Travelled
-
పాక్ ప్రియుణ్ణి పెళ్లాడిన యూపీ మహిళ
ప్రేమ కోసం దేశ సరిహద్దులు దాటుతున్న వారి జాబితాలో ఇప్పుడు యూపీకి చెందిన నగ్మా చేరింది. ఇటువంటి ఉదంతాలు అటు పోలీసులకు, ఇటు ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని థానేకు చెందిన పోలీసులు తాజాగా 24 ఏళ్ల మహిళను విచారిస్తున్నారు. ఆమె గత మే నెలలో పాకిస్తాన్ వెళ్లి, తరువాత ముంబైకి తిరిగి వచ్చింది. ఈ సంగతి తెలుసుకున్న పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. నగ్మా తన బిడ్డతో సహా పాకిస్తాన్ వెళ్లినట్లు పోలీసులకు తెలియవచ్చింది. అయితే ఆ మహిళ నకిలీ పత్రాలు, మారుపేరుతో పాకిస్తాన్‌కు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.నకిలీ పత్రాలను ఉపయోగించి పాస్‌పోర్ట్, వీసా పొందడంలో నగ్మాకు సహాయం చేసిన వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల విచారణలో ఆమె తాను పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తిని ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకున్నానని, అతనిని పాకిస్తాన్లో పెళ్లి చేసుకున్నానని ఆమె తెలిపింది. ఈ నేపధ్యంలో ఆమె వివాహ ధ్రువీకరణ పత్రం కూడా పోలీసులకు దొరికింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగ్మా స్వస్థలం ఉత్తరప్రదేశ్. ఆమె ఉద్యోగరీత్యా థానేలో ఉంటోంది. ప్రస్తుతం పోలీసులు నగ్మా డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. -
6000 కి.మీ ఎగురుతూ ఛత్తీస్‌గఢ్‌కు అరుదైన పక్షి!
పక్షి ప్రేమికులు సంబరపడే వార్త ఇది. కెనడా, అమెరికాలకు ఆనుకుని ఉన్న మధ్యధరా సముద్ర ప్రాంతాల్లో కనిపించే వింబ్రెల్ పక్షి తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాఘర్ జిల్లాకు తరలివచ్చింది. ఇది దాదాపు ఆరు వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వచ్చింది.ఈ పక్షి మొదటిసారిగా ఈ ప్రాంతంలో కనిపించింది. దీనిని చూసేందుకు అటవీశాఖ సిబ్బందితో పాటు సామాన్యులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. వింబ్రల్ పక్షి ఖైరాఘర్ జిల్లా మొహభట్టా గ్రామానికి తరలివచ్చింది. దాని శరీరంపై రేడియో కాలర్ అమర్చారు. ఈ కాలర్ అంచనా ధర రూ.10 లక్షలని తెలుస్తోంది. ఆ పక్షి వెనుక భాగంలో సోలార్ జీపీఎస్ కాలర్ కూడా ఉంది. దీని ద్వారా అది ఎంత దూరం ఎగురుతూ ఇక్కడకు చేరిందో తెలుస్తుంది.ఈ కాలర్‌ను ఆ పక్షికి 2023 నవంబర్ 16న ఒక ద్వీపంలో అమర్చారు. ఆ పక్షి దాదాపు 6 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని దీని ద్వారా తెలుస్తోంది. ఆ పక్షి పాకిస్తాన్ మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్కు చేరుకుంది. దీవి నుంచి బయలుదేరిన ఆ పక్షి అరేబియా సముద్రానికి చేరుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్‌కు చేరుకుని, అక్కడ నాలుగు రోజుల పాటు మకాం వేసింది.ఈ పక్షి భారత తీరంలో 10 రోజులు ఉండి, తరువాత ఖైరాఘర్ జిల్లాలోని మొహభట్టా గ్రామానికి చేరుకుంది. ఇక్కడ ఈ పక్షి నీటిలో ఉల్లాసంగా తిరుగుతూ కనిపిస్తోంది. గత మూడు రోజులుగా ఈ పక్షి ఇక్కడే ఉంటోంది. ఈ పక్షి రెండు కాళ్లపై ఆకుపచ్చ, పసుపు రంగుల జెండాలు ఉన్నాయి. యూరప్‌లోని ఒక సంస్థ ఈ పక్షిని పర్యవేక్షిస్తున్నదని సమాచారం. వింబ్రల్ పక్షి రాకపై తమకు సమాచారం అందిందని ఖైరాగఢ్ డీఎఫ్ఓ అమిత్ తివారీ తెలిపారు. సాధారణంగా ఈ పక్షి మధ్యధరా సముద్ర తీరంలో నివసిస్తుంది. ఇది సంతానోత్పత్తి కోసం వివిధ ప్రదేశాలను వెతుకుతూ ఉంటుంది. -
రూ. రెండు కోట్ల ఖర్చుతో 20 కోట్ల లబ్ది.. ‘ఏక్ దిన్ కా సుల్తాన్’.. అంతా గాల్లోనే
మహా అయితే ఇన్ని దేశాలు తిరిగొచ్చాను అని చెబుతుంటారు. లేదంటే సుమారు లక్షల మైళ్ల వరకు వెళ్లి ఉండొచ్చని అంటారు. కానీ, నిరతరం ప్రయాణించడం మాత్రం అసాధ్యమే. అది కూడా కొద్ది మొత్తం డబ్బుతోనే.. దాదాపు ఆరు సార్లు చంద్రుని పర్యటనకి వెళ్లడానికి పట్టేంత దురాన్ని చుట్టి రావడం అంటే నమ్మశక్యం కానీ విషయమే! కానీ అది నిజం అతను అంత దురాన్ని విమానంలో చుట్టొచ్చాడు. కేవలం ఆకాశం, ఎయిర్‌పోర్ట్‌లలోనే గడుపుతూ.. నిర్విరామంగా ప్రయాణించాడు. ఆ వ్యక్తే యూఎస్‌కి చెందిన 69 ఏళ్ల టామ్ స్టుకర్. అతను 1999లో యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కి సుమారు రూ. 2 కోట్లు చెల్లించి జీవితకాల ఎయిర్ పాస్ని పొందాడు. దీన్ని తాను పెట్టిన అత్యుత్తమమైన పెట్టుబడిగా స్టుకర్ చెప్పుకుంటాడు. 33 ఏళ్ల క్రితం తీసుకున్న ఈ పాస్‌తో కనీసం 23 మిలియన్ల కి.మీ. దూరం ప్రయాణిస్తే చాలు అనుకున్నాడు. గానీ ఏకంగా 37 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణిస్తానని ఊహించలేదు. ఈ జర్నీలో అతను కొన్ని సమయాల్లో సుమారు 12 రోజుల వరకు బెడ్‌పై పడుకోకుండా అలానే ప్రయాణించినట్లు తెలిపాడు. ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ అయినప్పుడూ తప్ప మిగతా అన్ని వేళలా ఆకాశంలోనే ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ ప్రయాణంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లగ్జరీ హోటల్ సూట్లు, క్రిస్ట్ క్రూయిజ్‌లు వంటి వాటిల్లో కొన్ని వారాల పాటు ‘ఏక్ దిన్ సుల్తాన్’ మాదిరి భోగాలు అనుభవించాడు. మొత్తం 1.46 మిలియన్ల మైళ్ల దురం పర్యటించేందుకు సుమారు 373 విమానాల్లో ప్రయాణించినట్లు చెప్పాడు. నిజానికి అతడు గనుక ఈ పాస్ బుక్ తీసుకోనట్లయితే ఇంత దూరం పర్యటించినందుకు ఆ ఫ్లైట్లకి సుమారు రూ. 20 కోట్లు ఖర్చయ్యేవి. అదీగాక ఇన్ని మైళ్ల దూరం జర్నీ చేసేందుకు అన్ని విమానాలను ప్రతిసారి బుక్‌చేసుకోవడం కూడా కష్టమే కానీ ఈ పాస్ ఉండటం కారణంగానే అతను ఈజీగా అన్ని విమానాల్లో ప్రయాణించగలిగాడు. అతను 2019లో ఇంత దూరం పర్యటించాడు. అతను పర్యటించిన దూరం ఆరుసార్లు చంద్రుని పర్యటనకు వెళ్లిన దానితో సమానమని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. అంతేగాదు చరిత్రలో అతని మాదిరి అంతలా పర్యటించిన వ్యక్తి మరొకరు లేరని కూడా సదరు విమానయాన సంస్థ పేర్కొనడం విశేషం. (చదవండి: వాట్ యాన్ ఐడియా! ఆ తల్లి చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే!) -
బస్సులో ప్రయాణించిన రాహుల్ గాంధీ.. మహిళా ప్యాసెంజర్లతో ముచ్చట్లు..
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల చివరి రోజు ప్రచారంలో భాగంగా బెంగళూరు మెట్రోపాలిటన్ బస్సులో ప్రయాణించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మహిళలు, కళాశాల విద్యారినులతో ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారితో ఆప్యాయంగా మాట్లాడారు. ఈ సమయంలో ఓ మహిళ రాహుల్‌కు తన సమస్యల గురించి వివరించింది. నిత్యావసరాల ధరల పెరుగుదల ప్రభావాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లింది. ఈ విషయంపై మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గృహలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతినెల రూ.2000 ఇస్తామనే హామీని రాహుల్ గుర్తు చేశారు. అలాగే మహిళలకు బీఎంటీసీ, కేఎస్ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించే విషయాన్ని కూడా ప్రస్తావించారు. Shri @RahulGandhi hops on to a BMTC bus & interacts with women passengers to understand their vision for Karnataka. They candidly discuss topics including the rising price of essentials, Gruhalakshmi scheme and the Congress' guarantee of free travel for women in BMTC and KSRTC… pic.twitter.com/wqXySTY6Qw — Congress (@INCIndia) May 8, 2023 రాహుల్ బీఎంటీసీ బస్సులో ప్రయాణించిన వీడియోను కాంగ్రెస్ యూత్ విభంగా ఎన్ఎస్యూఐ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. బెంగళురు విజన్ గురించి కర్ణాటక మహిళలలు ఏమనుకుంటున్నారో రాహుల్ స్వయంగా అడిగి తెలుసుకున్నట్లు పేర్కొంది. కాగా.. ప్రచారం చివరిరోజున రాహుల్ తీరిక లేకుండా గడపనున్నారు. కాంగ్రెస్ నిర్వహించే పలు ర్యాలీలకు హాజరుకానున్నారు. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మే 13న కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. మొత్తం 224 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పలు ప్రీపోల్ సర్వేలు తెలిపాయి. బీజేపీ మాత్రం వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టిస్తామని చెబుతోంది. ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రంతో ముగియనుంది. చదవండి: కర్ణాటకలో కాంగ్రెస్‌దే విజయం..! పీపుల్స్ పల్స్ సర్వేలో కీలక విషయాలు -
600 కిలో మీటర్లు ప్రయాణించిన తమిళ స్టార్ అజిత్
-
ఒక్కరోజే.. 2.25 లక్షల మంది మెట్రో జర్నీ
సాక్షి, సిటీబ్యూరో: కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా మెట్రో రైలు సేవల సమయాన్ని పొడిగించ డం వల్ల ఒకేరోజు 2.25 లక్షల మంది ప్రయాణించారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి 12.30 గంటల వరకు మెట్రో రైళ్లు నడిపారు. దీని కారణంగా ఒకేరోజు మెట్రోలో ప్రయాణించిన వారిసంఖ్య తొలిసారి 2 లక్షల మార్క్‌ను దాటిందని హెచ్‌ఎమ్మార్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్–అమీర్‌పేట్ రూట్లో 1.65 లక్షల మంది, నాగోల్–అమీర్‌పేట్ మార్గంలో సుమారు 60 వేల మంది మెట్రో ప్రయా ణం చేసినట్లు ఆయన వెల్లడించారు. అమీర్‌పేట్, మియాపూర్, ఎల్బీనగర్, కేపీహెచ్‌బీ, జేఎన్టీయూ, ఉప్పల్ స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడాయన్నారు. సాయంత్రం 5 నుంచి అర్ధరాత్రి 12.30 గం. వరకు ఈ రద్దీ కొనసాగిందన్నారు. ఆరు నిమిషాలకో రైలు: రోజూ 1.50 లక్షల మంది మెట్రో సేవలను వినియోగించుకుంటున్న సంగతి తెలిసిందే. కొత్త సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ఎల్బీనగర్–మియాపూర్, అమీర్‌పేట్–నాగోల్ రూట్లలో ప్రతి ఆరు నిమిషాలకో మెట్రో రైలును నడిపారు. జనవరి నెలాఖరులోగా అమీర్‌పేట్–హైటెక్‌సిటీ (10 కి.మీ)రూట్లోనూ మెట్రోరైళ్ల వాణిజ్య రాకపోకలను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ మార్గానికి సంబంధించి ఇప్పటికే ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ మార్గం ప్రారంభమయితే.. నిత్యం నగరంలో మెట్రో జర్నీ చేసే ప్రయాణికుల సంఖ్య మూడు లక్షలు దాటుతుందని మెట్రోరైల్ అధికారులు అంచనావేస్తున్నారు. హైటెక్‌సిటీ మార్గంలో మెట్రో పూర్తయితే ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ట్రాఫిక్ చిక్కులు తప్పనున్నాయి. ఈ రూట్లోని స్టేషన్ల నిర్మాణం, సుందరీకరణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ముందుగా అనుకున్న ప్రకారం ఎంజీబీఎస్–ఫలక్‌నుమా మార్గం కూడా పూర్తయితే నిత్యం మూడు మార్గాల్లో సుమారు 16 లక్షల మంది మెట్రో జర్నీ చేస్తారని మెట్రో అధికారులు అంచనావేస్తున్నారు. -
20 రాష్ట్రాల్లో హాయిగా తిరిగాను...
చీకటిని చూసి భయపడితే ఎప్పటికీ భయంగానే ఉంటుంది...ఆ చీకట్లోకి వెళ్ళినప్పుడే అక్కడ ఏముందో తెలుస్తుంది. ఇంచుమించుగా ఇటువంటి అనుభవాన్నే ఆ మహిళ ప్రత్యక్షంగా తెలుసుకోవాలనుకుంది. భారత దేశంలో మహిళ ఒంటరి ప్రయాణం సురక్షితం కాదు.. అన్న అనుమానం నిజమా కాదా అన్నది నిరూపించాలని నిర్ణయించుకుంది. ప్రతిరోజూ జరిగే భయంకరమైన ఘటనల గురించి విని, చదివి భయపడే వారికి భిన్నంగా ఆలోచించింది. దేశంలోని ఇరవై రాష్ట్రాల్లో ఒంటరిగా ప్రయాణించి తన అనుభవాలను వివరించింది. ముఖ్యంగా అంతా భయపడే ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్ బస్తర్ లో ఓ మహిళ ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలనుకుంది స్వాతీ జైన్. అక్కడివారంతా తనను ఎంతో వింతగా చూస్తారని అభిప్రాయపడింది. కానీ వారు తనపై చూపిన ఆదరణ, సహాయ సహకారాలకు ఆశ్చర్యపోయింది. మొదటి 96 గంటలపాటు 1300 కిలోమీటర్లు గిరజన ప్రాంతంలో ప్రయాణించిన ఆమె.. దూరంగా చూసి ఏ విషయానికీ భయపడకూడదన్న సత్యాన్ని గ్రహించింది. ఏ ఒక్కరూ తనవైపు వింతగా చూడలేదని, ముట్టుకోడానికి ప్రయత్నించలేదని, భయపెట్టలేదని చెప్తోంది. నిజంగా అనుమానం పెనుభూతం అన్న సామెతకు ఇదే ఉదాహరణ అంటోంది. ఛత్తీస్‌గఢ్ లో తన ఒంటరి ప్రయాణం కోసం ముందుగా ట్రావెల్ వెబ్ సైట్లు, పుస్తకాలు సందర్శించిన ఆమె... బస్తర్ ప్రయాణంపై పర్యాటకులకు సలహాదారులు వ్యతిరేక సమాచారం ఇవ్వడాన్నే చూసింది. అయితే అక్కడి పార్కులు, గుహలు వంటి సందర్శనా స్థలాలతోపాటు... వారు జరుపుకునే దసరా వేడుకను చూడాలన్న ఉద్దేశ్యంతో బస్తర్ లో ప్రయాణించింది. అలాగే తాను రాజస్థాన్ ప్రాంతంలో ప్రయాణించేప్పుడు ఓ నిర్మానుష్య ప్రాంతంలో టాక్సీ ఆగిపోయినప్పుడు... ఓ దంపతులు ట్రాక్టర్ లో ఎక్కించుకొని తనకు అక్కడికి దగ్గరలోని ఓ సురక్షిత ప్రాంతంలో ఆశ్రయం కల్పించారని చెప్తోంది. ముందుగా తాను ఒంటరిగా వారితో ప్రయాణించేందుకు భయపడి... తనతోపాటు పెప్పర్ స్ప్రే వంటివి ఉంచుకున్నానని, అయితే వారు ఆ అర్థరాత్రి సమయంలో సహాయం అందించడమే కాక.. మరుసటిరోజు ప్రయాణానికి కూడా సహకరించారని తెలిపింది. అలాగే కార్గిల్ లోని జాన్స్ కర్ ప్రాంతంలో ప్రయాణించినప్పుడు తన షేర్ టాక్సీలోని ఓ వ్యక్తి తన కజిన్ గెస్ట్ హౌస్ లో ఆశ్రయం కల్పించాడని, తన ఇల్లులాగే ఫీల్ అవ్వమంటూ ఎంతో మర్యాదగా చూశాడని ఆ ఒంటరి ప్రయాణీకురాలు తన అనుభవాలను వెల్లడించింది. ప్రతి విషయానికీ భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ముందడుగు వేస్తే ఏ ప్రాంతంలోనైనా మహిళలు ఒంటరిగా ప్రయాణించవచ్చని అంటోంది. అంతేకాదు ప్రపంచంలో అన్ని ప్రదేశాలకన్నా భారత దేశంలోనే మహిళలు ఒంటరిగా ప్రయాణించడం సురక్షితమని తాను భావిస్తున్నట్లు వివరిస్తోంది. ఇరవై రాష్ట్రాల్లో ఒంటరిగా ప్రయాణించిన ఆమె... ప్రతివారూ తమ జీవితంలో ఒక్కసారైనా ఒంటరి ప్రయాణం చేసి, ప్రత్యేక అనుభవాలను మూటగట్టుకోవాలని సలహా ఇస్తోంది.