reach
-
ఇసుక రీచ్‌లూ కొల్లగొట్టేశారు
సాక్షి, అమరావతి: మద్యం మాఫియాతో రూ.కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధమైన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఇసుక దోపిడీకి రాచమార్గం నిరి్మంచుకుంది. రాష్ట్రంలోని ఇసుక రీచ్‌లన్నీ తమ వారికే దక్కేలా చేసుకుని వాటిపై గుత్తాధిపత్యం సాధించింది. 108 మాన్యువల్ ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలకు ఏర్పాట్లుచేసుకుని ఇప్పటికే 80కి పైగా రీచ్‌లకు షార్ట్ టెండర్లు పిలిచారు. జిల్లా ఇసుక కమిటీల ద్వారా వాటిని హస్తగతం చేసుకున్నారు. వాటిలో బుధవారం సుమారు 30 వరకు రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు ప్రారంభించారు.అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు చెప్పిన వారికే అన్నిచోట్లా జిల్లా ఇసుక కమిటీలు రీచ్‌లు కట్టబెట్టాయి. ఒక పథకం ప్రకారం దసరా పండుగ ముందు ఎటువంటి హడావుడి లేకుండా ఈ రీచ్‌లకు షార్ట్ టెండర్లు పిలిచారు. దానికిముందే వాటి వివరాలను స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇవ్వడంతో వారు ఏ రీచ్‌కి ఎవరు టెండర్లు వేయాలి, ఎంతకి వేయాలో నిర్ణయించారు. వారు సిద్ధమైన తర్వాత జిల్లా కలెక్టర్లు వెంటనే టెండర్లు పిలిచి దాఖలు చేయడానికి రెండే రెండ్రోజుల సమయం ఇచ్చారు. ఈ సమాచారం తెలియక చాలామంది టెండర్లు దాఖలు చేయలేకపోయారు. ఆఖరి నిమిషంలో తెలుసుకుని ఎవరైనా టెండర్ వేయడానికి వస్తే వారికి టెండర్ డాక్యుమెంట్ ఇవ్వడానికి నానా ఇబ్బంది పెట్టారు.రోజంతా కూర్చోబెట్టి ఎందుకు టెండర్ దాఖలు చేయాలనుకుంటున్నారు? ఎవరి కోసం వేస్తున్నారు? తవ్వకాలకు కావల్సిన సరంజామా మొత్తం ఉన్నాయా అంటూ తెగ విసిగించారు. వేచి ఉన్న వారికి చివర్లో ఏదో ఒక సాకు చెప్పి పంపించేశారు. అన్నీ తట్టుకుని నిలబడిన కొద్దిమంది టెండర్లు దాఖలు చేసినా వారిని అధికారులే బెదిరింపులకు గురిచేసినట్లు తెలిసింది. ఇక అధికార పార్టీ వాళ్లను కాదని మీరెలా టెండర్లు వేస్తారు? వేసినా ఉపయోగం ఉండదని చెప్పడంతో కొందరు వెనక్కి తగ్గినట్లు సమాచారం. టెండర్లు వేసిన వారికీ నిబంధనల ప్రకారం ఏ విషయం చెప్పకుండా పంపించేశారు. చివరికి.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన వారికే ఇసుక కాంట్రాక్టులన్నింటినీ కట్టబెట్టేశారు. వారి ద్వారా ముఖ్యనేతకు ముడుపులు అందేలా పక్కా ప్రణాళిక రూపొందించారు. ఈ నెలాఖరులోపు మిగిలిన రీచ్‌లకు టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి వాటిని సొంతం చేసుకునేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఎమ్మెల్యేలు చెప్పినట్లే చేసిన ఇసుక కమిటీలు.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన వారికే జిల్లా స్థాయి ఇసుక కమిటీలు రీచ్‌లను కట్టబెట్టాయి. అత్యధికంగా 17 రీచ్‌లు ఉన్న తూర్పుగోదావరి జిల్లాల్లో ఎమ్మెల్యేలు బయట వ్యక్తులను కనీసం టెండర్లు వేయడానికి సైతం అనుమతివ్వలేదు. వారికి టెండర్ డాక్యుమెంట్లు ఇవ్వడానికి అధికారులు భయపడ్డారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు. ⇒ కడియపులంక రీచ్‌ను రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తన బినామీకి ఇప్పించినట్లు సమాచారం. ⇒ రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో మూడు రీచ్‌లు ఉండగా ఒకదాన్ని అక్కడి ఎమ్మెల్యే బత్తుల బలరామయ్య చేజిక్కించుకున్నట్లు తెలిసింది. మరో మూడు రీచ్‌లను ఆయనతోపాటు బుచ్చయ్యచౌదరి చెప్పిన వారికి కేటాయించినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. ⇒ నిడదవోలు నియోజకవర్గంలోని ముక్కామల, కాకరపర్రు, మల్లేశ్వరం, తీపర్రు 2, 3, మందలపర్రు, జీడిగుంట రీచ్‌లుండగా వాటిని జనసేన, టీడీపీ నేతలు కలిసి పంచుకుని అందుకనుగుణంగా టెండర్లు దాఖలు చేయించి దక్కించుకున్నారు. ⇒ మంత్రి కందుల దుర్గేష్ రెండు రీచ్‌లను తన వారికి ఇప్పించుకోగా మిగిలిన వాటిని టీడీపీ నేతలు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మిగిలిన వాటిల్లో టీడీపీ నేతలు చెప్పినట్లే జరిగింది. దీంతో స్థానిక జనసేన నాయకులు టీడీపీ వాళ్లతో వాగ్వాదానికి దిగినా ప్రయోజనం కనిపించలేదని చెబుతున్నారు. ⇒ కొవ్వూరు నియోజకవర్గంలోని కుమారదేవం–1, 2, 3, చిడిపి, వేగేశ్వరపురం ఇసుక రీచ్‌లను స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఇతర నేతలతో కలిసి సిండికేట్‌గా ఏర్పడి తమ వారికి ఇప్పించినట్లు సమాచారం. ⇒ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఆరు రీచ్‌లకు టెండర్లు పిలవగా ఒకటి ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పిన వారికి దక్కేలా చేశారు. మిగిలినవన్నీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య తన మనుషులకు కేటాయించేలా చేసుకున్నారు. ⇒ నందిగామ నియోజకవర్గంలో తొమ్మిది రీచ్‌లకు రెండు మినహా మిగిలినవన్నీ స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సూచించిన వారికి కేటాయించారు. ⇒ అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని శ్రీకాకుళం 3, 5 రీచ్‌లకు టెండర్లు పిలవగా రెండింటినీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ బినామీ పేర్లతో సొంతం చేసుకున్నట్లు తెలిసింది. ఒక రీచ్‌ను తన సొంత బంధువుకి, మరో రీచ్‌ను తన అనుంగు అనుచరుడికి కట్టబెట్టినట్లు సమాచారం. బయట వ్యక్తులెవరూ టెండర్లలో పాల్గొనకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవడంతో ఖరారైన రీచ్‌లన్నీ టీడీపీ వారి పరమయ్యాయి. పామర్రులో టీడీపీ నేతలకు ఎమ్మెల్యే వార్నింగ్..ఇక కృష్ణాజిల్లా పామర్రులో ఐదు రీచ్‌లు ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా చెప్పిన వారికే ఖరారు చేశారు. టెండర్లు దాఖలు చేయడానికి వెళ్లిన టీడీపీ నేతలను ఎమ్మెల్యే ఫోన్‌చేసి తిట్టిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తోట్లవల్లూరు ఇసుక రీచ్ కోసం మొవ్వ మండల నేత కాకర్ల బెనర్జీ తదితరులు వెళ్లగా ఆ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆయనకు ఫోన్‌చేసి వార్నింగ్ ఇచ్చారు. టెండర్ వెయ్యొద్దని, తనకు తెలీకుండా ఎలా టెండర్ దాఖలు చేస్తారని ఎమ్మెల్యే బెనర్జీకి వార్నింగ్ ఇస్తున్న వీడియోను కొందరు టీడీపీ నేతలే రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టారు. తాను ఎంతోకాలం నుంచి పార్టీలో ఉన్నానని, ఎప్పుడూ ఇలాంటివి చూడలేదని బెనర్జీ చెబుతుంటే ఎమ్మెల్యే ఆయన్ను గట్టిగా హెచ్చరించారు. మొత్తం మీద ఇసుక రీచ్‌లకు తన సొంత మనుషులతో టెండర్లు వేయించిన ఎమ్మెల్యే.. సొంత పార్టీ వారితో సహా ఇతరులెవరూ టెండర్లు వేయకూడదని హకుం జారీచేశారు. చివరికి ఆయన చెప్పిన వారికే టెండర్లు ఖరారయ్యాయి. -
6000 కి.మీ ఎగురుతూ ఛత్తీస్‌గఢ్‌కు అరుదైన పక్షి!
పక్షి ప్రేమికులు సంబరపడే వార్త ఇది. కెనడా, అమెరికాలకు ఆనుకుని ఉన్న మధ్యధరా సముద్ర ప్రాంతాల్లో కనిపించే వింబ్రెల్ పక్షి తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాఘర్ జిల్లాకు తరలివచ్చింది. ఇది దాదాపు ఆరు వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వచ్చింది.ఈ పక్షి మొదటిసారిగా ఈ ప్రాంతంలో కనిపించింది. దీనిని చూసేందుకు అటవీశాఖ సిబ్బందితో పాటు సామాన్యులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. వింబ్రల్ పక్షి ఖైరాఘర్ జిల్లా మొహభట్టా గ్రామానికి తరలివచ్చింది. దాని శరీరంపై రేడియో కాలర్ అమర్చారు. ఈ కాలర్ అంచనా ధర రూ.10 లక్షలని తెలుస్తోంది. ఆ పక్షి వెనుక భాగంలో సోలార్ జీపీఎస్ కాలర్ కూడా ఉంది. దీని ద్వారా అది ఎంత దూరం ఎగురుతూ ఇక్కడకు చేరిందో తెలుస్తుంది.ఈ కాలర్‌ను ఆ పక్షికి 2023 నవంబర్ 16న ఒక ద్వీపంలో అమర్చారు. ఆ పక్షి దాదాపు 6 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని దీని ద్వారా తెలుస్తోంది. ఆ పక్షి పాకిస్తాన్ మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్కు చేరుకుంది. దీవి నుంచి బయలుదేరిన ఆ పక్షి అరేబియా సముద్రానికి చేరుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్‌కు చేరుకుని, అక్కడ నాలుగు రోజుల పాటు మకాం వేసింది.ఈ పక్షి భారత తీరంలో 10 రోజులు ఉండి, తరువాత ఖైరాఘర్ జిల్లాలోని మొహభట్టా గ్రామానికి చేరుకుంది. ఇక్కడ ఈ పక్షి నీటిలో ఉల్లాసంగా తిరుగుతూ కనిపిస్తోంది. గత మూడు రోజులుగా ఈ పక్షి ఇక్కడే ఉంటోంది. ఈ పక్షి రెండు కాళ్లపై ఆకుపచ్చ, పసుపు రంగుల జెండాలు ఉన్నాయి. యూరప్‌లోని ఒక సంస్థ ఈ పక్షిని పర్యవేక్షిస్తున్నదని సమాచారం. వింబ్రల్ పక్షి రాకపై తమకు సమాచారం అందిందని ఖైరాగఢ్ డీఎఫ్ఓ అమిత్ తివారీ తెలిపారు. సాధారణంగా ఈ పక్షి మధ్యధరా సముద్ర తీరంలో నివసిస్తుంది. ఇది సంతానోత్పత్తి కోసం వివిధ ప్రదేశాలను వెతుకుతూ ఉంటుంది. -
అయోధ్యకు చేరువలో పాదయాత్రికురాలు షబ్నం!
మతపరమైన ఆంక్షలన్నింటినీ దాటుకుని ముంబై నుంచి శ్రీరాముని దర్శనానికి కాలినడకన బయలుదేరిన షబ్నం ఇప్పుడు అయోధ్యకు కొన్ని అడుగుల దూరంలో ఉన్నారు. ఆమె హలియాపూర్‌లోని అయోధ్య సరిహద్దుకు చేరుకున్నారు. అక్కడ ఆమె మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఇది తన కల నిజమవుతున్న తరుణమని అన్నారు. కొద్దిసేపటిలో రామ్‌లల్లా దర్శనం చేసుకోబోతున్నానన్నారు. షబ్నం షేక్‌కు హాలియాపూర్‌లో స్థానికుల నుంచి ఘనస్వాగతం లభించింది. ముంబైలో ఉంటున్న షబ్నమ్ షేక్ (23) బీకామ్ విద్యార్థిని. రామునిపై ఆమెకు ఉన్న భక్తిప్రపత్తులను ఆమె సోషల్ మీడియాలో వెల్లడిస్తుంటారు. 38 రోజుల క్రితం ఆమె తన ముగ్గురు హిందూ స్నేహితులైన రమణ్ రాజ్ శర్మ, వినీత్ పాండే, శుభమ్ గుప్తాలతో కలిసి అయోధ్యకు కాలినడకన బయలుదేరారు. శనివారం సాయంత్రం హాలియాపూర్‌లోని ఎక్స్‌ప్రెస్‌వే దగ్గర స్థానికులు వారికి స్వాగతం పలికారు. జైశ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. ప్రతాప్ ధాబా నిర్వాహకుడు హరి ప్రతాప్ సింగ్, అతని భార్య ప్రీతి సింగ్ షబ్నం బృందానికి స్వాగతం పలికారు. రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకోవాలని వారు కోరారు. షబ్నం వారి అభ్యర్థనను అంగీకరించారు. ఈ సందర్భంగా షబ్నం మాట్లాడుతూ తాను చిన్నప్పటి నుంచి శ్రీరామ భక్తురాలినని, అయోధ్యకు సమీపానికి చేరుకోవడంతో ఎంతో ఆనందంగా ఉందన్నారు. తాను రెండు రోజుల పాటు అయోధ్యలో ఉండి, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలుసుకుని, ఆ తర్వాత తిరిగి ముంబైకి చేరుకుంటానన్నారు. -
‘ఆదిత్య ఎల్-1’ ఎక్కడివరకూ వచ్చింది? ఏ పరికరాలు ఏం చేస్తున్నాయి?
చంద్రయాన్ 3 విజయంతో భారత ఇస్రో ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. చంద్రునిపై కాలిడిన దేశాల సరసన భారత్ చేరింది. ఈ విజయానంతరం కొద్దిరోజుల వ్యవధిలోనే ఇస్రో మరో ఘనమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. 2023 సెప్టెంబర్ 2వ తేదీన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సూర్యుని కక్ష్యలోకి ఆదిత్య ఎల్- 1 మిషన్ ప్రయోగించింది. ఈ అంతరిక్ష నౌక భూమి నుంచి అంతరిక్షంలో 125 రోజుల పాటు ఒక మిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణం సాగించిన తరువాత సూర్యునికి అత్యంత సమీపంలోని లాగ్రేంజియన్ పాయింట్లో ప్రవేశిస్తుంది. కాగా ఈ మిషన్ తాజా అప్డేట్స్ వివరాలను ఇస్రో ఛైర్మన్ సోమనాధ్ మీడియాకు వెల్లడించారు. 2024 జనవరి 6వ తేదీనాటికి ఆదిత్య ఎల్- 1 మిషన్ నిర్దేశిత, తుది లక్ష్యానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు ఇస్రో ఛైర్మనన్ సోమనాధ్ పేర్కొన్నారు. సూర్యుని అధ్యయనం చేసేందుకు భారత్ ప్రయోగించిన తొలి మిషన్ ఆదిత్య ఎల్- 1. జనవరి 7, 2024 నాటికి ఈ మిషన్ ప్రక్రియ పూర్తి కానుంది. సూర్యుని కక్ష్యలో చేరిన తరువాత నిర్దేశించిన కార్యకపాలు నెరవేరుస్తూ, శాస్త్రీయ ప్రయోగాలకు అవసరమయ్యేలా మిషన్ ఆదిత్య ఎల్- 1 సూర్యుని చిత్రాలను తీసి పంపిస్తుంది. సౌర కుటుంబం అంతటికీ తన వెలుగుల ద్వారా శక్తిని అందించే సూర్యునిపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వదిలిన బాణం ఆదిత్య-ఎల్1 లక్ష్యం వైపు దూసుకెళుతోంది. ఇది తన నాలుగు నెలల ప్రయాణంలో 15 లక్షల కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి ఈ అబ్జర్వేటరీ (వేధశాల) భూమితోపాటు సూర్యుని ఆకర్షణ శక్తి లేని లగ్రాంజ్ పాయింట్ వద్దకు చేరుకోనుంది. ఇంతకీ ఆదిత్య-ఎల్-1లో ఏఏ పరికరాలున్నాయి? వాటితో సాగించే ప్రయోగాలేమిటి? దీనితో మనకొచ్చే ప్రయోజనాలేమిటి? ఆదిత్య-ఎల్-1లో మొత్తం ఏడు శాస్త్రీయ పరికరాలు ఉన్నాయి. వీటిలో నాలుగు సూర్యుడిని పరిశీలించేందుకు ఉపయోగపడుతుండగా, మిగిలిన మూడు లగ్రాంజ్ పాయింట్ దగ్గరే వేర్వేరు ప్రయోగాలు చేయనున్నాయి. ఒక్కో పరికరం చేసే పనేమిటో, దాని ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రఫ్ (వీఈఎల్సీ): సూర్యుడు నిజానికి ఓ మహా వాయుగోళం. హైడ్రోజన్ అణువులు ఒకదానిలో మరొకటి కలిసిపోతూ (కేంద్రక సంలీన ప్రక్రియ) అపారమైన శక్తిని విడుదల చేస్తూండే ప్రాంతమే సూర్యుడు. కంటికి కనిపించే సూర్యుడి భాగాన్ని ఫొటోస్ఫియర్ అని అంటారు. దీని దిగువన ఉన్న మరో పొరను క్రోమోస్ఫియర్ అని, దాని దిగువన ఉన్న ఇంకో పొరను కరోనా అని పిలుస్తారు. వీఈఎల్సీ అనేది ఈ కరోనా పొరకు సంబంధించిన ఛాయాచిత్రాలను తీస్తుంది. దీనికితోడు వేర్వేరు కాంతుల్లో (పరారుణ, అతినీలలోహిత, ఎక్స్-రే) కరోనాను పరిశీలిస్తుంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, ఇస్రోలు కలిసి రూపొందించిన ఈ పరికరం కరోనా నుంచి వెలువడే శక్తిమంతమైన కణాల ప్రవాహాన్ని (కరోనల్ మాస్ ఎజెక్షన్)కూడా గుర్తిస్తుంది. ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్ల కారణంగా వెలువడే శక్తిమంతమైన ఫొటాన్లు భూ వాతావరణం, వానల తీరుతెన్నులపై ప్రభావం చూపగలవని అంచనా. సోలార్ అల్ట్రావయలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్(ఎస్‌యూఐటీ): వీఈఎల్సీ కరోనా అధ్యయనానికి ఉపయోగిస్తూంటే ఈ ఎస్యూఐటీని ఫొటో స్ఫియర్, క్రోమోస్ఫియర్ల ఛాయాచిత్రాలు తీసేందుకు ఉపయోగిస్తారు. అతినీలలోహిత కాంతి మాధ్యమం ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. అలాగే ఈ ప్రాంతంలో సూర్యుడి ఇర్రేడియన్స్ (నిర్దిష్ట ప్రాంతంలో పడే రేడియోధార్మిక శక్తి మొతాదు)ను కూడా కొలుస్తారు. ఇస్రో సహకారంతో పుణేలోని ఇంటర్ యూనివర్శిటీ సెంటర్ ఫర్ అస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ఈ పరికరాన్ని రూపొందించింది. సోలార్‌లో ఎనర్జీ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (సోలెక్స్), హై ఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (హీలియోస్) సూర్యుడి నుంచి వెలువడే ఎక్స్-రే కిరణాల పరిశీలనకు ఈ రెండు పరికరాలను ఉపయోగిస్తారు. అయితే సోలెక్స్ అనేది కరోనా నుంచి వెలువడే ఎక్స్-రే కిరణాల్లో తక్కువ శక్తి కలిగిన వాటి ధర్మాలు, మార్పులను అధ్యయనం చేస్తే హీలియోస్ ఎక్కువ శక్తిగల వాటిపై దృష్టి సారిస్తుంది. ఈ రెండు పరికరాలను బెంగళూరులోని యు.ఆర్.రావు శాటిలైట్ సెంటర్ అభివృద్ధి చేసింది. ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ (ఎస్పెక్స్): పేరులో ఉన్నట్లే ఇది సౌరగాలుల్లోని కణాలపై ప్రయోగాలు చేస్తుంది. ఈ కణాల వేగం, సాంద్రత, ఉష్ణోగ్రతలు మొదలైనవాటిని గుర్తిస్తుంది. తద్వారా ఈ గాలులు ఎక్కడ పుడుతున్నాయి? ఎలా వేగం పుంజుకుంటున్నాయన్న విషయాలు తెలుస్తాయి. అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ దీన్ని అభివృద్ధి చేసింది. ఇది కూడా చదవండి: అమెరికాలో దోపిడీకి గురైన భారత సంతతి జంట -
విశాఖ చేరుకున్న టీమిండియా, ఆసీస్ క్రికెటర్లు (ఫొటోలు)
-
కాసేపట్లో నరసాపురం చేరుకోనున్న సీఎం వైఎస్ జగన్
-
ఇప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నా.. వచ్చేస్తున్నా..నాన్నా..
