సాక్షి, అమరావతి: బీసీల అభివృద్ధి కోసం రాష్ట్రంలో 139 బీసీ కులాలకుగాను 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం దేశచరిత్రలో నిలిచిపోయే నిర్ణయమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీసీలు బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్ అని నిరూపణ అయిందన్నారు. ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు బీసీలకు వంద సీట్లు ఇస్తానని చెప్పిన చంద్రబాబు పట్టించుకోలేదని చెప్పారు. సీఎం జగన్ నాయకత్వంలో గర్వంగా జీవిస్తున్న బీసీలంతా ఆయన వెంటే ఉండాలని నిర్ణయించుకున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment