
కూపన్స్ కోసం ఎగబడి ప్రాణాలు కోల్పోయారు!
చైనా: నూతన సంవత్సరం వేడుకలు చైనాలో విషాదం నింపడానికి ప్రధాన కారణం డాలర్ బిల్లు కూపన్సేనట. డాలర్ బిల్లు కోసం ఎగబడటంతోనే ఈ దారుణం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. షాంఘై పట్టణంలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా లక్షల్లో జనాలు ఓ రివర్ ఫ్రంట్ బండ్ మైదానం వద్ద గుమికూడిన సందర్భంగా అక్కడ ఉన్న బిల్డింగ్ మూడో అంతస్థు నుంచి యూఎస్ డాలర్లతో సమానమైన కూపన్స్ ను విసరడంతోనే తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది.
గతరాత్రి 11.35 గంటలకు ఈ దుర్ఘటనలో 35 మంది మృతి చెందగా, అధిక సంఖ్యలో గాయపడ్డారు. న్యూఇయర్ వేడుకలకు షాంఘై పట్టణంలోని రివర్ ఫ్రంట్ బండ్ కు అత్యధిక ప్రాముఖ్యత ఉంది. కొత్త సంవత్సర వేడుకలను ఘనంగా చేసుకునే క్రమంలో మూడు లక్షలకు మందికి పైగా ప్రజలు ఇక్కడకు హాజరు కావడం.. ఆపై తొక్కిసలాట జరగడం చైనాలో తీవ్ర విషాదాన్ని నింపింది.