
ఫైల్ ఫోటో
సాక్షి, చెన్నై: ఆగ్నేయ అరేబియా సముద్రంలో వాయుగుండం ఏర్పడింది. ఈ వాయుగుండం ప్రభావంతో దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలోని తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తూత్తుకుడిలో అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు కురుస్తుండడంతో అప్రమత్తమైన అధికారులు తూత్తుకుడి, రామేశ్వరం ఓడరేవుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వర్షాల నేపథ్యంలో పలు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment