దళితులను ‘పంది’తో పోల్చిన ఎమ్మెల్యే | MLA NCP targets BJP MLA over pig analogy for Dalits' uplift Mumbai | Sakshi
Sakshi News home page

దళితులను ‘పంది’తో పోల్చిన ఎమ్మెల్యే

Published Tue, Jun 21 2016 8:56 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

దళితులను ‘పంది’తో పోల్చిన ఎమ్మెల్యే - Sakshi

దళితులను ‘పంది’తో పోల్చిన ఎమ్మెల్యే

ముంబై: దళితులను అభ్యున్నతి గురించి మాట్లాడుతూ వారిని పందితో పోల్చిన ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ నెల 17న థానే జిల్లాలో జరిగిన ఓ మీటింగ్ లో బీజేపీ ఎమ్మెల్యే దొంబివ్లీ రవీంద్ర చవాన్ దళితుల అభ్యున్నతిపై ఉపన్యసిస్తూ వారిని పందితో పోల్చారు. అబ్రహం లింకన్ డ్రైనేజీలోని పందిని తీసి శుభ్రం చేసిన తరహాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లు కూడా దళితుల అభ్యన్నతికి కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఆయన చేసిన ఈ అభ్యతరంకరమైన వ్యాఖ్యలపై ఆన్‌లైన్‌లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిపై నిరసన చేపట్టిన ఎన్సీపీ ఆ పంది పేరు రవీంద్ర చవాన్ అంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు. దళితులపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ఎన్సీపీ డిమాండ్ చేసింది. దీనిపై స్పందించిన చవాన్ తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, దళితులపై అలాంటి వ్యాఖ్యలు తాను చేయలేదని, తన వ్యాఖ్యల వీడియోను మార్ఫింగ్ చేశారని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement