cyclonic storm
-
Cyclone Remal: 'రెమాల్' తుపాను బీభత్సం..భారీ వర్షాలు (ఫొటోలు)
-
తుపాను పట్ల అప్రమత్తంగా ఉండండి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కాస్తా తీవ్ర వాయుగుండంగా మారి రేపటికి(ఆదివారం) తుపానుగా మారే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. మిచాంగ్ తుపానుగా నామకరణం చేసిన ఈ తుపాను.. ఈ నెల 4వ తేదీన ఏపీలోని నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉండటంతో అధికారులంతా సన్నద్ధంగా ఉండాలన్నారు సీఎం జగన్. ఈ మేరకు తుపాను పరిస్థితులపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా తుపాను పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు సీఎం జగన్. ‘తుపాను పట్ల అప్రమత్తంగా ఉండండి. సహాయక చర్యల్లో ఎలాంటి లోటూ రాకూడదు. తుపాను పరిస్థితులు నేపథ్యంలో అన్నిరకాల చర్యలు తీసుకోవాలి. సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభావిత జిల్లాల కలెక్టర్లు సర్వసన్నద్ధంగా ఉండాలి. కరెంటు, రవాణా వ్యవస్థలకు అంతరాయాలు ఏర్పడితే వెంటనే వాటిని పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. తుపాను ప్రభావం అధికంగా ఉన్న తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. అవసరమైన చోట సహాయశిబిరాలు ఏర్పాటు చేయాలి.రక్షిత తాగునీరు, ఆహారం, పాలు శిబిరాల్లో ఏర్పాటు చేసుకోవాలి. ఆరోగ్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసుకోవాలి’ అని సీఎం జగన్ ఆదేశించారు. ఎనిమిది జిల్లాలకు నిధులు విడుదల చేసింది సీఎం జగన్ ప్రభుత్వం. తిరుపతి జిల్లాకు రూ. 2 కోట్ల నిధులు, నెల్లూరు, ప్రకాశం. బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలకు రూ. 1 కోటి చొప్పున నిధులు విడుదల చేశారు. చదవండి: దూసుకొస్తున్న ‘మిచాంగ్’ తుపాను.. ఐఎండీ రెడ్ అలర్ట్ -
అతి తీవ్ర తుఫాన్‌గా ‘హమూన్’
భువనేశ్వర్/సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్ప పీడనం తీవ్ర తుఫాన్‌గా మారింది. దానికి ఇరాన్ సూచించిన ‘హమూన్’అని పేరు పెట్టారు. అయితే ఒడిశాకు దానివల్ల పెద్ద నష్టమేమీ లేదని వాతావరణ శాఖ పేర్కొంది. ఒడిశా తీరానికి 200 కిలోమీటర్ల దూరం నుంచి బంగ్లాదేశ్ కేసి సాగుతూ మంగళవారం రాత్రికి బలహీనపడింది. బంగ్లాదేశ్‌లో తీరం దాటేసరికి మరింత బలహీన పడుతుందని అధికారులు తెలిపారు. హమూన్ ప్రస్తుతం ఒడిశాలోని పారదీప్‌కు 230 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు 240 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీనివల్ల తీరం వెంబడి గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో రానున్న మూడు రోజులు, రాయలసీమలో ఈనెల 29వ తేదీ వరకు పొడి వాతావరణం ఉంటుంది. 28 నుంచి కోస్తాంధ్రలో, 30 నుంచి రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. చదవండి: నిజం గెలిచింది.. బాబు జైలుకెళ్లారు -
అతి తీవ్ర తుఫాన్ గా మారిన బిపర్ జాయ్
-
తమిళనాడు..‘గజ’ గజ!
సాక్షి, చెన్నై/విశాఖపట్నం: తీవ్ర తుపానుగా మారిన ‘గజ’ సైక్లోను తమిళనాడు వైపు దూసుకొస్తోంది. శుక్రవారం వేకువజామున ఆ రాష్ట్ర తీరాన్ని తాకే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ గురువారం హెచ్చరించింది. ఆ సమయంలో గంటకు 100 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. తుపాను ప్రభావంతో ఇప్పటికే చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షం కురుస్తోంది. నాగపట్నానికి 140 కి.మీ దూరంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన గజ తుపాను.. కడలూరు, పాంబన్ మీదుగా ముందుకు కదులుతోంది. ఆ తీరం వెంబడి ఉన్న కడలూరు, నాగపట్నం, పుదుకొట్టై, తిరువారూర్, తంజావూరు, రామనాథపురం జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యగా హై అలర్ట్ ప్రకటించారు. లోతట్టు, తీర ప్రాంత ప్రజల్ని ప్రత్యేక శిబిరాలకు తరలిస్తున్నారు. మంత్రులు, ఐఏఎస్ అధికారులతో కూడిన బృందాలు నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. పొరుగున ఉన్న పుదుచ్చేరిలోని కారైక్కాల్ జిల్లాలోనూ అధికారులు అప్రమత్తమయ్యారు. గురు, శుక్రవారం ఆ ఆరు జిల్లాల్లో విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. గురువారం సాయంత్రానికే దుకాణాలు, కార్యాలయాలు మూతపడడంతో ఆ జిల్లాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయి. ఈస్ట్ కోస్ట్ రోడ్డు మీదుగా కడలూరు–చెన్నైని కలిపే రహదారిని తాత్కాలికంగా మూసి వేశారు. అలాగే, చెన్నై నుంచి మైలాడుదురై మీదుగా వెళ్లే రైళ్లు కొన్ని రద్దు కాగా, మరికొన్ని విరుదాచలం వైపు మళ్లించారు. ఎలాంటి విపత్కర పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు జాతీయ, రాష్ట్ర స్థాయి విపత్తు నిర్వహణ, అగ్ని మాపక సిబ్బందిని సన్నద్ధం చేశారు. తుపాను నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని తీర ప్రాంత భద్రతా దళం హెచ్చరించింది. కోస్తాకు తప్పిన ‘గజ’ ముప్పు.. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు గజ తుపాను ముప్పు తప్పింది. తుపాను ప్రభావం ఈ రెండు ప్రాంతాలపై తప్పకుండా ఉంటుందంటూ కొద్దిరోజులుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. తొలుత నెల్లూరు–చెన్నైల మధ్య అది తీరాన్ని దాటుతుందని ఐఎండీ అంచనా వేసింది. అయితే క్రమేపీ తుపాను తన దిశ మార్చుకుంటూ తమిళనాడు వైపు పయనిస్తోంది. దీంతో కోస్తా, రాయలసీమకు గజ ముప్పు తొలగిపోయినట్లయింది. -
తీవ్ర తుపాన్‌గా మారనున్న గజ
చెన్నై: చెన్నైకి 760 కి.మీల దూరంలో మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన గజ తుఫాన్ మంగళవారం సాయంత్రానికి అతి తీవ్ర తుఫాన్ మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గజ తుపాన్ గంటకు 7 కి.మీ వేగంతో తీరం వైపు దూసుకొస్తున్నట్టు పేర్కొంది. దీంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం వరకు తమిళనాడులోని పంబన్- కడలూరు మధ్య ‘గజ’ తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సిందిగా సూచించింది. మరోవైపు గజ తుపాన్ సహాయక చర్యల్లో పాల్గొనేందుకు అరక్కోణం నుంచి 10 కంపెనీల ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయలుదేరి వెళ్లాయి. తీర ప్రాంత జిల్లాలను అప్రమత్తం చేసిన ప్రభుత్వం ఇప్పటికే 764 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటితో పాటు పరిస్థితులను ఎదుర్కొవడానికి 700 వైద్య, ఆరోగ్య, పారిశుద్ధ్య సహాయక బృందాలను సిద్ధంగా ఉంచింది. -
తుపాను హెచ్చరికతో అప్రమత్తం
విజయనగరం కంటోన్నెంట్: తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన హుదూద్ తుపాను రాన్ను మూడు రోజుల్లో విశాఖపట్నం-గోపాలపట్నం మధ్య ఎక్కడైనా తీరం దాటవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాన్ ప్రభావం వల్ల రానున్న 36 గంటల్లో గంటకు 130 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదముందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎం ఎం నాయక్ హెచ్చరించారు. ముఖ్యంగా పూసపాటి రేగ, భోగాపురం తీర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆయా మండలాల ప్రత్యేకాధికారులు, తహశీల్దార్లు అప్రమత్తమై ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టరేట్లో 24 గంటలూ పనిచేసే ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. తుపాను సందర్భంగా ఎదురయ్యే సమస్యలేమైనా ఉంటే 08922-278770 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందివ్వాలని కలెక్టర్ సూచించారు. అలాగే విజయనగరం ఆర్డీఓ కార్యాలయంలో 08922-276888, పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో 08963-221006 నంబర్లకు కూడా సమాచారం అందివ్వాలని సూచించారు. జిల్లాలోని అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాట్లు చేశారు. విద్యుత్ కంట్రోల్ రూం ఏర్పాటు విజయనగరం మున్సిపాలిటీ: హుద్ తుపాను కారణంగా జిల్లాలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ శాఖాధికారులు అప్రమత్తమయ్యారు. తుపాను సమయంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నా, సరఫరాలో అంతరాయం వాటిల్లినా తక్షణ సమాచారం తెలుసుకునేందుకు స్థానిక దాసన్నపేట విద్యుత్ భవన్లో ఎమర్జెన్సీ విద్యుత్ కంట్రోల్ సెల్‌ను ఏర్పాటు చేశారు. వినియోగదారులు తక్షణ సమాచారాన్ని అందజేసేందుకు 9490610102 నంబర్‌ను సంప్రదించాలని ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ సి .శ్రీనివాసమూర్తి కోరారు. తుపాను కారణంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలతో పాటు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖాధికారులను, సిబ్బందిని ఆదేశించటం జరిగిందన్నారు. వేటకు వెళ్లొద్దు-మత్స్య శాఖ ఎ.డి. తుపాను హెచ్చరికల నేపథ్యంలో సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని మత్స్యశాఖ ఎ.డి. ఫణిప్రకాష్ హెచ్చరించారు. ఈ నెల 11 నుంచి హుద్ తుఫాను నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, సముద్రంలో పరిస్థితులు అనుకూలించవనే ఉద్దేశంతో మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లొద్దని సూచించారు. -
జిల్లాకూ ‘హుదూద్’ ముప్పు!
సాక్షి, ఏలూరు : అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ‘హుదూద్’ తుపానుగా మారింది. తీవ్రరూపం దాల్చి మన రాష్ట్రం వైపు దూసుకువస్తోంది. 48 గం టల అనంతరం దాని ప్రభావం మన జిల్లాపైనా ఉం టుందన్న సమాచారంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా సిబ్బందిని అప్రమత్తం చేయూలంటూ ఆర్డీవోలు, తహసిల్దార్లకు కలెక్టర్ కె.భాస్కర్ ఆదేశాలు ఇచ్చారు. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిందిగా మత్స్య, వ్యవసాయ, నీటి పారుదల శాఖల అధికారులకు సూచించారు. విద్యుత్, పౌర సరఫరాల శాఖలు కూడా తమ బాధ్యతలు నెరవేర్చడానికి సిద్ధమవుతున్నాయి. పరిస్థితిని బట్టి కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు తుపాను వార్తలు అన్నదాతల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. కొద్దిరోజుల క్రితం వచ్చిన గోదావరి వరదలకు ఉద్యాన పంటలు నష్టపోయి ఖరీఫ్‌లో తొలిదెబ్బను చవిచూసిన రైతులు హుదూద్ తుపాన్‌ను తలచుకని భయపడుతున్నారు.