పక్షి ప్రేమికులు సంబరపడే వార్త ఇది. కెనడా, అమెరికాలకు ఆనుకుని ఉన్న మధ్యధరా సముద్ర ప్రాంతాల్లో కనిపించే వింబ్రెల్ పక్షి తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాఘర్ జిల్లాకు తరలివచ్చింది. ఇది దాదాపు ఆరు వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వచ్చింది.
ఈ పక్షి మొదటిసారిగా ఈ ప్రాంతంలో కనిపించింది. దీనిని చూసేందుకు అటవీశాఖ సిబ్బందితో పాటు సామాన్యులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. వింబ్రల్ పక్షి ఖైరాఘర్ జిల్లా మొహభట్టా గ్రామానికి తరలివచ్చింది. దాని శరీరంపై రేడియో కాలర్ అమర్చారు. ఈ కాలర్ అంచనా ధర రూ.10 లక్షలని తెలుస్తోంది. ఆ పక్షి వెనుక భాగంలో సోలార్ జీపీఎస్ కాలర్ కూడా ఉంది. దీని ద్వారా అది ఎంత దూరం ఎగురుతూ ఇక్కడకు చేరిందో తెలుస్తుంది.
ఈ కాలర్‌ను ఆ పక్షికి 2023 నవంబర్ 16న ఒక ద్వీపంలో అమర్చారు. ఆ పక్షి దాదాపు 6 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని దీని ద్వారా తెలుస్తోంది. ఆ పక్షి పాకిస్తాన్ మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్‌కు చేరుకుంది. దీవి నుంచి బయలుదేరిన ఆ పక్షి అరేబియా సముద్రానికి చేరుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్‌కు చేరుకుని, అక్కడ నాలుగు రోజుల పాటు మకాం వేసింది.
ఈ పక్షి భారత తీరంలో 10 రోజులు ఉండి, తరువాత ఖైరాఘర్ జిల్లాలోని మొహభట్టా గ్రామానికి చేరుకుంది. ఇక్కడ ఈ పక్షి నీటిలో ఉల్లాసంగా తిరుగుతూ కనిపిస్తోంది. గత మూడు రోజులుగా ఈ పక్షి ఇక్కడే ఉంటోంది. ఈ పక్షి రెండు కాళ్లపై ఆకుపచ్చ, పసుపు రంగుల జెండాలు ఉన్నాయి. యూరప్‌లోని ఒక సంస్థ ఈ పక్షిని పర్యవేక్షిస్తున్నదని సమాచారం. వింబ్రల్ పక్షి రాకపై తమకు సమాచారం అందిందని ఖైరాగఢ్ డీఎఫ్‌ఓ అమిత్ తివారీ తెలిపారు. సాధారణంగా ఈ పక్షి మధ్యధరా సముద్ర తీరంలో నివసిస్తుంది. ఇది సంతానోత్పత్తి కోసం వివిధ ప్రదేశాలను వెతుకుతూ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment