
క్యాష్ ఏజెంట్లే వాళ్ల టార్గెట్: సీపీ మహేందర్‌రెడ్డి
హైదరాబాద్: ఫయిమ్ మిర్జా ముఠా నగరంలో భారీ దోపిడీకి వ్యూహం పన్నిందని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. పట్టపగలు జూబ్లీహిల్స్‌లో అంతర్‌రాష్ట్ర ముఠా కాల్పుల ఘటన పై మాట్లాడుతు.. గుల్బర్గా నుంచి వచ్చిన ఆ ముఠా నగరంలో దోపిడీ చేసేందుకు వ్యూహం పన్నినట్లుగా తెలిపారు. బిగ్ సీ మేనేజర్ దుండగులతో కలిసి దోపిడికి ప్రణాకలు రచించారని తెలిపారు. క్యాష్ కలెక్షన్ బాయ్లు పెద్ద మొత్తంలో డబ్బు తీసుకెళ్లే సమయంలో డబ్బు దోపిడీ చేయాలని పథకం రచించారాని చెప్పారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఐదు రోజులుగా గ్యాంగ్‌ను గుర్తించేందుకు గాలింపు చేపట్టారని ఆయన తెలిపారు. మాదాపూర్ లో వీరి కదలికలను గమనించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు 5 బైక్ లపై వాళ్లని వెంబడించారు. నీరుస్ జంక్షన్ వద్ద వారిని ఆపడానికి ప్రయత్రించగా కాల్పులు జరిపారన్నారు. కాల్పుల్లో ఎల్ అండ్ టీ ఉద్యోగి ధర్మేందర్ గాయపడటం దురదృష్టకరమన్నారు. దైర్యసాహసాలు ప్రదర్శించి దుండగులను పట్టుకున్న పోలీసులకు రివార్డులు ఇవ్వనున్నట్టు మహేందర్ రెడ్డి తెలిపారు.
ఎవరీ ఫయీమ్?
టోలీచౌకికి చెందిన ఫయిమ్ మిర్జా ఏడేళ్ల క్రితం గుల్బర్గాకు వెళ్లి అక్కడే ఉంటున్నాడు. 2012లో అక్కడ ఓ హత్య కేసులో నిందితుడు. బెయిల్‌పై వచ్చి కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. నగరంలో దోపిడీలకు పాల్పడి గుల్బర్గాలో తలదాచుకుంటాడు. అక్కడ కూడా దోపిడీలు చేసి పోలీసులను చిక్కకుండా ఉండేందుకు మకాంను హైదరాబాద్‌కు మార్చుతుంటాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో భారీ దోపిడీకి స్కెచ్ వేసి పోలీసులకు దొరికిపోయాడు.
అసలు ఎవరు వారు..?
గుల్బర్గాలో నివాసం ఉంటున్న టోలీచౌకి వాసి మీర్జా మహమ్మద్ అబ్దుల్లా(32) అలియాస్ ఫయీమ్ మిర్జా ఈ ముఠాకు నాయకుడు. కరుడుగట్టిన నేరగాడిగా పోలీసు రికార్డుల్లో ఉన్న ఇతడు హైదరాబాద్‌లో భారీ దోపిడీకి స్కెచ్ వేశాడు. తన సహచరులు మహమ్మద్ సమీయుద్దీన్ (లంగర్‌హౌస్‌వాసి), అబ్దుల్ ఖదీర్(గుల్బర్గావాసి)తో కలిసి ఐదు రోజుల క్రితమే నగరానికి వచ్చాడు. వీరంతా ఫయీమ్ మిర్జా ఇంట్లోనే ఉంటున్నారు.