అక్టోబర్ వస్తే వణుకే : అక్టోబర్ నెల వచ్చిందంటే జిల్లాలోని రైతులకు వణుకు పుడుతోంది. జిల్లాపై ఏటా అక్టోబర్, నవంబర్ నెలల్లో భారీ వర్షాలు, తుపాన్లు విరుచుకుపడటం పరిపాటిగా మారింది. గతేడాది పై-లీన్, హెలెన్ తుపాన్లు, అంతకు ముందు ఏడాది నీలం, దానికి ముందు ముందు లైలా, జల్ తుపాన్లు జిల్లా రైతుల్ని కోలుకోలేని దెబ్బతీశాయి. మత్స్యకారులు, లంక గ్రామాల ప్రజలు జీవనాధారాన్ని కోల్పోయేలా చేశాయి. హుదూద్ తుపాన్ ముప్పు ఉందంటూ రెండో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేయడంతో మత్స్యకారులకు వేటకు వెళ్లడానికి జంకుతున్నారు. ప్రస్తుతం మెట్టలో వరి కోతలు మొదలు కాగా, మిగతా ప్రాంతాల్లో వరి కంకులు పాలు పోసుకునే దశలోను, గింజలు గట్టిపడే దశలోను ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో హుదూద్ తుపాను ప్రభావం జిల్లాపై పడితే ఇబ్బందులు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
‘తుఫాన్’పై యంత్రాంగం అప్రమత్తం
సాక్షి, కాకినాడ: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పెను తుఫాన్‌గా మారడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అండమాన్ రాజధాని పోర్టుబ్లెయిర్‌కు 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ పెను తుఫాన్ ఈ నెల 12న కళింగపట్నం-గోపాల్పూర్ మధ్య తీరాన్ని దాటనుంది. ఈ తుఫాన్ తీరం దాటే వరకు తీరం వెంబడి 130 కిలో మీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అలాగే ముందస్తుగా కాకినాడ పోర్టులో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్నారు. తుఫాన్ పునరావాస చర్యల్లో పాల్గొనేందుకు జిల్లా అధికార యంత్రాంగమంతా అప్రమత్తమైంది. అవసరమైతే కనీసం మూడురోజుల పాటు జన్మభూమి-మా వూరు కార్యక్రమాన్ని వాయిదా వేయాలని రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు జిల్లా అధికారులను ఆదేశించారు. జన్మభూమి-మావూరు కార్యక్రమంతో పాటు ముందు జాగ్రత్త చర్యలపై బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. జిల్లాలోని తీర మండలాల ప్రజలను అప్రమత్తం చేయాలని కృష్ణారావు అధికారులకు సూచించారు. మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లకుండా టాంటాంలు వేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ తుఫాన్ కారణంగా ముందస్తు చర్యలపై చర్చించేందుకు గురువారం సాయంత్రం ఐదు గంటలకు కాకినాడ విధాన గౌతమి హాలులో జిల్లా అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనంతరం ఆరు గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్, ఏడు గంటలకు ఎంపీడీఒలు, తహశీల్దార్లు, ప్రత్యేకాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రానున్న తుఫాన్ ప్రమాదాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగాముందుగానే అవసరమైన నిత్యావసర సరుకులను మండలల్లో సిద్ధంగా ఉంచాలని పౌరసరఫరాల శాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. అవసరమైన మందులను సిద్ధంగా ఉంచడంతో పాటు తుఫాన్ షెల్టర్లను సిద్దంగా ఉంచాలని, అన్ని మంచినీటి ట్యాంకులను పూర్తిగానీటితో నింపాలని సూచించారు. 10వ తేదీ నుంచి తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అందుకు తగ్గట్టుగా అధికారులు సిద్ధం కావాలన్నారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. మండల ప్రత్యేకాధికారులు ఆయా మండలాల్లోనే మకాం వేసి అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాన్ సందర్భంగా ఎంతటి విపత్కర పరిస్థితిైనె నా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో జేసీ ఆర్.ముత్యాలరాజు, ఏజేసీ మార్కండేయులు, సీపీఒ విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.