భోగాపురం రూరల్(విజయనగరం): నాన్నా... ఉక్రెయిన్ నుంచి బయలుదేరి లివీవ్ అనే స్టాప్‌లో ట్రైన్లోంచి ఇప్పుడే దిగాను. ఇక్కడ నుంచి బోర్డర్‌కి బస్ లేదా ట్రైన్‌గాని ఎక్కాలంట.. ఇక్కడ తినడానికి ఫుడ్ ఇస్తున్నారు.. లైన్లో ఉన్నా కంగారుపడవద్దు నాన్నా అని కుమార్తె మైలపల్లి యమున తన తండ్రి ఎల్లాజీకి ఫోన్ ద్వారా బుధవారం సాయంత్రం 5 గంటలకు తెలిపింది. ఈ సమాచారంతో నాలుగు రోజులుగా ఆందోళనతో ఉన్న యమున తల్లిదండ్రులు ఎల్లాజీ, పైడితల్లి హృదయాల్లో ఆనందం వెల్లివిరిసింది. వెంటనే ఇంట్లో నుంచి బయటకు వచ్చి వీధిలో ఉన్న వారందరికీ విషయాన్ని సంతోషంగా తెలియజేశారు. దీంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. యుద్ధ వాతావరణంలో తమ కుమార్తె ఉండడంతో ఇంటికి క్షేమంగా తిరిగి వస్తుందా? లేక వినకూడని వార్త ఏదైనా వింటామా? అని ఆందోళనతో ఉన్న తల్లిదండ్రులు ఈ సమాచారంతో ఒక్కసారిగా ఉబ్బితబ్బిబ్బయ్యారు. వెంటనే తమ ఇలవేల్పుకు నమస్కారాలు చేసుకుని దీపాలు వెలిగించుకున్నారు. తిరిగి కుమార్తెను ఫొన్లో వివరాలు అడిగారు. అక్కడ బస్ ఎక్కితే ఎన్ని గంటలు జర్నీ ఉంటుంది అని తండ్రి అడిగాడు. బస్ ఎక్కిన తరువాత 5 లేదా 6 గంటలు పడుతుంది నాన్నా.. అని సమాధానం ఇచ్చింది కుమార్తె. ఇంకా ట్రైన్ ఎక్కి బోర్డర్‌కి వెళ్లలేదు నాన్నా, మధ్యలో ఉన్నాం, బోర్డర్‌కి వెళ్లిన తరువాత ఫ్లైట్ ఏ రోజు అని చెబుతారు.. వెంటనే ఫ్లైట్ ఎక్కించే పరిస్థితి ఉండదు. కొన్ని రోజులు అక్కడ ఉంచి, వీసా ఇచ్చిన తరువాత ఫ్లైట్ ఎప్పుడని చెప్తారు నాన్నా. నీకు ఎçప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడాతా.. అమ్మకు చెప్పు భయపడొద్దని అని ఫోన్ కట్ చేసింది. -
పత్తికొండలో కొనసాగుతున్న వైఎస్ జగన్ పాదయాత్ర
-
గోనెగండ్లకు చేరుకున్న వైఎస్ జగన్ పాదయాత్ర
-
కొత్త ఇసుక రీచ్‌లు గుర్తించండి
– జిల్లా కలెక్టర్ కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో ఇసుక తవ్వకాలకు కొత్త రీచ్‌లను గుర్తించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం జిల్లా ఇసుక కమిటీ సమావేశాన్ని తన చాంబరులో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... గనుల శాఖ, భూగర్భ జల శాఖ, ఇరిగేషన్ అధికారులు కమిటీగా ఏర్పడి తుంగభద్ర, హంద్రీ ఇతర ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలకు కొత్త రీచ్‌లను గుర్తించాలని తెలిపారు. కొత్త రీచ్‌ల గుర్తింపు ప్రతిపాదనలను 15 రోజుల్లో ఇవ్వాలని కమిటీ సభ్యులను ఆదేశించారు. హంద్రీ నదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలను 100 శాతం అదుపు చేయాలని తెలిపారు. అక్రమంగా ఇసుకను తరలించే వారు ఏ స్థాయి వారైన కఠిన చర్యలు తీసుకోవాలని వివరించారు. ఏడు మండలాల్లోని హంద్రీ తీర గ్రామలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు హంద్రీలో నిరంతరం గస్తీ తిరుగుతూ... ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టాలని తెలిపారు. హంద్రీ వెంట అడ్డుగోలుగా వేసిన బోర్లను గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జేసీ హరికిరణ్, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, గనులశాఖ ఏడీ వెంకటరెడ్డి, కర్నూలు ఆర్డీఓ హుసేన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. -
అప్పుల్లేవ్.. తిప్పలే
ఏలూరు (మెట్రో) : కొత్త రుణాలు అందక.. పాత రుణాలు చెల్లించలేక డ్వాక్రా సంఘాల నిర్వహణ గాడి తప్పుతోంది. పకడ్బందీగా నడిచే వ్యవస్థ క్రమంగా బీటలువారుతోంది. సంఘాల పటిష్టత కోసం ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సమావేశాలు, అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన సిబ్బంది మొక్కుబడి తంతుగా ముగిస్తున్నారు. మరోవైపు రుణాలు అందక మహిళలు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 65 వేల మహిళా సంఘాలు ఉండగా.. దాదాపు సగం సంఘాలకు ఇప్పటికీ రుణాలు ఇవ్వలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని సంఘాలకు రూ.1,200 కోట్లను రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా.. రూ.660 కోట్లు మాత్రమే ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి. 2015–16 ఆర్థిక సంత్సరంలో రూ.వెయ్యి కోట్లను రుణాలివ్వాలని నిర్ణయించగా.. ప్రభుత్వం రూ.500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితి ఎదురుకావడంతో మహిళా సంఘాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. లక్ష్యం మేరకు రుణాలిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ ప్రçస్తుత ఆర్థిక సంవత్సరం నెలన్నర రోజుల్లో ముగిసిపోనుంది. ఈలోగా రూ.540 కోట్లను రుణాలుగా ఇచ్చే అవకాశం ఉండదని పలువురు పేర్కొంటున్నారు. మొండి బకాయిలను తగ్గించామని అధికారులు పేర్కొంటున్నా.. ఇంకా వసూలు కావా ల్సిన మొత్తం రూ.40 కోట్ల వరకు ఉంది. చర్యలు చేపడతాం జిల్లాలోని మహిళా సంఘాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.660 కోట్లను బ్యాంకుల ద్వారా రుణాలు అందించాం. మొండి బకాయిల వసూళ్లకు చర్యలు తీసుకున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి లక్ష్యాన్ని చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. – కె.శ్రీనివాసులు, డిఆర్డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ -
రాజమండ్రి చేరుకున్న వైఎస్ జగన్.
