సాక్షి, హైదరాబాద్: బడ్జెట్‌లో బీసీసంక్షేమానికి ప్రాధా న్యం తగ్గింది. 2019–20 వార్షిక సంవత్సరా నికి వెనుకబడిన తరగతుల సంక్షేమానికి రూ.4,528.01 కోట్లు మాత్రమే కేటాయించింది. గత కేటాయింపు లతో పోలిస్తే ఈసారి బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి రూ.1,391.82 కోట్లు తగ్గింది. జనాభాలో సగం ఉన్న బీసీలకు ప్రత్యేక అభివృద్ధి నిధి కేటాయించా లని గత కొంతకాలంగా డిమాండ్ వస్తుండగా 2017 డిసెంబర్ నెలలో బీసీల సంక్షేమంపై సీఎం కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 2018– 19 వార్షిక బడ్జెట్‌లో బీసీ ప్రత్యేక అభివృద్ధి నిధిని అమల్లోకి తీసుకొస్తారని అంతా భావించినా బడ్జెట్ కేటాయింపుల్లో రూ. 850కోట్లు అదనంగా కేటాయించి కొంత ప్రాధాన్యమిచ్చారు. ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో అదే తరహా ప్రాధాన్యం దక్కు తుందని భావించినా తాజా బడ్జెట్ గణాంకాలను చూస్తే పెద్ద మొత్తానికి కోత పెట్టడం గమనార్హం.
అత్యంత వెనుకబడిన కులాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. 2017–18 వార్షిక సంవత్సరంలో ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించింది. అదేతరహాలో 2018–19లో రూ.వెయ్యి కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది బడ్జెట్లో కూడా రూ. 1,000 కోట్లు కేటాయించింది.
తొలి ఏడాది నిధులు కేటాయించినా ఎంబీసీలపై స్పష్టత రాకపోవడంతో ఆ నిధులను ఖర్చు చేయ లేదు. ప్రస్తుత వార్షిక సంవత్సరంలో ఎంబీసీలపై ప్రభుత్వం స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు విడుదల చేసినా.. ఎంబీసీ కార్పొరేషన్ మాత్రం రూ.50కోట్లు ఖర్చు చేసి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. కానీ రాయితీ రుణాలు, స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుపై పెద్దగా స్పందన లేదు. తాజా బడ్జెట్‌లో రూ. 1,000 కోట్లు కేటాయించగా ఈ సారైనా పూర్తిస్థాయిలో ఖర్చు చేస్తారో లేదో చూడాలి. అయితే బీసీ కార్పొరేషన్, 12 బీసీ ఫెడరేషన్లకు బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావన లేదు.
2019–20 వార్షిక సంవత్సరంలో రాష్ట్రంలో 119 బీసీ గురుకులాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో బీసీలకు 23 గురుకులాలే ఉండగా.. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని 2017–18 వార్షిక సంవత్సరంలో 119 గురుకులాలను ఏర్పాటు చేసింది. తాజాగా మరో 119 గురుకులాలకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఈ ఏడాది జూన్‌లో ఇవి అందుబాటులోకి రానున్నాయి.
సంక్షేమానికి తగ్గిన కేటాయింపులు
గతేడాది కంటే రూ.170.58 కోట్లు తక్కువ
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో మహిళాభివృద్ధి, శిశు, వికలాంగ సంక్షేమానికి ప్రాధాన్యత దక్కలేదు. 2019–20 వార్షిక సంవత్సరానికి ఈ శాఖకు రూ.1,628.24 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే తాజా కేటాయింపుల్లో రూ.170.58 కోట్లు తగ్గింది. 2018–19 వార్షిక సంవత్సరంలో ఈ శాఖకు రూ.1,798.82 కోట్లు, 2017–18లో రూ.1,731.50 కోట్లు చొప్పున ప్రభుత్వం కేటాయిం చింది. కొత్త పథకాలేవీ ప్రవేశపెట్టనప్పటికీ గతేడాది నుంచి అమల్లోకి వచ్చి న స్త్రీ శక్తి కేంద్రాలు, సఖి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకోలేదు.
పశుసంవర్ధక, మత్స్యశాఖకు 1,204 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో పశుసంవర్ధక, మత్స్యశాఖకు రూ.1,204.97 కోట్లు కేటాయించింది. ఇందులో పశుసంవర్థక శాఖకు రూ.650 కోట్ల నిధులు ఉన్నాయి. పశువులకు సంబంధించిన మందుల కొనుగోలు, గడ్డి విత్తనాల పంపిణీ, ఇతర పథకాల అమలు, సిబ్బంది వేతనాలకు కలిపి రూ.200 కోట్లు ప్రతిపాదించింది. విజయ డెయిరీకి పాలు పోస్తున్న పాడి రైతులకు లీటరు పాలపై రూ.4 ప్రోత్సాహకం చెల్లిస్తున్నారు. మరో 4 ప్రైవేట్ డెయిరీలకు పాలు, 2.13 లక్షల మంది రైతులకు ప్రోత్సాహకం ఇస్తున్నారు. మత్స్యశాఖకు రూ.320 కోట్లు ప్రతిపాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చేప పిల్లల పంపిణీ, రొయ్యల పెంపకానికి నిధులు ప్రతిపాదించారు.
Comments
Please login to add a commentAdd a comment