తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చైనా పర్యటన మూడోరోజు కొనసాగుతోంది. గురువారం కేసీఆర్ బృందం డెలియన్ నుంచి షాంఘై చేరుకుంది.
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చైనా పర్యటన మూడోరోజు కొనసాగుతోంది. గురువారం కేసీఆర్ బృందం డెలియన్ నుంచి షాంఘై చేరుకుంది. ఈ సందర్భంగా షాంఘైలోని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని కేసీఆర్ బృందం సందర్శించనుంది. అలాగే ఇవాళ సాయంత్రం పారిశ్రామిక వేత్తలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. తెలంగాణలో పెట్టుబడుల పెట్టాల్సింది కేసీఆర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం తరఫున పారిశ్రామికవేత్తలకు కేసీఆర్ విందు ఇవ్వనున్నారు. కాగా తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా కేసీఆర్ చైనా పర్యటన జరుగుతోంది.