-
గ్రామీణ ప్రాంతాలకు ఐసీఐసీఐ బ్యాంక్ సేవలు
-
జై ఆంధ్రప్రదేశ్ సభకు చేరుకున్న వైఎస్ జగన్
-
ఇసుక రీచ్‌లో ఆధిపత్య పోరు
* 500 మీటర్లకు 500 నిబంధనలు * ఒకరికి న్యాయం, మరొకరికి అన్యాయం * భారీగా నిలిచిపోయిన ఇసుక లారీలు వెంకటపాలెం (తాడేపల్లి రూరల్): ఇసుక రీచ్‌లో అధికార పార్టీ నేతలు ఆధిపత్యం సంపాదించుకునేందుకు ఇసుక లారీ ఓనర్లను, డ్రైవర్లను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పెనుమాక, వెంకటపాలెంలో ఇసుక రీచ్ నుంచి తాడేపల్లి, మంగళగిరి, విజయవాడ ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నారు. మంగళవారం నుంచి వెంకటపాలెం ఇసుక రీచ్ ప్రారంభం కావడంతో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరులు తమ లారీలే రోడ్డు మీద నడవాలంటూ పోలీసు బాస్‌లతో చర్చించి, వెంకటపాలెం నుంచి లోడు అయి వచ్చే లారీలను నిలిపివేశారు. పెనుమాక ఇసుక రీచ్‌కు, వెంకటపాలెం ఇసుక రీచ్‌కు ఒకటే రూటు. ఎక్కడ లోడైనా అదే రోడ్డులోకి రావాల్సిందే. కాకపోతే వెంకటపాలెం ఇసుక రీచ్ నుంచి వచ్చే లారీలు 500 మీటర్ల రహదారి ఎక్కువగా ఉంటుంది. ఈ 500 మీటర్లకు 500 ఆంక్షలు విధించి, ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు లారీలను నిలిపివేశారు. లారీ యజమానులు జరుగుతున్న ఈ సంఘటనపై పోలీసులను ప్రశ్నించడంతో ఈ 500 మీటర్లు సీఎం రహదారి, మీరెలా వెళతారంటూ ప్రశ్నిస్తున్నారని లారీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి సీఎం ఇంటి మీదుగానే పెనుమాక ఇసుక రీచ్ నుంచి ట్రాక్టర్లు, లారీలు తిరుగుతున్నాయని ప్రశ్నించగా, అది అర్బన్æ పరిధి, ఇది రూరల్∙పరిధి, ఎక్కువగా మాట్లాడుతున్నారేంటి? అని దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. కనీసం ట్రాక్టర్‌పై భోజనానికి కూడా వెళ్లనీయకుండా తమను ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. వెంకటపాలెం మెయిన్ రోడ్డు నుంచి ప్రతి లారీ రాజధాని రూటులో ప్రయాణించాల్సిందే. మరి అక్కడ లేని ఆంక్షలు ఇక్కడే ఎందుకు విధిస్తున్నారని లారీ డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులే పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని లారీ డ్రైవర్లు వ్యాఖ్యానిస్తున్నారు. తుళ్లూరు ఎస్ఐ మహ్మద్ షఫీ వివరణ .. వెంకటపాలెం నుంచి వచ్చే ఇసుక లారీలను ఆపిన మాట వాస్తవమేనని, సచివాలయానికి ఉద్యోగస్తుల తాకిడి పెరగడంతో ట్రాఫిక్ నిలిచిపోతుందని లారీలు ఆపినట్టు తెలిపారు. పెనుమాక ఇసుక రీచ్ నుంచి వచ్చే లారీలను ఎందుకు ఆపలేదని ప్రశ్నించగా, అది అర్బన్ పరిధి అని, తమది కాదని అన్నారు. వెంకటపాలెంలో 500 మీటర్లే మీ పరిధిలో ఉంది, మిగతాది అంతా అర్భన్ పరిధిలో ఉంది కదా అని ప్రశ్నిస్తే, మా ఎస్పీ గారు ఆపమన్నారు, మేము ఆపాము, మీ పరిధికాదు కదా అని అన్నారు. -
హైదరాబాద్‌కు చేరుకున్న మౌంటెనీర్ జాహ్నవి
-
గచ్చిబౌలి స్టేడియం చేరుకున్న సింధు
-
సెమీస్‌లో సానియా-బోపన్న జంట
-
రాగులపాడు లిఫ్ట్‌కు చేరుకున్న కృష్ణా జలాలు
వజ్రకరూరు : రాగులపాడు గ్రామ సమీపంలోని హంద్రీనీవా సుజల స్రవంతి పథకంలోని లిఫ్ట్‌కు బుధవారం ఉదయం 8 గంటలకు కృష్ణా జలాలు చేరుకున్నాయి. అధికారులు మూడు పంప్‌ల ద్వారా నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. ఒక్కొక్క పంపు నుంచి 350 క్యూసెక్కుల మేర నీరు వెళుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈఈ రాజశేఖర్, డీఈ రామచంద్ర, జేఈ వాసుదేవ,ఏఈ ఎర్రిస్వామి తదితరులు నీటి పంపింగ్‌ను పరిశీలించారు. -
ప్రజలకు దర్శనమివ్వని సీఎం కేసీఆర్
ఏ ముఖ్యమంత్రి ఇలా చేయలేదు పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నారు మంత్రుల, ఎమ్మెల్యే జీతాలు పెంచుకున్నారు ప్రజాధనం తింటే నేతలకు అరగదు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా సిరిసిల్ల: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సందర్శనకు, దర్శనం ఇవ్వడంలేదని గతంలో సీఎంలు వైఎస్సార్, రోషయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు నిత్యం ప్రజలను కలిసేందుకు సమయమిచ్చేవారిని, ప్రజల బాధలు తెలుసుకునేవారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా అన్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో సీఐటీయూ జిల్లా 7వ మహాసభల్లో ఆదివారం ఆయన పాల్గొని ప్రసంగించారు. సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్రమోడీని కలిసి కేంద్రం చేసే చట్టాల విషయంలో రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలని కోరారని సాయిబాబా వివరించారు. మరి రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న నూతన పరిశ్రమల విధానంలో కార్మిక సంఘాల అభిప్రాయాలను ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. భూసేకరణ చట్టం పార్లమెంట్లో ఆమోదించినపుడు ఎంపీగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు నిర్వాసితులకు ఆ చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదని సాయిబాబా అన్నారు. గతంలో సీఎంలాగే కేసీఆర్ సైతం పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నారని, కార్మికులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్మికులకు కనీస వేతనం రూ.15వేలు ఇవ్వాలని సీఐటీయూ కోరుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలను భారీగా పెంచుకున్నారని ఆరోపించారు. ప్రజాధనం తింటే అరగదని, కార్మికుల పొట్టలు నింపాలని సాయిబాబా కోరారు. సిరిసిల్లలో కార్మికులు 12 గంటలు మరమగ్గాల్లో పని చేస్తున్నారని ఇది ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. 8 గంటల కంటే ఎక్కువ పని చేస్తే.. ఓటీ ఇవ్వాలనే నిబంధనలు యజమానులు పట్టించుకోవడం లేదన్నారు. పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లలో కార్మిక చట్టాలు అమలు కావడం లేదని సాయిబాబా ఆరోపించారు. అమెరికా, దుబాయ్ వెళ్లివచ్చిన కేటీఆర్ అక్కడ కార్మికుల కనీస వేతనాలు ఎంతో గమనించలేదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం రెండేళ్లలో కార్మికులకు చేసిందేమీ లేదని, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయలేదని, కనీస వేతనాలు పెంచలేదని సాయిబాబా ఆరోపించారు. కార్మికుల సంక్షేమం విషయంలో సోయి తెచ్చుకుని పని చేయాలని ఆయన కోరారు. -
విద్యార్థులకు 'నది' కష్టాలు!
చెన్నైః ప్రతిరోజూ పాఠశాలకు వెళ్ళాలంటే అక్కడి విద్యార్థులకు నది కష్టాలు తప్పడంలేదు. ఎప్పుడూ మోకాల్లోతు దాటి ఉండే నీళ్ళలో బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తోంది. ఒక్కోసారి నీటి ఉధృతి పెరిగితే నడుములు దాటి కూడా నీరు ప్రవహిస్తుంటుంది. అటువంటి ప్రమాద పరిస్థితుల్లో నీటిలో నడుస్తూ స్కూలుకు వెళ్ళాల్సిన పరిస్థితి తమిళనాడు విద్యార్థులకు దినదినగండంగా మారుతోంది. ఇక వర్షాకాలంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంటుంది. ఉధృతంగా ప్రవహించే నీటి ప్రవాహాన్ని దాటి నదికి ఆవలివైపున ఉన్న స్కూలును చేరుకోవడం ప్రాణాలతో చెలగాటమే. ఏళ్ళతరబడి బ్రిడ్జి నిర్మాణంకోసం ఆ ప్రాంత వాసులు అర్జీలు పెట్టినా పట్టించుకునేవారే కరువయ్యారు. తమిళనాడు క్రిషగిరి జిల్లా బోడూరు గ్రామ ప్రాంతంలోని విద్యార్థులు స్కూలుకు వెళ్ళాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నదిని దాటేందుకు బ్రిడ్జి లేక, మోకాల్లోతు నీటిలోనే నడుచుకుంటూ వెడుతున్నారు. ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితుల్లో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని కాలం వెళ్ళదీస్తున్నారు. బోడూరు చుట్టుపక్కల గ్రామాలనుంచి ప్రతిరోజూ సుమారు 100 మంది విద్యార్థులు పెన్నార్ నదిని దాటి స్కూలుకు వెడుతుంటారు. ఆయా గ్రామాల్లోని విద్యార్థులే కాక గర్భిణులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు సైతం నిత్యావసరాలకోసం పక్క గ్రామానికి వెళ్ళాలంటే నదిని దాటక తప్పడం లేదు. కనీసం 3000 మంది ప్రయాణీకులు ప్రతిరోజూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. బోడూర్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా నదిపై బ్రిడ్జి లేకపోవడంతో స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. స్థానిక ఉత్పత్తులను మార్కెట్ కు చేర్చాలన్నా బ్రిడ్జిని చేరుకోవాలంటే సుమారు 8 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని, రోగులను అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి తరలించాలన్నా నదిని దాటడం ఎంతో కష్టంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. అయితే క్రిషగిరి జిల్లాలో నదిపై బ్రిడ్జి నిర్మాణానికి ఇప్పటికే ముఖ్యమంత్రి జయలలిత రూ.1.5 కోట్ల నిధులు కేటాయించారని, నిర్మాణంకోసం అధికారులకు ఆదేశాలు కూడ జారీ చేశారని పశుసంవర్థకశాఖ మంత్రి బాలకృష్ణా రెడ్డి చెప్తున్నారు. నదిపై బ్రిడ్జిలేక, నీరు ఉధృతంగా ఉన్నసమయంలో సంవత్సరంలో సుమారు 100 రోజులపాటు పాఠశాలకు హాజరుకాలేకపోతున్నామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు మరో రెండేళ్ళలో బోర్డు పరీక్షలు రాయాల్సి ఉండగా... అధికారులు ఇచ్చే హామీలు ఎప్పుడు అమల్లోకి వస్తాయో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
షార్కు చేరుకున్న ఐఆర్ఎన్ఎస్ఎస్-1జీ
సూళ్లూరుపేట: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రమోగ కేంద్రమైన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈనెల 28న ప్రయోగించ తలపెట్టిన ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (ఐఆర్ఎన్ఎస్ఎస్-1జీ) ఉపగ్రహం బెంగళూరు నుంచి సోమవారం శ్రీహరికోటకు చేరింది. పీఎస్ఎల్వీ సీ33 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిం చనున్నారు. 1425 కిలోల బరువు ఉన్న ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని ఉపగ్రహాల తయారీ కేంద్రం(ఐసాక్) నుంచి ఆదివారం తరలించి చెన్నై మీదుగా భారీ బందోబస్తు మధ్య సోమవారం శ్రీహరికోటకు తీసుకొచ్చారు. ఉపగ్రహానికి అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత ద్రవ ఇంధనాన్ని నింపి రాకెట్ శిఖర భాగాన అమర్చే ప్రక్రియను చేపడతారు. షార్‌లోని మొదటి ప్రయోగ వేదికపై పీఎస్ఎల్వీ సీ33 నాలుగు దశల రాకెట్ అనుసంధానం పనులను పూర్తిచేసి ఉపగ్రహాన్ని అమర్చనున్నారు. భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థలో ఇది ఆఖరు ఉపగ్రహం. ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని పూర్తిచేస్తే భారతదేశానికి సొంత నావిగేషన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రయోగాన్ని వీక్షించి, నావిగేషన్ సిస్టంను జాతికి అంకితం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షార్కు విచ్చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. -
మసక చీకటిలో ఇసుక దోపిడీ
సిద్దిపేట రూరల్/చిన్నకోడూరు: ప్రభుత్వం ఏర్పాటు చేసిన రీచ్‌ల నుంచి తరలించే ఇసుక రవాణాలో నిబంధనలకు పాతరేస్తున్నారు. పక్కా ప్రణాళికలతో కీలక వ్యక్తులను మేనేజ్ చేస్తూ తమ దందాను సాగిస్తున్నారు. ఒకే బిల్లును కనీసం మూడు లారీలకు వినియోగిస్తున్నారు. టన్నుకు సుమారు రూ.350 చొప్పున చెల్లించే రుసుముతో మీసేవలో ఓ అధికారిక పత్రాన్ని తీసుకుంటూ ఇతర లోడ్లకు గాను టన్నుకు రూ.100 చొప్పున ఇచ్చి సిబ్బందిని లోబర్చుకుంటున్నారు. ఒక్కో లారీకి గరిష్టంగా 15 టన్నులు భర్తీ చేయాల్సి ఉంటే 45 టన్నుల వరకు నింపుతున్నారు. ఇలా అన్ని విధాలుగా ధగా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నిర్వాకాన్ని సంబంధిత శాఖల అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. పైఅధికారి చాలా స్ట్రిక్ట్ అంటూ రెండు, మూడింతల మామూళ్లు పిండుతున్నారు. కరీంనగర్, సిరిసిల్ల మధ్య ఉన్న ఖాజీపూర్ ఇసుక పాయింట్ నుంచి సిద్దిపేట మీదుగా హైదరాబాద్‌కు రోజూ రాత్రి వేళల్లో 100 నుంచి 150 లారీల్లో ఇసుక రవాణా అవుతుంది. తద్వారా ఒక్కో రాత్రికి లక్షల రూపాయలను దండుకుంటున్నారు. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా మారింది వ్యవహారం. ముఖ్యంగా మూడు దశల్లోని అధికారులు, ఇతరులు దండిగా నొక్కేస్తున్నారు. సిద్దిపేట ప్రాంతంతోపాటు హైదరాబాద్‌లో పలు నిర్మాణాలకు ఇసుక తప్పనిసరి అవసరం. ఇందుకు గాను ఇసుకను తరలించడానికి గనుల శాఖ కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. నిర్ణీత వాగుల నుంచి పరిమితంగా ఇసుకను వే బిల్లుపై తరలించడానికి అవకాశమిచ్చింది. ఈ అవకాశాన్ని ఇసుక మాఫియా దుర్వినియోగపరుస్తోంది. నిబంధనలు తుంగలో తొక్కుతూ ఇసుకను అక్రమంగా తరలిస్తోంది. సదరు వ్యక్తులు ప్రధానంగా కరీంనగర్ జిల్లా ఖాజీపూర్, సిరిసిల్ల వాగుల నుంచి ఇసుకను రాజీవ్ రహదారి మీదుగా లారీల్లో తరలిస్తున్నారు. ఒక వాగు నుంచి ఒక రోజుకు అనుమతించిన ఇసుక కన్నా నాలుగైదు రెట్లు అధికంగా తోడుతూ హైదరాబాద్‌కు రవాణా చేస్తున్నారు. ఈ మార్గమంతా రాజీవ్ రహదారే. ఇందులో ప్రధాన కేంద్రం సిద్దిపేట. దీంతో ఇక్కడి అధికారులకు మామూళ్లు చెల్లిస్తూ తమ అక్రమ దందాను సాగిస్తున్నారు. ఇదంతా బహిరంగంగా జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఒక నంబర్ గల లారీ ఒక రోజు ఒక ట్రిప్పును రవాణా చేయాల్సి ఉండగా వేగంగా తోలుతూ రోజుకు రెండు, మూడు ట్రిప్పులను ఒకే లారీని నడిపిస్తున్నారు. రిపేర్ పేరిట మోసం... ఇసుకను రవాణా చేయడానికి అనుమతి పొందిన లారీ తన రవాణాను కొనసాగిస్తుండగానే ఈ లారీ రిపేర్‌లో ఉన్నట్లు దరఖాస్తు చేసుకొని మరో లారీ ద్వారా ఇసుకను రవాణా చేయడానికి అనుమతి పొందుతున్నారు. దీన్ని సాకుగా చూపి అక్రమ దందాను మరింత వేగం చేస్తున్నారు. ఇదంతా బహిరంగ రహస్యమే అయినప్పటికీ సదరు వ్యక్తులు సిద్దిపేట ప్రాంత అధికారులతో రహస్య ఒప్పందాలు చేసుకుంటూ అక్రమ దందా జోరును పెంచేస్తున్నారు. అనుమతి 15 టన్నులు.. రవాణా 45 టన్నులు... 15 టన్నుల ఇసుకను రవాణా చేయడానికి అనుమతి పొందిన లారీలో సుమారు 45 టన్నుల వరకు ప్యాక్ చేసి పంపిస్తున్నారు. ఇలా రవాణా చేయడం వల్ల లారీపై ఉండే కూలీలు కింద జారిపడి ప్రమాదాల బారిన సంఘటనలు చాలానే ఉన్నాయి. దీంతోపాటు కనీసం కవర్లు కూడా కప్పకపోవడంతో గాలి వేగానికి లారీపై ఉన్న ఇసుక వెనుక ప్రయాణిస్తున్న వాహనాలపై పడడం.. వెనకున్న వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పలువురి ప్రాణాలు సైతం గాలిలో కలిసిపోయాయి. అనుమతి ఒకటి... అక్రమాలు పన్నెండు... ఇసుక మాఫియా ఒక రోజుకు 15 టన్నుల లారీ అనుమతి పొంది 45 టన్నుల ఇసుకను తరలిస్తోంది. దీంతోపాటు ఒక ట్రిప్పుకు బదులుగా మూడు ట్రిప్పులు తరలిస్తోంది. అనుమతి పత్రాలు ఒకటి ఉంటే వాటి పేర్లతోనే మరో మూడు, నాలుగు ఇసుక లారీలను పంపుతోంది. పోలీసులకు రూ.లక్షల్లో మామూళ్లు... సిద్దిపేట ప్రాంతంలోని రాజీవ్ రహదారిపై ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఒక్కో లారీకి రోజుకు రూ.5 వేల చొప్పున మామూళ్లను పోలీసులు వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఇలాంటి లారీలు రోజుకు సుమారు వందకుపైగా ఉంటాయి. అప్పుడప్పుడు మొక్కుబడిగా లారీలను అడ్డుకుని జరిమానాలు విధిస్తూ చేతులు దులుపుకొంటున్నారు. రెవెన్యూ అధికారులు సైతం తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. కొందరు అధికారులు డబ్బులు ముట్టుకోకుండా ఇసుకను వినియోగించుకుంటున్నారని సమాచారం. ఇటీవల జిల్లాకు స్ట్రిక్ట్ ఆఫీసర్ వచ్చారని ప్రచారం చేస్తూ తమ మామూళ్లను ఏకంగా మూడంతలు పెంచుకున్నట్టు సమాచారం. మామూళ్లు ఇవ్వలేక ఈ దందానే మానుకున్నట్టు కొందరు వ్యాపారులు బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. -
పొట్టేపాళెం రీచ్‌లో రచ్చ
నెల్లూరు(బారకాసు) నెల్లూరు : పొట్టేపాళెం ఇసుక రీచ్‌లో వేబిల్లు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ ట్రాక్టర్ యాజమానులు, డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇసుక రవాణాను నిలిపివేసి అక్కడే బైఠాయించి నిరసన చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. ఇసుక రవాణాను పారదర్శకంగా నిర్వహించలనే తలంపుతో ప్రభుత్వం రీచ్‌లలో వేబిల్లును కంప్యూటర్ ద్వారా ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు పొట్టేపాళెం ఇసుక రీచ్‌లో కంప్యూటరైజ్డ్ పద్ధతిని నాలుగురోజుల క్రితం ఏర్పాటు చేసింది. అయితే కంప్యూటర్ ద్వారా వచ్చే వేబిల్లులు తప్పులు తడకగా వస్తున్నాయి. ఈ వేబిల్లులు తీసుకున్నవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈవిషయాన్ని అధికారులకు తెలియజేసిన పట్టించుకోకపోవడంతో శుక్రవారం పొట్టెపాళెం రీచ్‌లో ట్రాక్టర్లకు ఇసుక లోడ్ చేసుకుని తీసుకెళ్లకుండా అక్కడే నిలిపి ఆందోళన చేపట్టారు. మొత్తం 147 ట్రాక్టర్లకు ఇసుక లోడ్ చేశారు. ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్లు వేబిల్లు కోసం కార్యాలయానికి రాగా సిబ్బంది వేబిల్లు ఇవ్వడంలో జాప్యం చేశారు. వచ్చిన బిల్లులో చిరునామా తప్పుగా ముద్రించి రావడంతో ఇలాగైతే వేబిల్లులు మాకొద్దంటూ వారంతా ఆందోళనకు దిగారు. దీంతో సిబ్బంది ఫోన్ ద్వారా అధికారులకు జరిగిన విషయాన్ని వివరించారు. కొంతసేపటికి డీఆర్డీఏ ఏపీడీ నాసరరెడ్డి, తహశీల్దార్ జనార్దన్‌రావు, ఆతర్వాత ఆర్డీఓ సుబ్రమణ్యేశ్వరెడ్డి ఇతర అధికారులు రీచ్‌కు చేరుకున్నారు. దీంతో కొంతసేపు అధికారులకు, ట్రాక్టర్ల యజమానులకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి మధ్యాహ్నం రెండుగంటల సమయంలో లోటుపాటులను సోమవారంలోపు సరిదిద్దే ప్రయత్నం చేస్తామని, ప్రస్తుతానికి వేబిల్లులను తీసుకెళ్లాలని అధికారులు హామీ ఇవ్వడంతో వారంతా ఆందోళన విరమించారు. తప్పులతో పోలీసులు ఆపుతున్నారు -శ్రీహరి, ట్రాక్టర్యజమాని ఇసుక రవాణా చేస్తున్న సమయంలో పోలీసులు ఆపి వేబిల్లు చూసి అడ్రస్సు తప్పు ఉండటంతో అక్రమంగా రవాణా చేస్తున్నారంటూ వాహనాలను నిలిపివేసి భారీ మొత్తంలో జరిమానా విధిస్తున్నారు. దీంతో చాలా నష్టపోతున్నాము. అధికారులు ఈవిషయంపై శ్రద్ధచూపి సరిచేయాలి. ప్రభుత్వం ఆదేశాల మేరకే.. - నాసరరెడ్డి, ఏపీడీ, డీఆర్డీఏ వేబిల్లుల పంపిణీ కంప్యూటర్ల ద్వారానే జరగాలనే ఉన్నతాధికారుల నిర్ణయం మేరకే ఈప్రక్రియను చేపట్టాము. కంప్యూటర్లలో జరిగే తప్పులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే జరుగుతున్న లోటుపాట్లును సరిదిద్దుతాము. -
ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట
కర్నూలు(అగ్రికల్చర్): ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసి.. డ్వాక్రా సంఘాలకు కేటాయించిన రీచ్‌ల నుంచి నిబంధనల ప్రకారం తరలిస్తామని జాయింట్ కలెక్టర్ కన్నబాబు అన్నారు. గురువారం ఆయన తన చాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు రెవెన్యూ, పోలీసు, మైనింగ్, రవాణా అధికారులతో ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి నిరంతర గస్తీ ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో నాలుగు ఇసుక రీచ్‌లను గుర్తించినా.. నిడ్జూరులో మాత్రమే తవ్వకాలు కొనసాగుతున్నాయన్నారు. ఇసుక ధర, రవాణా చార్జీలను ఇప్పటికే ఖరారు చేశామన్నారు. ఇప్పటి వరకు వినియోగదారులు డీడీలు చెల్లించి ఇసుక తరలిస్తున్నారని.. ఇకపై మీసేవ కేంద్రాల్లో నగదు చెల్లించి రశీదులను ఇసుక రీచ్‌ల వద్ద డ్వాక్రా సంఘాల ప్రతినిధులకు అందిస్తేనే ఇసుక సరఫరా అవుతుందన్నారు. వాల్టా చట్టాన్ని వంద శాతం అమలు చేస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఇందులో భాగంగానే రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పత్తి కొనుగోలుకు చర్యలు పత్తి ధర పడిపోవడంతో కనీస మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ను రంగంలోకి దించుతున్నట్లు తెలిపారు. ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాలలో సీసీఐ కొనుగోలు కేంద్రాలతో ఎంఎస్పీతో పత్తిని కొనుగోలు చేస్తామన్నారు. రైతులు నష్టపోకుండా అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రస్తుతం ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ, ఆముదం దిగుబడులను ఈ-టెండర్లతో కొనుగోలు చేస్తున్నారని.. త్వరలోనే పత్తిని కూడా అదేవిధంగా కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. -
నాలుగు మృతదేహాల హైదరాబాద్‌కు తరలింపు