సూచించారు. వడ్డించే వాడు మన వాడు లేకపోవడం వల్లే బీసీలు సామాజికంగా వెనుకబడ్డారని అన్నారు. బీసీల ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. అగ్ర వర్ణాలకు వణుకు పుడుతోంది.. - ఎంపీ మధుయాష్కీగౌడ్ బీసీల్లో చైతన్యం చూసి అగ్ర వర్ణాల్లో వణుకు పుడుతోందని ఎంపీ మధుయాష్కీ అన్నారు. ఈ చైతన్యం రాజ్యాధికారం సాధించే వరకు కొనసాగించాలని సూచించారు. బీసీ నాయకులు చట్ట సభలకు వెళ్లి అగ్రవర్ణాల అడుగులకు మడుగులొత్తుతున్నారని, స్వార్థపూరిత ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. బానిసలుగా బతుకుతున్న కారణంగానే ఈ దుస్థితి నెలకొందన్నారు. బీసీల అభ్యున్నతి కోసం నాలుగు దశాబ్దాలుగా కృషి చేస్తున్న కృష్ణయ్యకు రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని, ఇందుకు సభలో తీర్మానం చేయాలని సూచించారు. ఇందుకు కేంద్ర స్థాయిలో తన ప్రయత్నం చేస్తానని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లుకు ఫిబ్రవరి సమావేశాల్లో తప్పకుండా ఆమోదం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంకిత భావం లేకపోవడమే కారణం - ఎమ్మెల్సీ వీజీ గౌడ్ చట్ట సభలకు ఎన్నికైన బీసీ నాయకుల్లో అంకిత భావం లేకపోవడం వల్లనే బీసీలకు అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్ అభిప్రాయపడ్డారు. దేశంలో బీసీలు 50 శాతానికి పైగా ఉన్నారని, జనాభా దామాషా ప్రకారం చట్ట సభల్లో ప్రాతినిధ్యం లభించడం లేదన్నారు. బీసీలకు డిక్లెరేషన్ ప్రకటించిన పార్టీలనే గెలిపించాలని, ఇందుకు అన్ని పార్టీలపై ఒత్తిడి తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో బడుగులే సమిధలు - టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజారాం యాదవ్ తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులే ఆత్మ బలిదానాలు చేసి ఉద్యమానికి సమిధలయ్యారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజారాం యాదవ్ అన్నారు. కేసీఆర్ ఉద్యమానికి ముందే ఓయూలో తెలంగాణ కోసం ఉద్యమం చేపట్టామని చెప్పారు. రాబోయే తెలంగాణలో బీసీల వాటా దక్కాలని, ఇందుకు పోరాటం చేయాలని అన్నారు. బీసీల అనైక్యతే బలహీనత అని, సంఘటితం కావాలని కోరారు. ఎన్నాళ్లైనా బానిస బతుకులే... - బీజేపీ రాష్ట్ర నాయకుడు అల్జాపూర్ శ్రీనివాస్ రాజ్యాధికారం అగ్ర వర్ణాల చేతిలో ఉంటే ఇంకా ఎన్నాళ్లయినా బానిస బతుకులేనని బీజేపీ రాష్ట్ర నాయకుడు అల్జాపూర్ శ్రీనివాస్ అన్నారు. స్వాభిమానంతో ఓటు వేసి బీసీలనే గెలిపించాలని సూచించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోడీని ప్రకటించిందని, గెలిపించాలని కోరారు. పార్టీలు పట్టించుకోవడంలేదు - బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అగ్ర వర్గాలకు చెందిన నాయకులు పార్టీలను పట్టించుకోవడం లేదని, ఏ పార్టీకి చెందిన వారైనా తమ వర్గం వారికి అండగా నిలుస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాజాలు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కానీ బీసీలు మాత్రమే పార్టీలు అంటూ అంటున్నారని అన్నారు. బీసీలు 65 ఏళ్లుగా పార్టీల పేరుతో మోసపోతున్నారని, ఇక మీదటైనా సంఘటితం కావాలని సూచించారు. లేనిపక్షంలో మరో శతాబ్దమైనా బీసీల బతుకుల్లో మార్పు రాదన్నారు. సభలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, రాష్ట్ర కన్వీనర్ ఎ భాస్కర్, ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్మన్లు కంచెట్టి గంగాధర్, త్రివేణి గంగాధర్, ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జిల్లా కృష్ణ పండిత్ గౌడ్, చిల్క కిష్టయ్య, డీసీసీ ఉపాధ్యక్షుడు రాజశేఖర్ రావు, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర నాయకుడు భూమన్న యాదవ్, జిల్లా సర్పంచ్ గోర్త రాజేందర్, జిల్లా యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఖాందేశ్ శ్రీనివాస్, తదితరులు ప్రసంగించారు. ఆదిలాబాద్, మెదక్ అధ్యక్షుడు కిష్ణు, కల్లారి హరికృష్ణ, ఎంసీ లింగన్న, బీసీ సంఘాల నాయకులు చక్రవర్తి, వీర్ కుమార్, పుల్గం మోహన్, పద్మలత, వినోద్ కుమార్, జగదీశ్వర్, అశోక్, విద్యార్థి నాయకుడు యెండల ప్రదీప్ కుమార్, తదితరులతో పాటు వివిధ కళాశాలల విద్యార్థులు, జిల్లా నలుమూలల నుంచి బీసీ నాయకులు, సర్పంచ్‌లు, మాజీ ప్రజా ప్రతినిధులు, బీసీలు పాల్గొన్నారు. కృష్ణయ్యను సన్మానించిన సంతోష్ రెడ్డి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్యను మాజీ మంత్రి శనిగరం సంతోష్‌రెడ్డి పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు. సమర భేరి సభకు విచ్చేసి సంతోష్ రెడ్డి అందరినీ ఆశ్చర్య పరిచారు. నేరుగా సభపైకి వెళ్లి కృష్ణయ్యను ఆలింగనం చేసుకుని సత్కరించారు.