చైనాలో బిజీబిజీగా గడుపుతున్న కేసీఆర్ | china tour:telangana cm kcr met Vaandaa Company Representatives | Sakshi
Sakshi News home page

చైనాలో బిజీబిజీగా గడుపుతున్న కేసీఆర్

Published Sat, Sep 12 2015 11:20 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

చైనాలో బిజీబిజీగా గడుపుతున్న కేసీఆర్ - Sakshi

చైనాలో బిజీబిజీగా గడుపుతున్న కేసీఆర్

హైదరాబాద్ : చైనా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బిజీబిజీగా గడుపుతున్నారు. ఆరో రోజు పర్యటనలో భాగంగా కేసీఆర్ బృందం బీజింగ్లోని చొంక్వింగ్‌ ఇంటర్నేషనల్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ ప్రతినిధులతో భేటీ అయింది.  తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పన,  ప్రాజెక్టులపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

ఇప్పటికే న్యూఢిల్లీ, బీహార్‌లలో ప్రాజెక్టులు చేపట్టిన చొంక్వింగ్‌ ఇంటర్నేషనల్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌.. తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తోంది. అలాగే బీజింగ్‌లో పలు కంపెనీలతో కేసీఆర్‌ బృందం భేటీ కానుంది. చైనా రైల్వే కార్పొరేషన్‌, ఇన్సూరెన్స్‌ గ్రూప్‌, చైనా ఫార్చూన్‌ ల్యాండ్‌, గ్రీన్‌ సిటీ లిమిటెడ్‌, శాని గ్రూపులతో భేటీలు జరగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement