
సాక్షి, విశాఖపట్నం: తీవ్ర వాయుగుండం తమిళనాడు తీరం వైపు కదులుతూ బలపడుతోంది. ట్రికోమలీకి ఆగ్నేయంగా 310 కి.మీ, నాగ పట్టణానికి దక్షిణ ఆగ్నేయంగా 590 కి.మీ, పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 710 కి.మీ, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 800 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరికొద్ది గంటల్లో చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశముంది. తమిళనాడుకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ అయ్యింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు.. రానున్న ఆరు రోజుల పాటు రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంద్ర జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. రానున్న 24 గంటలలో నెల్లూరు, తిరుపతిలలో భారీ వర్షాలు.. అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ నెల 30వ తేదీ నుంచి ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాముందని.. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు వేగంతో గాలులు విస్తాయని.. మత్య్సకారులు చేపల వేటకు వెళ్లరాదన్న వాతావరణ శాఖ.. రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో ఒకటవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment