రాగులపాడు వద్ద ఎత్తిపోతల పథకం
వజ్రకరూరు :
రాగులపాడు గ్రామ సమీపంలోని హంద్రీనీవా సుజల స్రవంతి పథకంలోని లిఫ్ట్‌కు బుధవారం ఉదయం 8 గంటలకు కృష్ణా జలాలు చేరుకున్నాయి. అధికారులు మూడు పంప్‌ల ద్వారా నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. ఒక్కొక్క పంపు నుంచి 350 క్యూసెక్కుల మేర నీరు వెళుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈఈ రాజశేఖర్, డీఈ రామచంద్ర, జేఈ వాసుదేవ,ఏఈ ఎర్రిస్వామి తదితరులు నీటి పంపింగ్‌ను పరిశీలించారు.