‘ఆదిత్య ఎల్‌-1’ ఎక్కడివరకూ వచ్చింది? ఏ పరికరాలు ఏం చేస్తున్నాయి? | Aditya L1 Mission to reach destination on 6th January 2024 - Sakshi
Sakshi News home page

Aditya-1 mission: ‘ఆదిత్య ఎల్‌-1’ ఎక్కడివరకూ వచ్చింది? ఏ పరికరాలు ఏం చేస్తున్నాయి?

Published Sat, Dec 30 2023 1:58 PM | Last Updated on Sat, Dec 30 2023 2:51 PM

Aditya 1 mission to reach targetted point expected on 6th january 2024 - Sakshi

చంద్రయాన్ 3 విజయంతో భారత ఇస్రో ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. చంద్రునిపై కాలిడిన దేశాల సరసన భారత్‌ చేరింది. ఈ విజయానంతరం కొద్దిరోజుల వ్యవధిలోనే ఇస్రో మరో ఘనమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. 2023 సెప్టెంబర్ 2వ తేదీన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సూర్యుని కక్ష్యలోకి ఆదిత్య ఎల్- 1 మిషన్ ప్రయోగించింది. ఈ అంతరిక్ష నౌక భూమి నుంచి అంతరిక్షంలో 125 రోజుల పాటు ఒక మిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణం సాగించిన తరువాత సూర్యునికి అత్యంత సమీపంలోని లాగ్రేంజియన్ పాయింట్‌లో ప్రవేశిస్తుంది. 

కాగా ఈ మిషన్ తాజా అప్‌డేట్స్‌ వివరాలను ఇస్రో ఛైర్మన్ సోమనాధ్ మీడియాకు వెల్లడించారు. 2024 జనవరి 6వ తేదీనాటికి ఆదిత్య ఎల్- 1 మిషన్ నిర్దేశిత, తుది లక్ష్యానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు ఇస్రో ఛైర్మనన్ సోమనాధ్ పేర్కొన్నారు. సూర్యుని అధ్యయనం చేసేందుకు భారత్‌ ప్రయోగించిన తొలి మిషన్ ఆదిత్య ఎల్- 1. జనవరి 7, 2024 నాటికి ఈ మిషన్‌ ప్రక్రియ పూర్తి కానుంది. సూర్యుని కక్ష్యలో చేరిన తరువాత నిర్దేశించిన కార్యకపాలు నెరవేరుస్తూ, శాస్త్రీయ ప్రయోగాలకు అవసరమయ్యేలా మిషన్ ఆదిత్య ఎల్- 1 సూర్యుని చిత్రాలను తీసి పంపిస్తుంది.  

సౌర కుటుంబం అంతటికీ తన వెలుగుల ద్వారా శక్తిని అందించే సూర్యునిపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వదిలిన బాణం ఆదిత్య-ఎల్‌1 లక్ష్యం వైపు దూసుకెళుతోంది. ఇది తన నాలుగు నెలల ప్రయాణంలో 15 లక్షల కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి ఈ అబ్జర్వేటరీ (వేధశాల) భూమితోపాటు సూర్యుని ఆకర్షణ శక్తి లేని లగ్రాంజ్‌ పాయింట్‌ వద్దకు చేరుకోనుంది. ఇంతకీ ఆదిత్య-ఎల్‌-1లో ఏఏ పరికరాలున్నాయి? వాటితో సాగించే ప్రయోగాలేమిటి? దీనితో మనకొచ్చే ప్రయోజనాలేమిటి? 

ఆదిత్య-ఎల్‌-1లో మొత్తం ఏడు శాస్త్రీయ పరికరాలు ఉన్నాయి. వీటిలో నాలుగు సూర్యుడిని పరిశీలించేందుకు ఉపయోగపడుతుండగా, మిగిలిన మూడు లగ్రాంజ్‌ పాయింట్‌ దగ్గరే వేర్వేరు ప్రయోగాలు చేయనున్నాయి. ఒక్కో పరికరం చేసే పనేమిటో, దాని ప్రాముఖ్యత  ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనాగ్రఫ్‌ (వీఈఎల్‌సీ): సూర్యుడు నిజానికి ఓ మహా వాయుగోళం. హైడ్రోజన్‌ అణువులు ఒకదానిలో మరొకటి కలిసిపోతూ (కేంద్రక సంలీన ప్రక్రియ) అపారమైన శక్తిని విడుదల చేస్తూండే ప్రాంతమే సూర్యుడు. కంటికి కనిపించే సూర్యుడి భాగాన్ని ఫొటోస్ఫియర్‌ అని అంటారు. దీని దిగువన ఉన్న మరో పొరను క్రోమోస్ఫియర్‌ అని, దాని దిగువన ఉన్న ఇంకో పొరను కరోనా అని పిలుస్తారు. వీఈఎల్‌సీ అనేది ఈ కరోనా పొరకు సంబంధించిన  ఛాయాచిత్రాలను తీస్తుంది. దీనికితోడు వేర్వేరు కాంతుల్లో (పరారుణ, అతినీలలోహిత, ఎక్స్‌-రే) కరోనాను పరిశీలిస్తుంది. 

బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌, ఇస్రోలు కలిసి రూపొందించిన ఈ పరికరం కరోనా నుంచి వెలువడే శక్తిమంతమైన కణాల ప్రవాహాన్ని (కరోనల్‌ మాస్‌ ఎజెక‌్షన్‌)కూడా గుర్తిస్తుంది. ఈ కరోనల్‌ మాస్‌ ఎజెక‌్షన్ల కారణంగా వెలువడే శక్తిమంతమైన ఫొటాన్లు భూ వాతావరణం, వానల తీరుతెన్నులపై ప్రభావం చూపగలవని అంచనా.

సోలార్‌ అల్ట్రావయలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌(ఎస్‌యూఐటీ): వీఈఎల్‌సీ కరోనా అధ్యయనానికి ఉపయోగిస్తూంటే ఈ ఎస్‌యూఐటీని ఫొటో స్ఫియర్‌, క్రోమోస్ఫియర్ల ఛాయాచిత్రాలు తీసేందుకు ఉపయోగిస్తారు. అతినీలలోహిత కాంతి మాధ్యమం ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. అలాగే ఈ ప్రాంతంలో సూర్యుడి ఇర్రేడియన్స్‌ (నిర్దిష్ట ప్రాంతంలో పడే రేడియోధార్మిక శక్తి మొతాదు)ను కూడా కొలుస్తారు. ఇస్రో సహకారంతో పుణేలోని ఇంటర్‌ యూనివర్శిటీ సెంటర్‌ ఫర్‌ అస్ట్రానమీ అండ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌ ఈ పరికరాన్ని రూపొందించింది.

సోలార్‌లో ఎనర్జీ ఎక్స్‌-రే స్పెక్ట్రోమీటర్‌ (సోలెక్స్‌), హై ఎనర్జీ ఎల్‌-1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌-రే స్పెక్ట్రోమీటర్‌ (హీలియోస్‌) సూర్యుడి నుంచి వెలువడే ఎక్స్‌-రే కిరణాల పరిశీలనకు ఈ రెండు పరికరాలను ఉపయోగిస్తారు. అయితే సోలెక్స్‌ అనేది కరోనా నుంచి వెలువడే ఎక్స్‌-రే కిరణాల్లో తక్కువ శక్తి కలిగిన వాటి ధర్మాలు, మార్పులను అధ్యయనం చేస్తే హీలియోస్‌ ఎక్కువ శక్తిగల వాటిపై దృష్టి సారిస్తుంది. ఈ రెండు పరికరాలను బెంగళూరులోని యు.ఆర్‌.రావు శాటిలైట్‌ సెంటర్‌ అభివృద్ధి చేసింది.

ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (ఎస్‌పెక్స్‌): పేరులో ఉన్నట్లే ఇది సౌరగాలుల్లోని కణాలపై ప్రయోగాలు చేస్తుంది. ఈ కణాల వేగం, సాంద్రత, ఉష్ణోగ్రతలు మొదలైనవాటిని గుర్తిస్తుంది. తద్వారా ఈ గాలులు ఎక్కడ పుడుతున్నాయి? ఎలా వేగం పుంజుకుంటున్నాయన్న విషయాలు తెలుస్తాయి. అహ్మదాబాద్‌లోని ఫిజికల్‌ రీసెర్చ్‌ లాబొరేటరీ దీన్ని అభివృద్ధి చేసింది.
ఇది కూడా చదవండి: అమెరికాలో దోపిడీకి గురైన భారత సంతతి జంట

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement